వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు,
రేఖా చిత్రం
స్టీము క్రేన్ కు అనుసంధానమైన బాయిలరు

వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు లేదా వెర్టికల్ బాయిలరు అనునది స్టీము/నీటి ఆవిరిని తయారు చేయు నిలువుగా స్తుపాకారంగా వుండు బాయిలరు. ఈ బాయిలరులో తక్కువ పొడవు వున్న ఎక్కువ వ్యాసం వున్న రెండు మూడు వాతరు ట్యూబులు ఉన్నను వాటరు ట్యూబు బాయిలరుగా పరిగణించరు.బాయిలరు ఒక యంత్ర పరికరం.ఇది ఒకలోహనిర్మాణం. బాయిలరు అనగా అన్ని వైపుల మూసి వేయ బడి ఉష్ణం ద్వారా పీడనం కల్గిన నీటి ఆవిరి/స్టీమును ఉత్పత్తి చెయ్యు లోహనిర్మాణం.బాయిలరొని నీటిని వేడి చెయ్యుతకు ఇంధనాన్ని మండించెదరు. వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు తక్కువ స్థాయిలో స్టీము ఉత్పత్తి చెయ్యును. దీనిని చిన్న డాంకీ బాయిలరు అని వ్యవహరిస్తారు. ఈ వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరును వించెస్ (winches), స్టీము క్రేన్ (steam cranes) లను ఆపరేట్ చెయ్యుటకు విరివిగా ఉపయోగిస్తారు. ఈ బాయిలరు సరిగా పని చేయుటకు దీనికి అనుబంధంగా ఫీడ్ పంపు, సేప్టి వాల్వు, వాటరు గేజి, స్టీము వాల్వు, బ్లోడౌన్ వాల్వు వంటివి అదనంగా బాయిలరుకు బిగించబడి వుండును. [1][2] .

వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు చిన్నదిగా వుండి తక్కువ ట్యూబులు కల్గి ఉన్నందున నిర్మాణం సులభంగా ఉండి, దృఢంగా తయారుచెయ్యు వెసులుబాటు ఉంది. కాని పరిమాణంలో చిన్నదిగా ఉన్నందున తక్కువ పరిమాణంలో మాత్రమే స్టీము ఉత్పత్తి అగును. అందువలన తక్కువ పరిమాణంలో స్టీము అవసరాలకు మాత్రమే ఈ బాయిలరు ఉపయుక్తం. బాయిలరులో ట్యూబులు పరిమిత సంఖ్యలో ఉండటం వలన బాయిలరు హిటింగు సర్ఫేస్ ఏరియా అనగా వేడిఅగు ఉపరితల వైశాల్యం తక్కువ. అందువల్ల స్టీము ఉత్పత్తి సామర్ద్యం తక్కువ, కాని బాయిలరు లోపల ఎక్కువ ఘనపరిమాణంలో ఖాలీ ఉన్నందున ఎక్కువ ఘన పరిమాణంలో స్టీము నిలువ ఉండు సదుపాయం ఉన్నది క్రేన్ వంటి వాటికి స్టీము కంటిన్యూయసుగా అవసరం లేనందున, ఈ బాయిలరు వాటిని ఆపరేట్ చెయ్యుటకు ఉపయోగకరం.

బాయిలరు నిర్మాణం[మార్చు]

ఈ బాయిలరు నిలువుగా స్తుపాకారంగా వుండును.లోపల వున్న నిలువు గుల్ల (shell) స్తుపాకార నిర్మాణం వెలుపల మరో నిలువు స్తుపాకార నిర్మాణం వుండును.లోపలి స్తూపాకర ంపైభాగం చాపం వలె వంపుగా వుండి దానుండి ఒక గొట్తం వెలుపలి స్తూపాకర నిర్మాణం చాపకారపు కప్పుకు అతుకబడి వుండును.లోపలి పొడవైన స్తుపాకార నిర్మాణాని ఫైరు బాక్సు అంటారు.లోపలి ఫైరు బాక్సు నిర్మాణం పైభాగం ఉబ్బుగా వుండి దాని మీద ఒక ఫ్లూ గ్యాస్ గొట్టం బయటి షెల్ వరకు వుండును.దానిని బయట వున్న పొగ గొట్టానికి కలుపబడి వుండును.కొన్ని బాయిలరులో లోపలి ఫైరు బాక్సు పైభాగం, బయటి షెల్ పై లోపలి భాగాన్ని కలుపు తూ స్టే రాడులు ఉండును.ఈ ఉక్కు కడ్డీల వలన బాయిలరు స్తూపాకార నిర్మానికి రూపద్రుడత్వం ఏర్పడును.లోపలి ఫైరు బాక్సు ఎత్తు బయటి స్తుపాకార నిర్మాణం ఎత్తులో సగం వరకు వుండును. ఫైరు బాక్సులో ఏర్పడిన ఫ్లూ వాయువులు ఫైరు బాక్సు పై బాగంనున్నఒక గొట్టం ద్వారా బయటి షెల్ పై భాగం చేరి అక్కడి నుండి చిమ్నీకి వెళ్ళును. బయటి, లోపలి ఫైరు బాక్సు మధ్య ఖాళీలో నీరు నింపబడి వుండును.ఫైరు బాక్సులో క్రాసుగారెండు పైపులు /గొట్టాలు వుండును. క్రాసు పైపు వున్న భాగాన్ని క్రాసు బాక్సు అంటారు. అలాగే వాటి దిగువున మరో గొట్టం వుండును.ఈ గొట్టాల ద్వారా నీరు ఒకపక్క నుండి మరో పక్కకు వ్యాపిస్తుంది.ఫైరు బాక్సు స్తుపాకార నిలువు గోడలు, ఈ స్టీలు క్రాసు గొట్టాల ద్వారా ఫ్లూ గ్యాస్ వేడి/ఉష్ణం నీటికి ఉష్ణ సంవహనము వలన వ్యాప్యి చెంది నీరు వేడెక్కి స్టీము ఏర్పడును. ఫైరు బాక్సు లోపలి పైపులు ఎక్కువ వ్యాసం కల్గి నీటిని కల్గి వున్నను, ఈ బాయిలరును వాటరు ట్యూబుబాయిలరుగా భావించరు.ఫైరు బాక్సులోని ఈ క్రాసు గొట్టాలు భూ సమాంతరంగా లేదా కొద్దిగా ఏటవాలుగా వుండును.[3]

బయటి స్తూపాకర షెల్ పైభాగాన ఒక పెద్ద మాన్ హోల్ వుండును.మాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్లి బాయిలరును తనిఖీ చేసుకోవచ్చు.అలాగే బాయి లరు అదనంగా రెండు చిన్న హ్యాండ్ హోల్సు ఫర్నేసు/ఫైరు బాక్సులో వున్న క్రాసుపైపులకు ఎదురుగా వుండును. బాయిలరు నిర్వహణ లేదా మరమత్తుల సమయంలో వీటిని తెరచి పైపుల్లో జమయ్యిన బురద వంటి దానిని హ్యాండ్ హోల్సుతెరచి లోపలి భాగాలు క్లీన్ చెయ్య వచ్చును. బాయిలరు ఫైరు హోల్ ద్వారా బయటి లోపలి షెల్ బాగాలులోపలి ఫైరు బాక్సు అతుకకబడి వుండును.ఫైరు హోల్ కు రంధ్రాలున్నతలుపు వుండును.ఫైరు బాక్సులో గ్రేట్ అను నిర్మాణం వుండును. గ్రేట్ లోకాస్ట్ ఐరన్ పలకలను ఒకదానిపక్క మరొకటి చొప్పున పేర్చి వుండును.పలకల మధ్య ఖాళి వుండి, ఈ ఖాలిల గుండా ఘన ఇంధనాన్ని మండించగా ఏర్పడిన బూడిద కింద వున్న బూడిద గుంతలో పడును[3].

బాయిలరు పని చెయ్యు విధానం[మార్చు]

మొదట బాయిలరులో కావాల్సిన వరకు నీటిని నింపి, ఫైరు బాక్సు గ్రేట్ మీద బొగ్గును పేర్చి మండించెదరు.గ్రేట్ మీద బొగ్గు మండటం వలన వేడి వాయువులు ఏర్పడును.వేడి వాయువులు ఫైరు బాక్సు గుండా క్రాస్ బా క్సును దాటుకుని పైకి వెళ్ళునపుడు ఉష్ణతా సంవహనము చర్య వలన లోపలి షెల్/డ్రమ్ములోని నీరు వేడెక్కును.నీరు మరింతవేడెక్కి స్టీముగా మారి బయటి షెల్ పైభాగాన జమ అవడం మొదలగును. తగినంత పీడ నంతో స్టీము జమ అయిన తరువాత బాయిలరు పైభాగాన వున్న స్టీము వాల్వును తెరచి స్టీమును అవసరమున్న చోట ఉపయోగిస్తారు. ఇంధనం/బొగ్గు కాల్చగా ఏర్పడిన బూడిద గ్రేట్ పలకలకున్న రంధ్రాల ద్వారా కింద నున్న బూడిద గుంత/యాష్ పిట్ లో జమగును.ఏర్పడిన బూడిదను బాయిలరు సహాయకుడు, షవల్ పారలతోతీసి ట్రాలీలో వేసి బూడిద ప్రాంగాణానికి తరలిస్తాడు.

బాయిలరులో వుండు భాగాలు[మార్చు]

 • బయటి నిలువు స్తూపాకరం
 • లోపలి నిలువు స్తూపాకరం
 • క్రాస్ పైపులు
 • ఫైరు బాక్సు
 • గ్రేట్
 • బూడిద గుంట
 • తనిఖీ చెయ్యు మ్యాన్ హోల్స్, హండ్ హోల్స్
 • పొగ గొట్టం

బాయిలరు అనుబంధ ఉపకరణాలు[మార్చు]

 • వాటరు ఫీడ్ పంపు
 • ప్రెసరు గేజి
 • వాటరు గేజి
 • సేఫ్టీ వాల్వు
 • స్టీము, చెక్ వాల్వులు
 • బ్లో డౌన్ వాల్వు

బాయిలరు వినియోగం[మార్చు]

 • 1.రోడ్డు మీద నడుపు చిన్న సైజు ఆవిరి లారీ (steam lorry) లేదా స్టీము వాగన్ (steam waggon) లను నడుపుటకు ఈ రకపు బాయిలరును అమర్చేదరు.
 • 2.స్టీము ట్రాక్టరులో కూడా ఈ బాయిలరు అమర్చేదరు.
 • 3.చిన్న తరహా పడవల్లో పవరు ఉత్పత్తికి ఈ బాయిలరు వాడెదరు.
 • 4.steam donkeysలో (అనగా స్టీముతో పని చేయు వించ్ లలో) వాడెదరు.

బాయిలరు లోనిఅనుకూలతలు[మార్చు]

 • తక్కువ నిర్మాణ, స్థాపక ఖర్చులు
 • తక్కువ నిర్వహణ ఖర్చులు
 • సులభంగా ఎక్కడైన ఉంచవచ్చు మరో చోటికి తరలించ వచ్చును.
 • బాయిలరును ఆపరేసను చాలా సులభం
 • బాయిలరు తక్కువ స్థలం ఆక్రమించును

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈవ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/అధారాలు[మార్చు]

 1. Milton, J. H. (1961) [1953]. Marine Steam Boilers (2nd ed.). Newnes. pp. 70–77.
 2. Stokers Manual ((1912 edition) ed.). Admiralty, via HMSO, via Eyre & Spottiswoode. 1901.
 3. 3.0 3.1 "Simple vertical boiler". mechanical-engineering-info.blogspot.in. Retrieved 11-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)