కోర్నిష్ బాయిలరు
కోర్నిష్ బాయిలరు ఒక ఫైరు ట్యూబు బాయిలరు. బాయిలరు అనగా నీటిని ఆవిరిగా మార్చు లోహనిర్మాణం. బాయిలరులో నీటి ఆవిరిని వాతావరణ పీడనం కన్న ఎన్నో రెట్లు ఎక్కువ పీడనంతో ఉత్త్పత్తి చెయ్యవచ్చును.కోర్నిష్ బాయిలరు నిడివైన బాయిలరు. కోర్నిష్ బాయిలరులో 10-12 బార్ వరకు స్టీమును ఉత్పత్తి చెయ్యవచ్చును.
స్టీము ఉపయోగాలు
[మార్చు]స్టీము వలన పెక్కు ప్రయోజనాలు ఉన్నాయి.స్టీముతో పనిచేయు ఆవిరి యంత్రంను కనుగోనడంతో ప్రపంచ పారిశ్రామిక రంగంలో వేగం పుంజుకుంది. ఆవిరి యంత్రాన్ని పరిశ్రమల్లో ఇతర యంత్రాలను తిప్పుటకు ఉప యోగిం చడం వలన ఉత్త్పత్తి ఎంతో పెరిగింది.రైలు, రోడ్డు లోకోమోటివ్‌ల వలన సరుకులను ఒకచోటు నుండి మరోచోటుకు వేగంగా చేర వెయ్యడంతో వాణిజ్యం కొత్త పుంతలు తొక్కింది.పీడనం పెరిగే కొలది స్టీము/ఆవిరి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. స్టీము యొక్క ఉష్ణోగ్రతను ఉపయోగించుకుని పరిశ్రమలలో ఇతర రసాయనాలను, ద్రవాలను వేడి చేస్తారు.కాగితం పరిశ్రమలలో కాగితపు గుజ్జును మొత్తగా ఉడికించుటకు స్టీమును ఉపయోగిస్తారు. అధిక పీడనం వున్న స్టీమును ఉపయోగించి విద్యుతు ఉత్పాదిక కేంద్రాలలో టర్బైనులను తిప్పి విద్యుతు ఉత్పత్తి చేస్తారు.అధిక పీడనం వున్న స్టీమును ఆవిరి యంత్రం ద్వారా యాంత్రికశక్తిగా మార్చ వచ్చు. స్టీము లోకోమోటివ్ లను స్టీము ద్వారానే నడిపారు. నూనె శుద్ధి పరిశ్రమలలో స్టీమును ఉపయోగించి వాక్యుములో అధిక ఉష్ణోగ్రత వరకు వేడిచేసి నూనెను శుద్ధి చేస్తారు. వాక్యుం (వాతావరణ పీడనం కన్న తక్కువ పీడన స్థాయి) ను కూడా అధిక పీడనం వున్న స్టీమును ఎజెక్టరులలో పంపి సృష్టించెదరు. హీట్ ఎక్చెంజరుల ద్వారా ఇతర ద్రవ, వాయు పదార్థాలను వేడి చేస్తారు. కొన్ని సందర్భాలలో స్టీమును నేరుగా రసాయన పదార్థాల లోకి పంపి వేడి చేస్తారు. భిన్న సాంద్రతలు వున్నా ద్రవాలు ఒకటికన్నఎక్కువ కలిసి వున్నప్పుడు స్టీమును ఉపయోగించి వేడి చేసి దశల వారిగా వాటిని వేరు చేస్తారు.
బాయిలరు చరిత్ర
[మార్చు]కోర్నిష్ బాయిలరును 1812 లో కోర్నిష్ గనులకు చెందిన ఇంజనీరు రిచర్డ్ ట్రేవితిక్ (Richard Trevithick) కనుగొన్నాడు.[1] అంతకు ముందు తాను 1803 కనుగొన్న తన ఆవిరి యంత్రానికి 50 పౌండ్ల పీడనం స్టీమును ఇవ్వగలిగే విధంగా తయారు చేసిన ఈ బాయిలరు విజయ వంతం కావడంతో 20 వ శాతాబ్దిలో పళ్లెమువంటీ చివరలు (Dished End ) వున్న బాయిలరు వాడుకలోకి తెచ్చాడు.
1702 లో థామస్ సవెరీ (Thomas Savery) అనే ఆంగ్లేయుడు మొదటగా స్టీము బాయిలరును తయారు చేసినట్లు తెలుస్తున్నది.
కోర్నిష్ బాయిలరులోని ప్రధాన భాగాలు
[మార్చు]- 1.ప్రధాన స్టీము డ్రమ్ము లేదా షెల్
- 2.ఇటుకల గూడు నిర్మాణం
- 3.పొగ గది
- 4.పొగగొట్టం
- సిలిండరు పైభాగన మ్యాన్ హోలు (పర్యవేక్షక బిలం)
కోర్నిష్ బాయిలరు నిర్మాణం పని చేయు విధం
[మార్చు]కోర్నిష్ బాయిలరు పొడవుగా స్తుపాకారంగా వుండును.బాయిలరు షెల్ పొడవు 4 నుండి 7 మీటర్లు వుంది, వ్యాసం 1.2 నుండి 1.8 మీటర్లు వుండును.[2] కొన్ని బాయిలరులు 1.5 మీటర్ల వ్యాసంతో 5.5 మీటర్లపొడవు వుండును.ఈ బాయిలరులో ఫర్నేసు ట్యూబు వ్యాసం 90 సెం.మీ వుండును.దానిలోణీ గ్రేట్ 1.8 మీ పొడవు వుండును[3] ఈ బాయిలరు క్షితిజసమాంతరంగా భూమి పైన ఇటుకలతో గదులవలె నిర్మితమైన ఫర్నేసు/కొలిమి పైన అమర్చి వుండును. కోర్నిష్ బాయిలరు ఫైరు ట్యూబు రకానికి చెందిన బాయిలరు అయినను పెక్కు ఫైరు ట్యూబులు ఉండవు.ఇది షెల్ అండ్ ట్యూబు రకానికి చెందిన బాయిలరు. ఆకృతిలో ఇది లాంకషైర్ బాయిలరును పోలి వుండును.కాని లాంకషైర్ బాయిలరులో రెండు ఫర్నేసు గొట్టాలు/వేడి గాలుల/ఫైరు ట్యూబులు ఉండగా కోర్నిష్ బాయిలరులో కేవలం ఒక ఫైరు ట్యూబు/ఫ్లూ గ్యాస్ ట్యూబు వుండును.ఫ్లూ (Flue) అనగా పొగ అని అర్థం.ఇంధనంను మండించగా వేడి వాయువులు పొగలా ఏర్పడం వలన ఈ గొట్టాన్ని ఫ్లూట్యూబు అంటారు.ఇంధనాన్ని ఇక్కడే మండించడం వలన ఫైరు ట్యూబు అని కూడా అంటారు. ఫ్లూ ట్యూబు ముందు భాగంలో కొంత పొడవు వరకు గ్రేట్/పొయ్యి అను నిర్మాణం వుండును. గ్రేట్ మీద ఇంధనాన్ని చేర్చి మండించేదరు. ఇంధనాన్ని, షెల్ లోని ఫ్లూ ట్యూబులోనే మండించడం వలన ఈ బాయిలరును అంతర్గత ఫర్నేసు బాయిలరు అంటారు.బాయిలరు షెల్ లో నీరు సహజ ప్రసరణ విధానంలో ప్రసరణ అగును.స్తూపాకారంగా వున్న డ్రమ్మును మూడు గదులుగా వున్న ఇటుక నిర్మాణం పై వుంచెదరు. మూడూ గదుల్లో రెండూ సిలిండరు/స్తూపాకార డ్రమ్ము/పీపాకు రెండూ వైపుల అర్ద్గవృత్తభాగాన్ని దాటి వుండేలా కట్టబడి వుండంగా, మధ్య గది సిలిండరికల్ షెల్ అడుగు భాగాన వుండును.ఫ్లూ ట్యూబు లోణని వేడీ వాయువులు ఈ మూడు గదుల్లో నుండి పయనించును.
ఫ్లూట్యూబు స్తూపాకార నిర్మాణానికి ఈ చివర నుండి ఆ చివర వరకు వుండి రెండు వైపుల తెరచుకుని వుండును. ముందు వైపు ఫైర్ గ్రేట్ వుండును.ఫ్లూ ట్యూబులో 1/4 పొడవు వంతు గ్రేట్ వుండును.వేడి వాయువులు ఫైరు ట్యూబు గోడలను తాకుతూ వెళ్ళు నపుడు వేడి వాయువుల ఉష్ణోగ్రత బాయిలరు షెల్ లోపల వున్న నీరు ఉష్ణ సంవహకక్రియ ద్వారా గ్రహించి వేడెక్కును.షెల్ చివరకు చేరిన వేడి వాయువులు బాయిలర్ షెల్ కు రెండు పక్కల వర్తులాకార ఉపరితలం చుట్టూ నిర్మించిన ఇటుకల నిర్మాణం ద్వారా పయనించి స్తుపాకారా గొట్టం ముందు భాగం వైపుకు వచ్చును.ఇలా వేడి వాయువులు షెల్ పక్క భాగంలో నీరు వుండు భాగం వెలుపలి తలాన్ని తాకుతూ రావడం వలన షెల్ ఇరుపక్కల లోపల వున్న నీరు వేడెక్కును.ముందు భాగానికి వచ్చిన వాయువులు అడుగున వున్న గదిలోకి వెళ్ళును.వేడి వాయువులు ఇటుక నిర్మాణంలో షెల్ అడుగు భాగం వున్న మార్గం గుండా వెనుక భాగం వైపు పయనిస్తూ, బాయిలరు షెల్ కింది వెలుపలి తలాన్ని తాకుతూ ప్రయాణించి, షెల్ ఫ్లూ ట్యూబు /ఫైరు ట్యూబు కింద వున్న నీరును వేడి చేయ్యును.చివరికి వేడి వాయువులు షెల్ చివర/వెనుక భాగాన వున్నా పొగ గది చేరును.అక్కడి నుండి డాంపరు ప్లేటు ద్వారా పొగ గొట్టానికి వెళ్ళును.[4]
స్టీము ఉత్పత్తి సామర్ధ్యం
[మార్చు]ఈ బాయిలరులో గరిష్ఠంగా గంటకు 1350 కిలోల స్టీమును 12 బార్ (అనగా ఇంచుమఇంచు 12kg/cm2పీడనం) వత్తిడితో ఉత్పత్తి చెయ్య వచ్చును[2].
బాయిలరు ఉపకరణాలు
[మార్చు]- 1.ఫీడ్ పంపు, ఇంజెక్టరు
- 2.సేఫ్టి వాల్వు: సాధారణంగా హై ప్రెసరు స్టీము లోవాటరు లివరు సేఫ్టి వాల్వును ఉపయోగిస్తారు.డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు కూడా ఉపయోగిస్తారు.
- 3.స్టీము స్టాప్ వాల్వు
- 4.ఫీడ్ చెక్ వాల్వు
- 5.బ్లో డౌన్ వాల్వు
- 6.వాటరు గేజి
- 7.ప్రెసరు గేజ్
ఇంధనం
[మార్చు]ప్రధానంగా బొగ్గు లేదా ఘన జీవద్రవ్య ఇంధనాలు.
బాయిలరు సహాయకుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
[మార్చు]ఇంధనాన్ని బాయిలరు సహాయకుడు పారలతో గ్రేట్ లో వేస్తాడు.అలాగే బూడిద గుంటలో జ మ అగు బూడిదను పారలతో లాగి ట్రాలిలో వేసి బూడిద నిల్వ స్థావరానికి తరలిస్తాడు. సహా యకుడు ఇంధనాన్ని నింపేటప్పుడు, బూడిద తొలగించు సమయంలో తగినంత దూరంగా వుండి చెయ్యాలి. గ్రేట్ మీద బొగ్గును అటునిటు కదుపుటకు కనీసం 2.5 మీటర్ల పొడవున్న ఇనుప రాడ్ ను ఉపయోగించాలి.
బయటి లింకుల వీడియోలు
[మార్చు]ఈ వ్యాసాలు కూడా చదవండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ "Cornish Boiler". gracesguide.co.uk. Retrieved 2018-02-10.
- ↑ 2.0 2.1 "Cornish Boiler". green-mechanic.com. Retrieved 2018-02-10.
- ↑ "The Cornish Boiler". croftonbeamengines.org. Retrieved 2018-02-10.
- ↑ "The Cornish Boiler". nrwgra.com. Archived from the original on 2019-10-11. Retrieved 2018-02-10.