కొక్రేన్ బాయిలరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొక్రేన్ బాయిలరును ముఖ్యంగా ఓడ ల్లో/నౌకల్లో ఉపయోగిస్తారు.దీనిని స్కాట్లండుకు చెందిన కొక్రేన్ అండ్ కో వాళ్ళు తయారు చేసారు.ఓడల్లో వాడు ఈ బాయిలరులో బొగ్గు లేదా ఆయిల్ ను ఇంధనంగా వాడెదరు.లేదా ఓడల్లోని డీజల్ ఇంజన్ల నుండి వెలువడు వేడివాయువుల వేడిని పొందుటకై కుడా ఉపయోగిస్తారు.కొక్రేన్ బాయిలరు ఫైరు ట్యూబు బాయిలరు రకానికిచెందిన బాయిలరు.లాంకషైర్ బాయిలరు కూడా ఫైరు ట్యూబు బాయిలరు.కాకపోతే లాంకషైర్ బయటి షెల్ క్షితిజ సమాంతరంగా పొడవుగా వుండును.

నిర్మాణ ఆకృతి[మార్చు]

ఈ బాయిలరు వెలుపలి నిర్మాణం నిలువుగా వున్న స్తూపాకరంగా వుండి, పైన అర్థ గోళాకార పైకప్పు (doom) కల్గి వుండును. ఆంగ్లంలో దీనిని Vertical boiler with horizontal fire-tubesఅందురు. బాయిలరు ఫైరు బాక్సు, నిలువు స్తూపాకారనిర్మాణం అడుగున అర్థ గోళాకారంలో నిర్మింపబడి వుండును.ఫైరు బాక్సు సిలిండరికల్ నిర్మాణ అడుగు భాగనా రివిట్ చెయ్యబడి వుండును. బాయిలరు ఫైరు ట్యూబులు వరుసగా క్షితిజసమాంతరంగా ఫైరు బాక్సుకు పైనవున్న దహనగదిలో (combustion chamber) లో పలు వరుసలలో అమర్చబడి వుండును. ఈ ట్యూబులు నిలువుగా మందంగా వున్న రెండు కార్బన్ స్టీలు పలకలకు (steel plates) కు అమర్చబడి వుండును.ట్యూబుల ముందు భాగాన ఫైరు పైపు నుండి వచ్చు వేడి ఇంధన వాయువులు సులువుగా ప్రయానించుటకు దహన గది వుండును.ట్యూబుల వెనుక వైపు నుండి వ్యర్థ ఇంధనవాయువులు స్మోక్ బాక్సుకు వెళ్లి అక్కడినుండి చిమ్నివెళ్లి దానిద్వారా వాతావరణం లోకి వెళ్ళును.బాయిలరు నుండి చిమ్నికి వెళ్ళు వేడి వాయువుల వేగాన్ని నియంత్రించుటకు స్మోక్ బాక్సుకు నియంత్రణ పలక (damper plate) అమ ర్చ బడి వుండును. దీనిని పైకి కిందికి జరపడం ద్వారా బయటకు వెళ్ళు వాయువుల వేగాన్ని నియంత్రించేందరు.

సాధారణంగా కొక్రేన్ బాయిలర్లు 4.6-6.0 మీటర్ల ఎత్తు,2.1-2.75 మీటర్ల వ్యాసం కల్గి వుండును.ఈ పరిమాణపు బాయిలరు ట్యూబుల హిటింగు సర్ఫేస్ ఏరియా (వేడి చెయ్యు ఉపరితల వైశాల్యం) 46మీటరు2 (అనగా 500-550 చదరపు అడుగులు), ఇంధనాన్ని మండించు కొలిమి/గ్రేట్ వైశాల్యం 2.2-2.5 చదరపు మీటర్లు వుండును.ఇక బాయిలరు 7 నుండి 9kg/cm2 (100 నుండి125 psi.) ప్రెసరులో స్టీమును ఉత్పత్తి చెయ్యును.

కొక్రేన్ బాయిలరులో ఉండు బాగాలు[మార్చు]

షెల్(shell)[మార్చు]

ఇది బాయిలరు యొక్క బహ్య నిర్మాణం.ఇది నిలువుగా స్తూపాకరంగా వుండి, పై భాగాన అర్థ గోళాకారంగా వున్న స్టీలు/ఉక్కు లోహ నిర్మాణం.అధిక వత్తిడి, ఉష్ణోగ్రతను తట్టుకోనేలా, బాయిలరు తయారి చట్టం, నిబంధనలలో పేర్కొన్న ప్రకారం ప్రతేకమైన స్టీలుతో చెయ్యబడి వుండును.

గ్రేట్[మార్చు]

ఇది సాధారణంగా కాస్ట్ ఐరన్/చే నిర్మాణమై వుండును.ఇది పొడవాటి పలు పలకలను కలగి అవి వరుసగా పేర్చబడి వుండును.పలకల మధ్య ఖాళి వుండును.ఈ ఖాళి ద్వారా ఇంధనం మండుటకు అవసరమైన గాలి సరఫరా అగును.అంతే కాదు ఇందనం కాలిన తరువాత ఏర్పడిన బూడిద ఈరంధ్రాల ద్వారా గ్రేట్ అడుగు భాగానవున్న బూడిద గుంట/యాష్ పిట్ (ash pit) లో జమ అగును.

ఫైరు బాక్సు[మార్చు]

ఇందులో ఇంధనం గాలితో కలిసి మండును.ఇందులో గ్రేట్, దహనగది వుండును. గ్రేట్ మీది ఇంధనం గాలితో కలిసి పూర్తిగా మండుటకు తగినంత పరిమాణం వైశాల్యం దహన గది కల్గివుడును.

ఫ్లూ పైపు[మార్చు]

దహన గదిలో ఏర్పడిన వేడివాయువులు ఈ ఫ్లూపైపు భాగాన్ని చేరును. ఇక్కడి నుండి వేడివాయువులు కంబుసన్ ఛాంబరు చేరి పూర్తిగా దహనం చెంది, వేడివాయువులు ఫైరు ట్యూబుల గుండా పయనించడం వల్ల ఉష్ణసంవహనం/ఉష్ణప్రసరణ వలన ట్యుబుల వెలుపలి ఉపరితలం చుట్తు వున్న నీరు వేడెక్కును.

కంబుషన్ ఛాంబరు(combution chamber)[మార్చు]

ఈ గదిలోనే ఇంధనం గాలితో కలిసి మండి వేడి వాయువులు ఏర్పడును. గ్రేట్ మీదినుండి వచ్చు ఇంధనవాయువులు గాలితో కలిసి పూర్తిగా మండుటకు తగినంత పరిమాణం వైశాల్యం దహన గది కల్గివుడును.

ఫైరు ట్యూబులు[మార్చు]

ఈ ట్యూబులు ఉక్కుతో చెయ్యబడి వుండును. అధిక వత్తిడి, ఉష్ణోగ్రతను తట్టుకొనే లా, బాయిలరు తయారి చట్టం, నిబంధనలలో పేర్కొన్న ప్రకారం ప్రతేకమైన స్టీలతో చెయ్య బడి వుండును.ఫైరు ట్యూబులుగా తక్కువ కార్బన్ వున్న సిమ్ లెస్ (అతుకులేని) లేదా ERW పైపులను వాడెదరు.ఇవి పలు వరుస లుగా ఒకదాని మీద మరొక్కటి వుండేలా అమర్చబడి వుండును.ట్యూబు ప్లేట్ కు ట్యూబుల అంచులను ఎక్సు పాండింగు విధానంలో బలంగా అతికించబడి వుండును.లేదా ప్రస్తుతం చివరిట్యూబుల అంచులను ట్యూబుప్లేటుకు వెల్డింగు చేస్తున్నారు.

చిమ్నీ/పొగగొట్టం[మార్చు]

ఉష్ణ మార్పిడి తరువాత బాయిలరు షెల్ వెనుక భాగం నుండి వెలువడు తక్కువ ఉష్ణోగ్రత వేడి గాలులు (210-220°C) ఈ చిమ్నీ ద్వారా వాతావరణంలో కలియును. మాములుగా ఓడల్లో కాకుందా భూమి మీద పరిశ్రమల్లో వుండు చిమ్నీని స్టాకింగు అని కూడా అంటారు. ఇది ఉక్కుతో లేదా వెలుపల కాంక్రీట్ నిర్మాణమున్న రిఫ్రాక్టరీ ఇటుకలతో స్తూపాకారంగా కనీసం 31 మీటర్ల ( 100 అడుగుల) ఎత్తు నిర్మింపబడి ఉండును.

మ్యాన్ హోల్[మార్చు]

ఇది బాయిలరు షెల్ పైభాగాన ఉన్న అర్థ గోళాకార భాగాన అమర్చబడి వుండును.ఇది సులభంగా మనిషి షెల్ లోపలి వెళ్ళు సైజులో వుండును.సంవత్సరాంత మరమత్తుసమయంలోఆపరేటరు లోపలికివెళ్ళి ట్యూ బులు ఎలా ఉన్నది, స్కేల్ ఏమేరకు ఉన్నది వంటి వి తనిఖి చెయ్యుటకు ఈ మ్యాన్ ఉపయోగ పడును.అలాగే బాయిలరు దిగువ భాగాన మడ్ హోల్ వుండును.దీని ద్వారా బాయిలరు అడుగున సెటిల్ అయ్యే బురద వంటి దాన్నిని తొలగించెదరు.

బాయిలరుకు అదనంగా అమర్చబడి వుండు ఉపకరణాలు[మార్చు]

ఫీడ్ వాటరు పంపు[మార్చు]

Ram Pump
హరిజోటల్ మల్టి స్టెజి వాటరు పంపు

ఇది బాయిలరుకు కావాల్సిన వాటరును బాయిలరుకు పంపింగు చెయ్యును. బాయిలరు వాతావరణ వత్తిడికి కన్న ఎక్కువ వత్తిడిలో ( 9-10Kg/cm2) స్టీము ఉత్పత్తి చేయ్యును.కావున ఫీడ్ పంపు బాయిలరు వర్కింగు ప్రెసరు కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ వత్తిడిలో వాటరును తోడు పంపును బాయిలరుకు అమర్చెదరు. అంతేకాదు బాయిలరు గంటకు స్టీముగా మార్చు నీటి పరిమాణం కన్నరెండితలు ఎక్కువ నీటినితోడు కెపాసిటి కల్గి వుండును.ఫీడ్ పంపుగా గతంలో రెసిప్రోకెటింగ్/రామ్ పంపు వాడెవారు.తరువాత హరిజంటల్ మల్టి స్టెజి సెంట్రిఫ్యుగల్ పంపులను వాడుచున్నారు.కొత్తగా వెట్రికల్ మల్టి స్టేజి పంపులు వాడుకలోకి వచ్చాయి.

గ్లాసు ట్యూబువాటరు లెవల్ ఇండికేటరు గేజ్/వాటరు గేజ్[మార్చు]

బాయిలరులో ఎప్పుడు ఫైరుట్యూబుల మట్టం దాటి నీరు వుండాలి. అప్పుడే ఎటు వంటి ప్రమాదం లేకుండా నీరు స్టీముగా ఏర్పడును. బాయిలరులో ఇంధనం వలన ఏర్పడు వేడి వాయువుల ఉష్ణోగ్రత 1000°C డిగ్రీలు దాటి వుండును.ట్యూబుల మట్టానికి దిగువన వాటరు ఉన్న చో, ఇంతటి ఉష్ణోగ్రత ఉన్న ఫ్లూగ్యాసెస్ ఫైరుట్యూబుల ద్వారా వెళ్ళునపుడు ఉష్ణ వినిమయం జరుగనందున ట్యూబుల ఉష్ణోగ్రత పెరిగి బాయిలరు ట్యూబులు పేలి పోవును.అందువలన బాయిలరు షెల్ లో నీటి మట్టం ట్యూబు బండిల్ కన్నఎక్కువ మట్టం వరకు ఉండటం అత్యంత ఆవశ్యకం.బాయిలరు షెల్ లో వాటరు ఎంత ఎత్తులో నీరు వున్నది ఈ వాటరు గేజ్ వలన తెలుస్తుంది.

ప్రెసరు గేజ్[మార్చు]

ఈ పరికరం బాయిలరులో ఉత్పత్తి అయ్యే స్టీము ప్రెసరును చూపిస్తుంది.

సేప్టి వాల్వు[మార్చు]

స్ప్రింగు లోడేడ్ సెప్టి వాల్వు

బాయిలరు షెల్ లో వర్కింగు ప్రెసరు కన్న ఎక్కువ స్టీము తయారై, ఏర్పడిన స్టీమును అదే ప్రమాణంలో వాడనప్పుడు, బాయిలరులో స్టీము పరిమాణంపెరిగి, అధిక వత్తిడి ఏర్పడి బాయిలరు షెల్ ప్రేలి పోయే ప్రమాదం ఉంది.ఈ సేఫ్టివాల్వు, బాయిలరులో పరిమితి మించి ఎక్కువ ప్రెసరులో ఏర్పడిన స్టీమును బాయిలరు బయటకు విడుదల చెయ్యును.సేఫ్టి వాల్వులు పలురకాలున్నవి.అందులో స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వుఒక రకం

స్టీము స్టాప్ వాల్వు[మార్చు]

ఇది బాయిలరులో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపుకు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.

బ్లోడౌన్ వాల్వు లేదా బ్లో ఆఫ్ కాక్[మార్చు]

బాయిలరులోని TDS ప్రమాణాన్ని తగ్గించుటకు అధిక TDS వున్న నీటిని బయటకు వదులుటకు ఈ వాల్వువును ఉపయోగిస్తారు.ఇది రాక్ అండ్ పినియన్ రకానికిచెందిన కంట్రోల్ వాల్వు.దీనిని ఇత్తడి లేదా కాస్ట్ స్టీలుతో చెయ్యుదురు.

ఫుజిబుల్ ప్లగ్[మార్చు]

ఈ ప్లగ్‌ను ట్యూబు ప్లేట్ పైన ట్యూబుల కన్న కొద్దిగా ఎత్తులో బిగించబడివుండును.ఇది అతితక్కువ ఉష్ణోగ్రతకు కరిగే సీసము (మూలకము) లోహంతో చెయ్యబడివుండి ఏదైనా కారణం చే ఫీడ్ పంపు పని చెయ్యక పోవడం వలన షెల్ లోనినీటి మట్టం ఫుజిబుల్ ప్లగ్ మట్టం కుకన్నతగ్గిన, ఇది కరిగిపోయి, దాని ద్వారా స్టీము, వాటరు కంబుసన్ చాంబరు, ఫైరు బాక్సు లోకి వచ్చి, ఇంధనాన్నిఆర్పి వేయును.

పనిచెయ్యు విధానం[మార్చు]

పైరుబాక్సు లోని గ్రేట్ మీద బొగ్గును/ఇంధనాన్ని చేర్చి ఫైరుహోల్ ద్వారా మండించగా వెలువడిన ఇంధన వాయువులు ఫ్లూ పైపు ద్వారా కంబుసన్ గది చేరి అక్కడ పూర్తిగా దహనం చెంది ఏర్పడిన ఫ్లూ గ్యాసెస్ ఫైరు ట్యూబులగుండా పయనించును.ఈ సమయంలోనే ట్యూబుల గోడలద్వారా ఉష్ణతా సంవహనము (heat convection) ద్వారా వాయువుల ఉష్ణం నీటికి వ్యాప్తి చెంది నీరు వేడెక్కును.ఉష్ణం పెరిగే కొలది నీటి ఉష్ణోగ్రత మరుగు స్థానంకు చేరి నీటిఆవిరి/స్టీము ఏర్పడును.ఇంధన దహనం వలన ఏర్పడిన బూడిద గ్రేట్ కున్న రంద్రాల ద్వారా బూడిద గుంట/ యాష్ పిట్‌లో జమ అగును. జమ అయ్యిన బూడిదను సమయాను కూలంగా తొలగించెదరు. ఫైరు ట్యూబుల రెండో చివరకు చేరిన వేడివాయువులు మొదట స్మోకుబాక్కు/పొగపెట్టెకు అక్కడి నుండి బాయిలరు పొగ గొట్టానికి/చిమ్నీకి వెళ్ళును.[1]

అనుకూలతలు[మార్చు]

  • తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది
  • బాయిలరును ఆపరేట్ చెయ్యడంసులభం
  • బొగ్గుతో పాటుఅన్నిరకాల బయోమాస్ ఘన ఇంధనాలను ఉపయోగించు సౌలభ్యం ఉంది.

అనానుకులతలు[మార్చు]

  • స్టీము నెమ్మదిగా ఉత్పత్తి అగును
  • ఒక్క మ్యాన్ హోల్ మాత్రమే వుండటం వలన తనిఖీలుచెయ్యుట పనుల నిర్వహణ కొద్దిగా ఇబ్బందికరంగా వుండును
  • గరిష్ఠం గా10kg/cm2 వత్తిడి వరకే స్టీమును ఉత్పత్తి సాధ్యం

ఇతర వెబ్ సైట్లవీడియోలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

ఉల్లేఖనలు[మార్చు]

  1. "Cochran boiler". mechanical-engineering-info. Archived from the original on 2017-05-20. Retrieved 2017-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)