బ్లోడౌన్ వాల్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాక్ అండ్ పినియను వాల్వు

బ్లోడౌన్ వాల్వు అనునది ఒక కవాటం. బాయిలరు లోని నీరులో కరిగిన పదార్థాలశాతం/పరిమాణం నిర్దేశించిన స్థాయిని మించినపుడు ఆటువంటి నీటిని పరిమిత కాలంలో కొద్దిప్రమాణమ్లో బయటకు పంపుటకు ఉపయోగించు కవాటమే బ్లోడౌన్ వాల్వు. బాయిలరులోని నీటిని కొన్ని సెకనుల కాలం పాటు బయటికి వదలుటను బ్లోడౌన్ అంటారు[1].

బాయిలరు వాటరును బ్లోడౌన్ ఎందుకు చెయ్యాలి?[మార్చు]

బాయిలరు అనునది స్టీమును ఉత్పత్తి చేయు లోహ నిర్మితమైన మూసి వున్న పాత్ర. ఇందులో నీటిని వేడి చేసిపీడనం, అధిక ఉష్ణోగ్రత కల్గిన నీటి ఆవిరిని తయారు చేయుదురు.నీటి ఆవిరిని ఇంగ్లీషులో స్టీము అంటారు. స్టీము ఒకరకంగా వాయు లక్షణాలు కల్గి ఉన్నప్పటికీ సంపూర్ణమైన వాయువు కాదు. స్టీము వలన పలు పారిశ్రామిక ఉపయోగాలు ఉన్నాయి.ముఖ్యంగా స్టీమును విద్యుతు ఉత్పత్తి కేంద్రాలలో టర్బైను లను తిప్పుటకు ఉపయోగిస్తారు. అలాగే పెట్రోలియం నూనె శుద్ధికరణ పరిశ్రమలలోను, అలాగే పలు పరిశ్రమలో ఇతర ద్రవ, వాయు పదార్థాలను వేడి చేయుటకు ఉపయోగిస్తారు.పీడనం వున్న స్టీమును జెట్ ఎజెక్టరులకు పంపి ఒక వ్యవస్థలో వాక్యుం (పీడన రహిత స్థితి) ని కల్గిస్తారు.స్టీము యొక్క గుప్తోష్ణం కిలోకు దాదాపు 540 కిలో కేలరీలు అందువలన దీనిని ఇతర పదార్థాలను వేడి చేయుటకు విరివిగా ఉపయోగిస్తారు.

స్టీము అనగా నీటి ఆవిరి.అనగా స్టీమును నీటిని వేడి చెయ్యడం వలన స్టీము ఏర్పడును.నీరు హైడ్రోజన్, ఆక్సిజన్ అను మూలక పరమాణుల సంయోగం వలన ఏర్పడును. రెండు హైడ్రోజను పరమాణు వులు, ఒక ఆక్సిజను పరమాణువు సంయోగం వలన ఒక నీటిబిందువు (అణువు) ఏర్పడును. స్వచ్ఛమైన నీటిలో (వర్షపు నీరు స్వేదనజలం (distilledwater) ) కేవలం హైడ్రోజను, ఆక్సిజను అను మూలక పరమాణులు మాత్రమే వుండును.ఇలాంటి స్వచ్ఛమైన నీటిని వేడి చేసి ఆవిరిగా (స్టీము) గా మార్చి నపుడు, నీరు వున్న పాత్ర అడుగు భాగంలో ఎటువంటి ఘన అవశేషాలు మిగలవు.కాని నదులు, కాలువలు, సెలయే రులు, వంకలు, బావుల నుండి సేకరించిన నీటిని ఒక పాత్రలో తీసుకుని, నీరు పూర్తిగా నీటిఆవిరిగా మారువరకు వేడిచేసిన తెల్లని ఘనపదార్ధం పాత్ర అడుగుభాగాన మిగిలిపోవును. ఈ తెల్లని అవశేషా భాగం కాల్షియం, బేరియం, మాగ్నీషియం, సోడియం, వంటి మూలకాల క్లోరేడులు, సల్ఫేట్‌లు, నైట్రేట్‌లు అయ్యి వుండును.వర్షపు నీరులో ఎటువంటి ఇతర పదా ర్థాలు వుండవు.కాని వర్షపు నీరు భూమి మీదపడి ప్రవహిస్తూ వంకలు, వాగులు, కాలువల గుండా ప్రవహిస్తూ, చెరువు లలో, నదుల్లో గుంటలలో చేరునపుడు, భూమి ఉపరితలంలోని పైన పేర్కొన్న మూలకాల సంయోగ పదార్థాలు నీటిలో కరగును.అందువలన ఇలాంటి నీటిని వేడి చేసిన తెల్లని శుద్ధ వంటి పదార్ధం అడుగు న ఏర్పడును.ఇలా నీటిలో కరిగిన పదార్థాలను ఇంగ్లీసులో టోటల్ డిస్లావ్డ్ సాలిడ్స్ (total dissolved solids) అంటారు.తెలుగులో టోకుగా నీటిలో కరిగిన ఘన పదార్థాలు అంటారు.ఇలా కరిగిన ఘనపదార్థాలు నదులు, కాలువలు, చెరువులనీటిలో తక్కువగా వుండగా, బావులు, బోరుబావుల (గొట్టం బావుల) నీటిలో చాలా ఎక్కువ, బావుల లోతు పెరిగే కొలది ఆ నీటిలో కరిగిన పదా ర్థాల శాతం పెరుగును.నీటిలోకరిగిన పదార్థాల సంయోగ పదార్థాల వలన నీటికి కఠినత పెరుగును.బై కార్బోనేటువలన ఏర్పడు కఠినత్వం తాత్కాలికం, నీటిని వేడి చేసిన విడి పోవును.

కాని క్లోరెటులు, నైట్రేటులు, సిలికేటులవలన నీటికఠినత పెరుగును.ఇలాంటి సంయోగ పదార్థాల వలన నీటికి కలుగు కఠినతను శాశ్విత కఠినత అంటారు. ఇలా శాశ్విత కఠినత కల్గిన నీటిని బాయిలరులో స్టీము ఉత్పత్తి కై వాడినపుడు, ఈ కరిగిన సంయోగ పదార్థాల బాష్పిభవన ఉష్ణోగ్రత 400°C దాటి ఉన్నందున, బాయిలరులో కేవలం నీరు మాత్రమే స్టీముగా మారటం వలన, క్రమంగా బాయిలరు నీటిలో ఈ కరిగి వున్న ఘన పదార్థాల పరిమాణం పెరుగుతూ పోవును.ఈ పదార్థాల పరిమాణం పెరిగినపుడు, అవి నీటిలో తేలియాడు తెల్లని చిక్కని పదార్థంగా తయారై, బాయిలరు ట్యూబుల ఉపరితలం (ఫైరు ట్యూబులు) లేదా ట్యూబుల (వాటరు ట్యూబు లు) లోపలి తలంలో తెల్లని పొలుసుల (scale) వలే పేరుకు పోవును. పేరుకు పోవడం వలన ట్యూబుల ఉష్ణవాహక గుణం తగ్గి, వేడి ఫ్లూవాయువుల ఉష్ణోగ్రత నీటికి పూర్తిగా సంహవనం చెందక పోవడం వలన అమితంగా ట్యూబులు వేడెక్కి పగిలి పోవును.అందువలన బాయిలరులో వాడు నీటిలో కరిగిన పదార్థాల సాంద్రత నిర్దేశించిన స్థాయి దాటినపుడు, ఈ కరిగిన పదార్థాల శాతాన్ని బాయిలరు నీటిలో తగ్గించుటకు బాయిలరులోని కొంత నీటిని అతితక్కువ సమయంలో బయటికి వదులుటను బ్లోడౌన్ అంటారు. బ్లోడౌన్ చేయుటకు నీటిని బయటకు వదులు కవాటాన్ని బ్లోడౌన్ వాల్వు అంటారు[2].

బ్లోడౌన్ వాల్వు[మార్చు]

బ్లోడౌన్ వాల్వులు అవి పని చేయుపద్ధతిని బట్టి రెండు రకాలు విభజింపవచ్చు.ఒకటి నిర్దిష్ట సమయంలో బాయిల రు ఆపరేటరు లేదా సహాయకుడు స్వయంగా బ్లోడౌన్ వాల్వు తెరచి బాయిలరు లోని నీటిని తగు ప్రమాణంలో బయటకు వదులువిధానం.మరికొన్ని వాల్వులు ఎలక్ట్రానిక్ గా గాని లేదా న్యూమాటిక్ పద్ధతిలో కాని నిర్దిష్ట సమయంలో స్వయంప్రేరితంగా తెరచుకుని నీటిని బయటకు వదులు వాల్వులు.చిన్న బాయిలరులో బ్లోడౌన్ వాల్వును ఒక పిడి సహాయంతో బాయిలరు ఆపరేటరు పనిచేయించిన మాన్యువల్ విధానం అంటారు.

బ్లోడౌన్ వాల్వు రకాలు[మార్చు]

1.ప్లగ్ వాల్వు 2.పారలల్ స్లైడ్ బ్లోడౌన్ వాల్వులు (ఇవి గేట్ వాల్వు రకానికి చెందినవి) బ్లోడౌన్ వాల్వులు సాధారణంగా మూడు రకాలు ఒకటి ప్లగ్ వాల్వు రకం రెండవది గేట్ వాల్వు రకానికి చెందినది. గేట్ వాల్వురకానికి చెందిన వాటిలో ఒకటి రాక్ అండ్ పినియన్ రకం, మరొకటి లింక్ రకం.

ప్లగ్ వాల్వు బ్లోడౌన్ వాల్వు

రాక్ అండ్ పినియన్ రకం బ్లోడౌన్ వాల్వును తెరచుటకు మూయుటకు రాక్ అండ్ పినియన్ గేర్ అమరిక వుండును. గేరు అమరికలో పళ్ళు వున్న చక్రాలు ఒక చక్రం పళ్ళ గాడిలో మరో చక్రం పన్ను అమరి వుండేలా దగ్గరగా బిగింప బడి ఒక చక్రం తిరిగినపుడు రెండో చక్రం కూడా తిరుగును.రాక్ అండ్ పినియన్ గేర్ అమరిక వున్న వాల్వులో కవాటబిళ్ళ వున్న కాడ పొడవుగా వుండి దాని పార్శ భాగాన పళ్ళు వుండును.దానికి పళ్ళు వున్న చిన్న చక్రం (పినియను వీల్) అసుసందానమై వుండును.పినియను చక్రాన్ని ముందుకు వెనక్కి తిప్పి నపుడు కవాట బిళ్ళ వున్న, పళ్ళు వున్నకాడ ముందుకు వెనక్కి వేగంగా కదులును. కవాట బిల్ల మూందుకు వెనక్కి కదళదం వలన కవాటం మూసుకోవడం తెరచుకోవడం చాలా వేగంగా లిప్త కాలంలో జరిగి పోవును.మరో రకం లింకు ట్రైపులో కవాట బిళ్ళ లింకు అమరిక కదలిక వలన కవాట పీఠం రంధ్రంలో ముందుకు వెనక్కి కదులును.

ప్లగ్ వాల్వు రకపు బ్లోడౌన్ వాల్వు[మార్చు]

ప్రధాన వ్యాసం: ప్లగ్ వాల్వు చదవండి[3]. ఇందులోని ప్రధాన భాగాలు

 • 1.బాడీ
 • 2.శంకువు ఆకారం కవాట తలుపు
 • 3.గ్లాండ్ సిస్టం
 • 4.హేండిల్ (పిడి)

రాక్ అండ్ పినియను వాల్వు[మార్చు]

రాక్ అండ్ పినియను వాల్వు

ఈ వాల్వులో కవాట బిళ్ళ వున్న కాడను రాక్ (rack) అంటారు.దీనికి పక్క భాగంలో పళ్ళు వుండును, ఈ కాడను ముందుకు వెనక్కి తిప్పు పళ్ళ చక్రాన్ని పినియను అంటారు.ఈ పినియను (pinion) చక్రాన్ని పిడి (హ్యాండిల్) తో కుడి ఎడమలకు తిప్పుటవలన కవాట బిళ్ళ బాడిలోని కవాట రంధ్రంలో ముందుకు వెనక్కి కదులును[4]. వాల్వులోని ప్రధాన భాగాలు

 • 1.బాడీ
 • 2.రాక్
 • 3.పినియను చక్రం
 • 4.పినియను హౌసింగు
 • 5. కవాట బిళ్ళ
 • 6.స్ప్రింగు
 • 7.గ్యాండు అమరిక
 • 8.పిడి (హ్యాండిల్) వ్యవస్థ

బాడీ[మార్చు]

కంచు, లేదా, కాస్ట్ ఐరన్ (పోతఇనుము) లేదా పోత ఉక్కుతో చెయ్యబడి వుండును.బాడీ చివర కొన్ని వాల్వులలో ఫ్లాంజిలు వుండగా కొన్నింటిలో లోమరలు వుండును.

రాక్[మార్చు]

ఇది కవాట బిళ్ళ యొక్క కాడ (స్టెమ్). దీని ఒక చివర గుండ్రని భాగంలో డిస్కు ప్లేటులు అమర్చబడి వుండును. కాడ ఒక పార్శములో పళ్ళు వుండును.పినియను పళ్ళు ఈ పళ్ళ మధ్య అమరి వుండునట్లు పినియనును హౌసింగు (పైకప్పులో) అమర్చెదరు. పినియనును కుడి ఎడమలుగా తిప్పినపుడు కవాట కాడ /రాక్ ముందుకు వెనక్కు కదిలి వాల్వు తెరచుకోవడం మూసుకోవడం జరుగును.ఇది ఇత్తడి లేదా కంచు/గన్ మెటల్ (ఫిరంగి లోహం) తో చెయ్యబడి వుండును. కొన్నింటిలో కాస్ట్ ఇనుముతో కుడా చేస్తారు

పినియను చక్రం[మార్చు]

ఇది పళ్ళు కల్గిన ఇత్తడి లేదా అల్యూమినియం మిశ్రమ చేసిన ఇత్తడితో లేదా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. ఈపళ్ళ చక్రాన్ని ఇంగ్లీషులో పినియను (pinion) అంటారు.దీనిని వాల్వు హౌసింగులో దీని పళ్ళు, రాక్ పళ్ళ మధ్యలో వుండేలా అమర్చేదరు.ఈ పళ్ళ చక్రాన్ని తిప్పినపుడు రాక్ ముందుకు వెనక్కి కదులును.ఈ పినియను పైభాగంలో నలుపలకలగా వున్న పిడి కాడ వుండును.ఈ కాడకు నలు పలకల గుబ్బ వున్నా పిడి/హ్యాండిల్ అమర్చి పినియను చక్రాన్ని తిప్పెదరు.

పినియను హౌసింగు[మార్చు]

దీనిని బోల్టుల సహాయంతో వాల్వు బాడికి బిగించేదరు.ఇందులోనే రాక్ పళ్ళు వున్న కాడ, పినియను చక్రం వుండును.పినియను చక్రం వున్న భాగంలో హౌసింగుకు బోనెట్ అనునది బోల్టులతో బిగింపబడి వుండి, దీనిలో గ్లాండు అమరిక వుండును.ఇది కుడా ఇత్తడి లేదా పోత ఇనుము లేదా పోత ఉక్కుతో చెయ్యబడి వుండును.

కవాట బిళ్ళ[మార్చు]

ఇది నికెల్ కాపర్ మిశ్రమ ధాతులోహంతో నిర్మాణమై వుండును.రెండుచివరలు వృత్తాకారంగా గుండ్రంగా వుండగా రెండు చివరల మధ్యభాగం గుల్లగా స్తూపాకారంగా రెండు అర్థ భాగాలుగా వుండును. ఈ రెండు భాగాలు ఒకదానిలో ఒకటి దురు నట్లు వుండును. ఒకటి మేల్ డిస్కు మరొకటి ఫిమేల్ డిస్కు.డిస్కు గుల్ల భాగంలో స్ప్రింగు వుండును.

గ్యాండు అమరిక[మార్చు]

ఇది పినియను హౌసింగు పైభాగాన బోల్టుల ద్వారా బిగింపబడి వుండును.ఇదిపినియను చక్రం కాడ, హౌసింగు మధ్యనుండి స్టీము లేదా నీరుబయటకు రాకుండా నిరోదించును.పినియను కాడ/ట్రిమ్ చుట్టూ గ్రాపైట్ తాడును చుట్టి గ్లాండు అను ఇత్తడి రింగుతో బలంగా బిగిస్తారు.

పిడి లేదా బాక్సు కీ[మార్చు]

ఇది పినియను చక్రాన్ని తిప్పు పిడి దీనిని బాక్సుకీ లేదా హ్యాండిల్ అంటారు.దీని చివర గుబ్బగా వుండి లోపల నలుచరదరపు రంధ్రం, పినియను కాడకు సరిపోవు సైజులో వుండును.దీనిని పినియను కాడకు అమర్చి తిప్పెదరు.దీనికి లాక్ వ్యవస్థ వుండును.వాల్వును తెరచినపుడు పిడి, హ్యాండిల్ బయటికి రాని విధంగా లాక్ సిస్టం (lock) వుండును. కేవలం వాల్వును మూసినపుడు మాత్రమే హ్యాండిల్ బయటికి వచ్చును.

లింకు రకం బ్లోడౌన్ వాల్వు[మార్చు]

లింకు రకం బ్లోడౌన్ వాల్వు

ఈ రకపు బ్లోడౌన్ వాల్వులో పినియను రాక్ గేరు విధానానికి బదులుగా లింకు విధానం ద్వారా డిస్కు కాడ ముందుకు వెనక్కి కదులును.దీనికి కీలు చీల వంటి అమరిక వలన ఇలా జరుగును. చక్రానికి వున్నచిల వంటిది డిస్కు కాడను జరుపును.

వాల్వులోని భాగాలు[మార్చు]

 • 1.బాడీ
 • 2.డిస్కులు (కవాట బిళ్ళలు)
 • 3.లింకు అమరిక
 • 4.గ్రాండు అమరిక
 • 5.పిడి

ఒక గేరు మినహాయించి ఈ వాల్వు భాగాలు పనితీరు రాక్, పినియను వాల్వుతో సమానంగా వుండును.

బాయిలరు బ్లోడౌన్[మార్చు]

బాయిలరు నీటిని రెండు పద్ధతుల్లో బ్లోడౌన్ చేయుదురు.ఒకటి మధ్యంతర/ అప్పుడప్పుడు చేసే విరామ బ్లోడౌన్ విధానం మరొకటి నిరంతం బ్లోడౌన్ విధానం.

మధ్యంతర బ్లోడౌన్ పద్ధతిని బాయిలరు ఆపరేటరు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగును. బాయిలరు నీటిలో కరిగిన పదార్థాల శాతం pH, సిలికా శాతం పెరిగినపుడు షిప్టుకు (8 గంటల వ్యవధి) ఒకటి రెండు సార్లు అతి తక్కువ కాలవ్యవధిలో (1-2నిమిషాలు) బ్లోడౌన్ వాల్వును తెరచి నీటిని బయటకు వదిలెదరు. కంటిన్యూయసు లేదా నిరంతర బ్లోడౌన్ పద్దతిలో బ్లోడౌన్ వాల్వును కొద్దిగా తెరచి వుంచి నిరంతరం కొద్ది పరిమాణంలో బాయిల రు నుండి బయటకు వదులడం జరుగుతుంది. ఈ విధంగా బాయిలరు నీటిలోని కరిగిన పదార్థాల శాతాన్ని తగ్గించుటకు వేడిగా బాయిలరు వాటరును బ్లోడౌన్ చెయ్యుట వలన కొంత వరకు ఉష్ణశక్తి నష్టపొవ్వడం జరుగుతుంది . దాదాపు 170-180°C(10Kg/cm2)ఉష్ణోగ్రత వున్నబాయిలరు నీటిని బయటకు వదిలినపుడు బ్లోడౌన్ వాటరు నుండి ఫ్లాష్ స్టీము ఏర్పడుతుంది. కావున బ్లోడౌన్ నీటిని మూసి వున్నఒక స్టీలు ట్యాంకుకు పంపి, ఏర్పడిన ఫ్లాష్ స్టీముతో బాయిలరు ఫీడ్ వాటరును వేడిచెయ్య వచ్చును.

ఎంత పరిమాణంలో బాయిలరు నీటిని బ్లోడౌన్ చెయ్యాలి?[మార్చు]

బ్లోడౌన్ సమీకరణ: బ్లోడౌన్ శాతం(%)=

ఇక్కడ W=ఫీడ్ వాటరు TDS
V=బాయిలరుకు అందించు వాటరు
Y=బాయిలరువాటరులో గరిష్టంగా వుండాల్సినTDS
X=గుణకార గుర్తు

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]