సి.ఎఫ్.బి.సి బాయిలరు
సి.ఎఫ్.బి.సి బాయిలరు (C.F.B.C Boiler) అనునది ఘన ఇంధనం ఉపయోగించి నీటి ఆవిరిని అనగా స్టీమును ఉత్పత్తి చేయు బాయిలరు. సి.ఎఫ్.బి.సి నగా సర్కులేటెడ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ (circulated fluidized bed combustion) అని అర్థం. ఘన ఇంధనాన్ని ఉపయోగించు బాయిలరులలో ఘన ఇంధనాన్ని మండించు విధానాన్ని అనుసరించి పలుతరగతులుగా వర్గీకరించారు.అవి ఫిక్షుడ్ గ్రేట్ బాయిలరు, మూవబుల్ లేదా ట్రావెలింగు చైన్ గ్రేట్ బాయిలరు, పల్వరైజ్ద్ ఫ్యూయల్ ఫీడింగు బాయిలరు, ఎఫ్.బి.సి బాయిలరు.
ఫిక్షుడ్ గ్రేట్ బాయిలరులో గ్రేట్ అను ఇంధనంను పేర్చి మండించు భాగం స్థిరంగా వుండును.గ్రేట్ పలకలు పోత ఇను ముతో చెయ్యబడి వుండి ఫైరు ట్యూబు లేదా ఫర్నేసులో వరుసగా పక్క పక్కన పేర్చబడి వుండును. పలకల మధ్య వున్న సందుల గుండా దహనానికి అవసరమైన గాలి ఇంధనానికి అందును. అంతియే కాకుండాఈ పలకల సందుల ద్వారా ఇంధనం కాలగా ఏర్పడిన బూడిద కిందికి కారి, కింద వున్న బూడిద గుంటలో జమ అగును
ఇక కదిలే గ్రేట్ వున్న బాయిలరులో గ్రేట్ పలకలు ఒకదానికి ఒకటి గొలుసు లా కలుపబడి వుండి చక్రాల వలన కదు లుతూ ఫర్నేసులోఒకచివరనుండి మరో చివరకు పయనించూతుఇంధనం మండును .ఇంధనం చైన్ గ్రేటు పలకల మధ్య తగినంత ఖాళీ వుండి, ఇంధన దహనానికి కావలసిన గాలి అందును.ఈ రకపు బాయిలరులో గాలిని ఫ్యాను ద్వారా చెయిను అడుగు నుండి ఇంధనానికి అందించబడును. గ్రేట్ చివరకు వచ్చిన బూడిద అక్కడ వున్న బూడిద గుంటలో జమ అగును.
ఇక పల్వరైజ్డ్ ఇంధన బాయిలరులో ఫర్నేసులో ఇంధనం సన్నగా పొడిలా నలగ గొట్టబడి, పర్నేసులో నలుపక్కలా బలత్క్రుత గాలి (forced air) ద్వారా చిమ్మబడి కొంత ఎగురుతూ కాలగా, కొంత గ్రేట్ మీద కాలును.పై రకపుఘన ఇంధన బాయిలరులకన్న భిన్న మైనది ఎఫ్.బి.సి. బాయిలరు ఇంధన దహన పద్ధతి.ఎఫ్.బి.సి. అనగా ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ (fluidised bed combustion) అని అర్థం.
ఎఫ్.బి.సి అనగా?
[మార్చు]పాత్రలో మరుగుతున్ననీరు పైకి కిందికి అస్థిమితం గా, అస్థిరంగా పైకి కిందికి అణువులు ఎలా చలిస్తూ వుంటాయా ఎఫ్.బి.సి. బాయిలరులో 0.8నుండి3.0 మీ.మీ సైజులో వున్న జల్లించిన ఇసుక లేదా ఉష్ణ తాపక నిరోధ ఇటుకల పొడి రేణువులను బలత్క్రుత గాలిదార్వా అలాంటి స్థిర ద్రవ స్థితిలో (ఎఫ్.బి.సిలో వాడు ఇసుక లేదా ఫైరునిటుకలపొడిని బెడ్ మెటీరియలు అంటారు) వుంచి,650-800 °C ఉష్ణోగ్రత వరకు బెడ్ మెటీరియలును వేడిచేసి, దాని మీదకు ఇంధనాన్ని పంపి మండించెదరు. ఈ విధానంలో ఇంధనం బాగా కాలును. తక్కువ కేలరిఫిక్ విలువ వున్న ఇంధనాలను మండించ వచ్చును.ముఖ్యంగా బొగ్గులో తక్కువ రకానికి చెందిన సబ్ బిటిమినస్, లిగ్నైట్ బొగ్గును వాడుటకు ఈ రకపు బాయిలరులు అనుకూలం.
ఎఫ్.బి.సి.బాయిలరులో ఇంధనాన్ని రెండురకాలుగా ఫర్నేసుకు అందించి మండించెదరు. ఒకటి అండరు బెడ్ ఫీడింగు కాగా మరొకటి వోవరు బెడ్ ఫీడింగు. అండరు బెడ్ ఫీడింగులో ఇంధనాన్ని బెడ్ మెటీరియలు అడుగునుండి బెడ్‌లో మిశ్రమం అయ్యేలా అందించగా, వోవరు బెడ్ ఫీడింగులో ఇంధనాన్ని బెడ్ మీద అంతటా సమంగా పడేలా చేసి మండిం చడం. ఎఫ్.బి.సి. విధానం, పనిచేయు పధ్ధతి ఆధారంగా తిరిగి ఏ. ఎఫ్.బి.సి మరొకటి సి. ఎఫ్.బి.సి అని వర్గీకరించారు.
ఏ. ఎఫ్.బి.సి
[మార్చు]ఏ.ఎఫ్.బి.సి అనగా అట్మాస్పియర్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ బాయిలరు. ఈ బాయిలరులో బలత్క్రుత గాలితో బెడ్ మెటీరియలును మరుగుతున్న నీటిలా అస్థిర ద్రవస్థితిలో ఉంచుడం జరుగును. అందువలన వాతావరణ వత్తిడి కన్న ఎక్కువ వత్తిడితోగాలిని బెడ్‌లోకి పంపడం వలననే బెడ్ మెటీరియలు కదులుతున్న ద్రవస్థితిలో ఉండగల్గును. కాకపొతే వాతావవరణ కన్న ఇలా ప్రయోగించు వత్తిడి కేవలం 400-600 మి.మీ, /నీటి మట్టం వుండటం వలన దీనిని ఏ.ఎఫ్.బి.సి విధానం అనే అంటారు.
సి.ఎఫ్.బి.సి విధానం
[మార్చు]ఏ.ఎఫ్.బి సి విధానంలో బలత్క్రుత గాలివలన బెడ్‌లోని తక్కువ బరువు, సైజు వున్న ఇసుక లేదా ఫైరు బ్రిక్సుల పొడి బెడ్ కన్న 300-400 మిల్లీమీటర్ల ఎత్తుకు లేచినప్పటికి తిరిగి అధిక భాగం మళ్ళి బెడ్ మీదకు పడును. అతి స్వల్ప ప్రమాణంలో కొంత బెడ్ మెటీరియలు ఫర్నేసు దాటి బాయిలరు ద్వారా బయటకు వెళ్ళును. ఇలా నష్టపోయిన దానిని తిరిగి పొందే వీలు లేదు. అలాగే ఫర్నేసులో తేలుతూ మండుతున్న ఇంధనంలోని తేలిక రేణువులు కూడా కొంత శాతం బయటికి పోవును.
ఇక సి.ఎఫ్.బి.సి అనగా సర్కులేటింగు ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ అని అర్థం. ఈ సర్కులేటింగు ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ విధానంలో ఫర్నేసునుండి బయటకు వెళ్ళిన దహనం చెందని ఇంధనాన్ని, బెడ్ మెటీరియలు ఫర్నేసు వెలుపల వున్న సైక్లోను అను ఉపకరణంలో జమ చేసి తిరిగి ఫర్నేసులోని బెడ్ మీదికి పంపెదరు.ఈ విధంగా ఇంధనా న్ని, బెడ్ మెటీరియలును తిరిగి పొంది తిరిగి ఫర్నేసుకు సర్కులేట్/పంపడం వలన ఈ దహన విధానాన్ని సర్కులేటింగు ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ అంటారు.సి.ఎఫ్.బి.సి బాయిలరు తక్కువ కేలరిఫిక్ విలువవున్న బొగ్గును ఇంధనంగా వాడుటకు అనుకూలం. లిగ్నైట్ ముఖ్యంగా లిగ్నైట్ అనబడు తక్కువ నాణ్యత కల్గిన బొగ్గును ఇంధనంగా వాడుటకు అనుకూలం.
సి.ఎఫ్.బి.సి బాయిలరు వాడకం
[మార్చు]1980-90 కాలంలో సర్కులేటింగు ఫ్లూయిడైస్డ్ కంబుసన్ బాయిలరుల వాడకం, నిర్మానం ఎక్కువ అయ్యింది.కారణం ఎక్కువ ఉష్ణ వినియోగ సామర్ధ్యం, తక్కువ స్థాయిలోNOx, SO2లను విడుదల చెయ్యడం తక్కువ కేలరొఫిక్ విలువలున్న ఇంధనాలను వాడు సౌలభ్యం వుండటం, [1]
బొగ్గులోని రకాలు
[మార్చు]బొగ్గును అది ఏర్పడిన కాల మాన పరిస్థితి ల ఆధారంగా నాలుగు రకాలుగా విభజించారు. అవి ఆంత్రసైట్ (Anthracite), బిటుమినస్ (Bituminous, సబ్ బిటుమినస్ (sub Bituminous, లిగ్నైట్.
ఆంత్రసైట్(Anthracite)
[మార్చు]ఇది ఉత్తమమైన నాణ్యత వున్న బొగ్గు.ఇందులో 85-90 %వరకు కార్బను ఉండును. అందులో అత్యధిక భాగం స్థిర కార్బను.ఇందులో తేమ శాతం కూడా తక్కువగా వుండును.అలాగే సల్ఫర్ కూడా 1% కన్న తక్కువ వుండును.వోలటైల్ సమ్మేళనపదార్థాలు (తక్కువఉష్ణోగ్రత లోనే (400-550°C) ఆవిరిగా/ వాయువుగా మారి దహనం చెందునవి) తక్కువ. నెమ్మదిగా ఎక్కువ సేపు మండి అధిక ఉష్ణోగ్రత విడుదల చేయును. భౌతికంగా నల్లగా వుండును. మిగతా బొగ్గు రకాలు కన్న తక్కువ ధూళిని పొగను విడుదల చేయును.[2]
బిటుమినస్ బొగ్గు
[మార్చు]ఇది ఆంత్రసైట్ బొగ్గు తరువాత స్థాయి బొగ్గు.ఇది లిగ్నేట్ కన్న ఎక్కువ నాణ్యత కల్గి ఉంది.అందువల్ల ఇది అటు ఆంత్రసైట్ బొగ్గుకు ఇటు లిగ్నేట్‌ల మధ్యస్థితి బొగ్గు. దీనిని మృదువైన బొగ్గు అంటారు.మాములుగా కంటికి నునుపుగా కనపడినప్పటికి దగ్గర విపులంగా పరీక్షించినపుడు పొరలు పొరలుగా కనపడును. ఈ రకపు బొగ్గు గనులలో అధిక శాతంలో లభిస్తున్నది.అమెరికా సంయుక్త రాష్టాలలో గనుల్లో లభించుబొగ్గులో బిటుమినస్ బొగ్గు 80% వరకు ఉంది. ఇందులో కార్బన్ శాతం 70-80% వరకు వుండును. కొన్ని రకాలలో 90% వరకు వుండును. తేమ శాతం తక్కువ. సల్ఫరు ఆంత్రసైట్ కన్న కొద్దిగా ఎక్కువ ఉండును. ఐరన్, స్టీలు (ఇనుము, ఉక్కు) పరిశ్రమలలో వాడు కోక్ (coke) ను బిటుమినస్ బొగ్గునుండే తయారు చేయుదురు[3]
సబ్ బిటుమినస్
[మార్చు]ఇది లిగ్నైట్ కన్న ఎక్కువ, బిటుమినస్ బొగ్గుకన్న తక్కువ నాణ్యత వున్న బొగ్గు. ఇందులో తేమ శాతం బిటుమినస్ కన్న ఎక్కువ పరిమాణంలో వుండును., కార్బన్ సాధరణ లిగ్నైట్ లో కన్నకొద్దిగా ఎక్కువ వుండును.
ప్రపంచంలో లభించు బొగ్గులో లిగ్నైట్ వాటా 17%. ఇందులో తేమ శాతం 30 నుండి 45% వరకు ఉండును.ఇది గోధుమ, నలుపు రంగుల మిశ్రమ రంగులో వుండును.చూచుటకు పిట్ (peat) కన్న ద్రుధంగా కనపడి నప్పటికీ ఎక్కువ దూరప్రాంతాలకు రవాణా చేసి నపుడు పెలుగా ముక్కలుగా, పొడిగా విడిపోవును.లిగ్నైట్ సరాసరి కిలోకేలరిఫిక్ విలువ 15 మెగా జౌలులు/కిలో గ్రాముకు. లిగ్నైట్ లో వోలటైల్ పదార్థాల శాతం ఎక్కువ. అంతేకాదు సల్ఫరు 1 నుండి 2 శాతం వరకు ఉండును. అకర్బన పదార్థాల పరిమాణం కూడా ఎక్కువ.లిగ్నేట్ ను మండించునపుడు లిగ్నైట్ బొగ్గునుండి వెలువడు సల్ఫరు వాయువు వలన వాతావరణంలో వాయు కాలుష్యం ఏర్పడకుండా నిరోధించుటకు సున్నపు రాయిని/ లైమ్ స్టోన్ (limestone) లిగ్నైట్ బొగ్గుతో తగు పాళ్ళలో మిశ్రమంచేసి మండించెదరు. బొగ్గులోని సల్ఫరుతో సున్నపు రాయి అధిక ఉష్ణోగ్రతలో రసాయనికచర్య జరిపి ఘన కాల్షియం సంయోగ పదార్థాన్ని (కాల్సియం సల్ఫేట్) ఏర్పరచును.ఇలా ఏర్పడిన దానిని బూడిదతో పాటు తొలగించేస్తారు.
సి.ఎస్.బి.సి విధానంలో సున్నపు రాయి లిగ్నైట్ తో బాగా మిశ్రమ అయ్యి కాలడం వలన, బొగ్గులోని సల్ఫరు సున్నపు రాయితో కలసి రసాయనిక సంయోగం వలన కాల్సియం సల్ఫెట్ గా ఘన స్థితి పదార్థంగా మారడం వలన సల్ఫరు గాలిలో కలిసే ప్రమాదం లేదు.[4]
సి.ఎస్.బి.సి దహనం జరిగే విధానం
[మార్చు]సి.ఎస్.బి.సి బాయిలరులను 500 మెగా వాట్లకు మించి విద్యుత్తు ఉత్పత్తి కావించు విద్యుతు ఉత్పాదిత కేంద్రాలలో ఉపయోగిస్తారు. సి.ఎస్.బి.సి బాయిలరులో బెడ్ లోకి పంపు బలత్కృత గాలి (forced draft air) మామూలు ఎస్.బి.సి కన్న రెండు మూ డింతలు ఎక్కువ.అ>దువలన బెడ్ మెటీరియలు మామూలు స్థితికన్న 200-300 మి.మీ ఎక్కువ ఎత్తులో పైకి కిందికి కదలాడుతూవుండును. గాలి యొక్క ఈ బలత్కృతశక్తి వలన సన్నని పోడిలావున్న బొగ్గు రేణువులు ఫర్నేసు పైభాగం వరకు గాలితో తేలుతూ, గాలితో బాగా మిశ్రమమై మండును.అదే సమయంలో బొగ్గుతో పాటు పంపిణి అయిన సున్నపు రాయి బొగ్గునుండి విడుదల అయిన గంధకంతో చర్య జరిపి దానిని కాల్సియం సల్ఫెట్ గా ఘనస్థితికి తెచ్చును. లిగ్నేట్, సున్నపురాయి పొడిని వేరు వేరు బంకరుల నుండి ఒకేసారి ఫర్నేసులో పడేలా ఏర్పాట్లు వుండును. బొగ్గులో వున్న సల్ఫ రును గణించి దానికి సరిపడిన దానికంటేకాస్త ఎక్కువ సున్నపురాయిని ఫర్నేసుకు అందిస్తారు.బలత్కృతగాలి వలన ఫ్లూ గ్యాసులతో పాటు ఫర్నేసు బయటకువచ్చిన కాలని ఇంధనాన్ని, బెడ్ మెటీరియలును సైక్లోన్ అను ఉపకరణంలో సేకరించి, తిరిగి బాయిలరులోని బెడ్6కు పంపించేదరు. సి.ఎస్.బి.సిలో బొగ్గును, సున్నపు రాయిని వోవరు బెడ్ ఫీడ్ విధానంలో అందిస్తారు.
సి.ఎస్.బి.సి బాయిలరులోని ముఖ్య మైన భాగాలు
[మార్చు]- 1.ఎఫ్.బి.సి ఛాంబరు
- 2.రిఫ్రాక్టరి ఫర్నేసు
- 3.బాయిలరు/స్టీము ఉత్పత్తి వ్యవస్థ
- 4.సైక్లోన్
- 5.ఎకనమైజరు
- 6.ఏయిరు హీటరు
- 7.పొగగొట్టం
ఎఫ్.బి.సి ఛాంబరు
[మార్చు]ఇందులో ఎయిరు బాక్సు, డిస్ట్రిబ్యూషన్ ప్లేట్, ఎయిర్ నాజిళ్ళు, మామూలు ఆట్మాస్ఫియరు ఎస్.బి.సి కంబుసను వంటిదే. ఇందులో బెడ్ మెటీరియలు పరిమాణం ఎక్కువ ఉండును.
రిఫ్రాక్టరి ఫర్నేసు
[మార్చు]ఫర్నేసు గోడ లోపలివరుస ఉష్ణతాపక ఇటుకలతో నిర్మింపబడి, బయటి వరుస ఇన్సులేసన్ ఇటు కలతో నిర్మింపబడివుండును.ఇంధనం గాలి మిశ్రమం ఇక్కడే జరిగి, ఇంధన పూర్తి దహనం ఫర్నేసులో పూర్తిఅగును. బరువైన ఇంధనదహనం కంబుసన్ చాంబరులో జరుగగా, తేలికైన, గాలితో కలిసి తేలియాడుతున్న ఇంధనం ఫర్నేసు మధ్యభాగంలో జరుగును. అదేసమయంలో ఇంధనంలోని సల్ఫరు సున్నపురాయితో రసాయనికంగా సంయోగంచెంది బెడ్ మీదకు చేరును.ఫర్నేసు గోడలకు పైన వరుసగా మెంబ్రేన్ ట్యూబులు అనబడు వాటరు ట్యూబుల వాల్ వుండును. ఈ ట్యూబులలోని నీరు ఉష్ణ సంవహన వలన వేడి వాయువుల నుండి ఉష్ణాన్నిగ్రహించి వేడెక్కి స్టీము/నీటి ఆవిరిగా మారును.
బాయిలరు/స్టీము ఉత్పత్తి వ్యవస్థ
[మార్చు]ఈ స్టీము ఉత్పత్తి వ్యవస్థలో స్టీము డ్రమ్ము, వాటరు వాల్ ట్యూబులు, డౌన్ కమరులు, రైజరులు, సూపరు హీటరులు వుండును. బాయిలరు ఫర్నేసు చుట్టు వాటరు ట్యూబులువుండటం వలన వాటరు ట్యూబుల్లోని నీరు త్వరగా వేడెక్కి స్టీము ఏర్పడును. కొన్ని బాయిలరులలో అదనంగా బెడ్కాయిల్సు కూడా వుండును. వాటరు వాల్ ట్యూబులలో ఏర్పడిన స్టీము, స్టీము డ్రమ్ముకు వెళ్ళి, అక్కడి నుండి టర్బైనుకువెళ్ళును.
సైక్లోన్
[మార్చు]మామూలు ఎఫ్.బి.సి బాయిలరులోవేడి గాలులు సెకనుకు 2-3 మీటర్ల వేగంతో పయనించును.కాని సి.ఎఫ్.బి.సి విధానంలో వేడి ఇంధన వాయువులు సెకనుకు 5-10మీటర్ల వేగంతో పయనించును.అఅందువల మామూలు ఎఫ్.బి.సి బాయిలరులో వేడి గాలులతో పాటు బయటికి వెళ్ళు కాలని ఇంధన శాతం 1కన్న తక్కువ వుండగా, సి.ఎఫ్.బి.సిలో ఇలా వేడి గాలులతో కలిసి ఫర్నేసు బయటికి వెళ్ళు ఇంధనం 5% మించి వుండును. కావున ఇలా వేడి గాలులతో/ ఫ్లూ గ్యాసులో వెళ్ళు ఇంధనాన్ని తిరిగి పొందు ఉపకరణమే సైక్లోను.
ఈ సైక్లోను అనునది మెత్తని ఉక్కుతో చెయ్యబడి వుండును.సైక్లోను పైభాగం స్తూపాకారగొట్టంవుండి దానికి శంకువు ఆకారం వున్న గొట్టం అతుకబడి వుండును. సైక్లోను స్తుపాకారగొట్టానికి క్షితిజ సమాంతరంగా ఒక పక్కగా వేడి వాయువులు సైక్లోనుకు వచ్చుటకు గొట్టం వుండును. అలాగే స్తూపాకార గొట్టం మధ్య భాగము పైన వేడి గాలులు/వాయువులు బయటికి వెళ్ళు గొట్టం వుండును.ఇంధన రేణువులు, బెడ్ మెటీరియలు ఉన్న ఫ్లూగ్యాస్ సైక్లోన్ పక్క గొట్టం ద్వారా వేగంగా ప్రవేశించడం వలన అపకేంద్రితబలం వలన ఫ్లూగ్యాసుకన్నఎక్కువ సాంద్రత, బరువు వున్న ఇంధన రేణువులు, బెడ్ మెటీరియలు సైక్లోన్ అడుగు భాగానికి చేరగా, వేడి ఫ్లూ గ్యాసు ఎకనమైజరుకు వెళ్ళును. సైక్లోను శంకువుభాగంలో జమ అయిన మెటీరియలు ఒక కన్వేయరు ద్వారా తిరిగి ఫర్నేసుకు పంపబడును.
ఎకనమైజరు
[మార్చు]ఫర్నేసు నుండి బయటకు వచ్చు ఫ్లూగ్యాసు యొక్క ఉష్ణోగ్రత 250°C మించి వుండును. కావున ఆ ఉష్ణోగ్రతను బాయిలరు పంపు నీటిని వేడి చెయ్యవచ్చును, సాధారణంగా ఈ ఎకనమైజరులు షెల్ అండ్ ట్యూబు తరగతికి చెందినదై వుండును.ట్యూబులలో నీరు ప్రవహించగా, షెల్ భాగంలో ఫ్లూ గ్యాసులు ప్రసరించును. బాయిలరుకు వెళ్ళు నీరు ఎంత ఎక్కువ వేడిగా ఉన్నచో అంతగా ఇంధనం అదా అవుతుంది.
ఎయిర్ హీటరు
[మార్చు]ఎయిరు హీటరు కూడా ఒకరకమైన ఎకనమైజరే. ఇది కూడా షెల్ అండ్ ట్యూబు రకానికి చెందినదే.కంబుసన్ గదికి వెళ్ళు గాలి వేడిగా వుండటం వలన ఇంధనం త్వరగా మండును, బెడ్ మెటీరియలు ఉష్ణోగ్రత కూడా నిలకడగా వుండును.
పొగ గొట్టం
[మార్చు]ఫ్లూ గ్యాసులు వాతావరణం కన్నచాలా ఎక్కువ ఉష్ణోగ్రత కల్గి వుండటంతో పాటు కొద్ది ప్రమాణంలో ఇంధన బూడిద కణాలు /రేణువులను కల్గివుండును.అందువలన తక్కువ ఎత్తులో వాతావరనంలోకి ఉపయోగించిన ఫ్లూ గ్యాసులను/వాయువుల వదలడం గాలి కాలుష్యం కల్గించును. పరిసరాలలో గాలి వెంటనే వేడెక్కును. అందువలన కనీసం 100-125 అడుగులు మించివున్న పొగ గొట్టానికి పంపడం వలన అంత ఎత్తుకు వెళ్ళిన వేడి వాయువులు నెమ్మదిగా చల్లబడుతూ వాతావరణంలో కలిసిపోవును.
ఇంధనం
[మార్చు]సి.ఎఫ్.బి.సి బాయిలరులో కేవలం లిగ్నైట్ నే కాకుండా తక్కువ కిలోరిఫిక్ విలువలున్న బయోమాస్ ఇంధనాలను కూడా వాడవచ్చును[1]
సి.ఎఫ్.బి.సి బాయిలరు వినియోగం
[మార్చు]సి.ఎఫ్.బి.సి బాయిలరులను ఎక్కువగా థెర్మో పవరు ప్లాంట్లలలో టర్బైనులను తిప్పుటకు ఉపయోగిస్తారు.
బయటి వీడియోల లింకులు
[మార్చు]ఈ వ్యాసాలు కూడా చదవండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ADVANCED CONTROL OF AN INDUSTRIAL CIRCULATING FLUIDIZED BED BOILER USING FUZZY LOGIC" (PDF). jultika.oulu.fi. Archived from the original on 2017-08-28. Retrieved 2018-03-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Anthracite". britannica.com. Archived from the original on 2016-05-11. Retrieved 2018-03-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "web.archive.org/web/20180310065309/https://www.britannica.com/science/bituminous-coal". Archived from the original on 2018-03-10. Retrieved 2018-03-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Properties of Lignite Coal used in the Thermal Power Plants". brighthubengineering.com. Archived from the original on 2017-07-20. Retrieved 2018-03-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)