లిగ్నైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిగ్నైట్ బొగ్గు రాశి/కుప్ప(పైన) లిగ్నైట్ బ్రిక్వెట్ (కింది బొమ్మ)

లిగ్నైట్ అన్నది భూగర్భంలో లభించే ఒకరకం బొగ్గు.ఇది సేంద్రియ ఇంధనం.ఇది శిలాజ ఇంధనం. ఇది తక్కువ నాణ్యత కలగిన బొగ్గు.భూగర్భంలో లభించే బొగ్గును వాటిలో వున్న కార్బన్ శాతం, వోలటైల్ పదార్థాల శాతం (వోలటైల్‌లు అనగా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద అనగా 450°C-600°C మధ్య వాయువుగా మారే పదార్థాలు) తేమ, అకర్బన పదార్థాల సంయోగ పదార్థాల శాతాన్ని బట్టి బొగ్గు యొక్క నాణ్యతను నిర్ణయిస్తారు. శిలాజ బొగ్గు అనేది చిత్తడి తడినేలల్లో జమ అయినచచ్చిన చెట్లు ముక్కలు కుళ్లడం వలన ఏర్ఫడిన పదార్థాలు భూమిమీడ జరిగిన మార్పుల వలన భూపొరల్లోకి జొచ్చుకువెళ్ళి అక్కడి ఉష్ణోగ్రతకు, వత్తిడికి కాలక్రమేన బొగ్గు, పెట్రోలియం వనరులుగా రూపాంతరం చెందాయి.ఇలా జరగటానికి దాదాపు 360 మిలియను సంవత్సరాలు పట్టివుండునని అంచనా.[1]

శిలాజ బొగ్గు స్టూల వర్గీకరణ[మార్చు]

బొగ్గును సాధారణంగా మూడు తరగతులుగా వర్గీకరించవచ్చును.అవి అంత్రాసైట్, బిటుమనస్, లిగ్నైట్.

ఆంత్రసైట్(Anthracite)[మార్చు]

ఇది ఉత్తమమైన నాణ్యత వున్న బొగ్గు.ఇందులో 85-90 %వరకు కార్బను ఉండును. అందులో అత్యధిక భాగం స్థిర కార్బను.ఇందులో తేమ శాతం కూడా తక్కువగా వుండును.అలాగే సల్ఫర్ కూడా 1% కన్న తక్కువ వుండును.వోలటైల్ సమ్మేళనపదార్థాలు (తక్కువఉష్ణోగ్రత లోనే (400-550°C) ఆవిరిగా/ వాయువుగా మారి దహనం చెందునవి) తక్కువ. నెమ్మదిగా ఎక్కువ సేపు మండి అధిక ఉష్ణోగ్రత విడుదల చేయును. భౌతికంగా నల్లగా వుండును. మిగతా బొగ్గు రకాలు కన్న తక్కువ ధూళిని పొగను విడుదల చేయును[2].

బిటుమినస్ బొగ్గు[మార్చు]

ఇది ఆంత్రసైట్ బొగ్గు తరువాత స్థాయి బొగ్గు.ఇది లిగ్నేట్ కన్న ఎక్కువ నాణ్యత కల్గి ఉంది. అందువల్ల ఇది అటు ఆంత్రసైట్ బొగ్గుకు ఇటు లిగ్నేట్‌ల మధ్యస్థితి బొగ్గు. దీనిని మృదువైన బొగ్గు అంటారు.మాములుగా కంటికి నునుపుగా కనపడినప్పటికి దగ్గర విపులంగా పరీక్షించినపుడు పొరలు పొరలుగా కనపడును. ఈ రకపు బొగ్గు గనులలో అధిక శాతంలో లభిస్తున్నది.అమెరికా సంయుక్త రాష్టాలలో గనుల్లో లభించుబొగ్గులో బిటుమినస్ బొగ్గు 80% వరకు ఉంది. ఇందులో కార్బన్ శాతం 70-80% వరకు వుండును. కొన్ని రకాలలో 90% వరకు వుండును. తేమ శాతం తక్కువ. సల్ఫరు ఆంత్రసైట్ కన్న కొద్దిగా ఎక్కువ ఉండును. ఐరన్, స్టీలు (ఇనుము, ఉక్కు) పరిశ్రమలలో వాడు కోక్ (coke) ను బిటుమినస్ బొగ్గునుండే తయారు చేయుదురు[3]

లిగ్నైట్ లేదా లిగ్నైటు[మార్చు]

బొగ్గు రకాలలో లిగ్నైట్ అతితక్కువ వయస్సు ఉన్న ఇంధనం లిగ్నైట్ దాదాపు 60 మిలియను సంవత్సరాల కిత్రం ఏర్పడి వుండును.లిగ్నైట్ భొతికరంగు గోధుమ (బూడిద) రంగులో ఉండును.అందువల్ల దీనిని బ్రౌన్ కోల్ అని అంటారు.ఇది గోధుమ రంగులో మృదువుగా వుండి, మండే/దహనం చెందే గుణం కలిగి ఉంది. ఇందులో కార్బన్ శాతం 30 నుండి 70 % వరకు వుండును. కొన్ని గనుల్లో దొరుకు బొగ్గులో కార్బను 70 %వరకు వుండగా, మరికొన్ని గనుల్లో లభించు బొగ్గులో 30 శాతం కన్న తక్కువ ఉండును.తేమ శాతం చాలా ఎక్కువ[4].కొన్ని రకాల బొగ్గులో 30% వరకు ఉండును.ఎక్కువ వోలటైల్‌ను కలగి ఉంది.అల్లాగే బూడిద శాతం కూడాఎక్కువే.

ఒక కేజీ లిగ్నైట్ కేలరిఫిక్ విలువ 8000 నుండి 15000 కిలో జౌలులు.అనగా 1900 నుండి 3600 కిలో కేలరీలు.కేజీ ఇంధనానికి. లిగ్నైట్‌లో 35-55% వరకు తేమ ఉండును.అమ్మకం చెయ్యునపుడు బొగ్గును ఆరబెట్టి/ఎండబెట్టి కొంత మేరకు తేమశాతాన్ని తగ్గించి అమ్మకం చేస్తారు.లిగ్నైటులో వోలటైల్ పదార్థాల శాతం కూడా 45-55% వరకు ఉండును.లిగ్నైటులోని అధిక సల్ఫర్ ( ప్రత్యేకంగా ఫెర్రాస్ సల్ఫైడ్ (FeS2) ఇంధన బూడిద ఫుజన్ ఉష్ణోగ్రతను 900 °C కన్న తక్కువ స్థితికి తేవడం వలన చెట్టెం (slagging) ఏర్పడును.లిగ్నైట్ బొగ్గు మెత్తగా వుండటం వలన బిటుమనస్ బొగ్గు కన్నా సులభంగా దీనిని పొడిగా నలగ కొట్టవచ్చు.

లిగ్నైట్ గుణగణాల పట్టీక [5]

లక్షణం/గుణం మితి/విలువ
ఎనర్జీ విలువ (తడిది) 5.8 నుండి 11.5 MJ/kg
ఎనర్జీ విలువ (తడిది) 25 నుండి 29 MJ/kg
తేమ 48 – 70%
కార్బన్ 35-70
ఆక్సిజన్ 25-30
హైడ్రోజన్ 4-5.5
బూడిద <4.0%
నైట్రోజన్ <1.0%
సల్ఫరు <1.0%

లిగ్నైటు గనులు వున్న ప్రాంతాలు[మార్చు]

లిగ్నైట్ బొగ్గుగనులు ఆస్ట్రేలియాలో, అమెరికాలో, చైనాలో అధిక మొత్తంలోవున్నవి.అమెరికాలో ఉత్తర డకోటా ప్రావిన్సిలో ఎక్కువ పరిమాణంలో లభ్యం.భారత దేశంలో తమిళనాడులోని నైవేలి, రాజస్థాన్ లలో లభిస్తున్నది.ప్రపంచంలో లభించు బొగ్గు నిల్వలలో 17% లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి.

వినియోగం[మార్చు]

లిగ్నైట్ రకపు బొగ్గును ఎక్కువగా థెర్మల్ పవర్ ప్లాంటులలో బాయిలరు ఇంధనంగా ఉపయోగించి స్టీమును ఉత్పత్తి చేయుదురు.స్టీముతో టర్బైనులను తిప్పివిద్యుత్తు ఉత్పత్తి చేయుదురు.అందువలన అధిక శాతం లిగ్నైట్‌ను ఇంధనంగా వాడుటకు ఉత్పత్తి చేసినప్పటికీ, బొగ్గులో లభించే జెర్మేనియం లోహం కై కూడా ఈ బొగ్గును గనులనుండి వెలికి తీస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో లిగ్నైట్ లభిస్తుంది. 2014 లో జర్మనీలో ఉత్పత్తి అయిన విద్యుతులో దాదాపు 27% లిగ్నైటును ఇంధనంగా వాడిన విద్యుతు ఉత్పత్తి కేంద్రాలలో ఉత్తత్తి అయినదే.అలాగే గ్రీసులో 2014 లో 50% విద్యుత్తును లిగ్నైట్ ఇంధనంగా వాడి న విద్యుతు ఉత్పత్తి కేంద్రాలలో ఉత్తత్తి అయినదే.

లిగ్నైట్‌లో వున్న అధిక తేమ కారణంగా కొన్ని సందర్భాలల్లో పుట్టిన వేడివలన తనకు తానుగా మండును. అందువలన ఈ రకపు బొగ్గ్గును ఎక్కువ దూరం రవాణా చెయ్యడం కొద్దిగా కష్టమైన పని. అందువలన ఎక్కువగా లిగ్నైట్ బొగ్గు లభించు గనుల సమీపాననే విద్యుతు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతారు. ఉత్పత్తి అయిన లిగ్నైట్ రకపు బొగ్గులో 70%ను విద్యుత్తు ఉత్త్పత్తికి, ఇతరపరిశ్రమల బాయిలరులలో వినియోగించగా,13-15% వరకు సింథేటిక్ సహజ వాయువు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. మిగిలినది కొన్నిరకాల ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు[6].

నష్టాలు[మార్చు]

లిగ్నైట్ను ఇంధనంగా వాడటం వలన ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలఅగును. అలాగే ఇందులో సల్ఫరు కూడా మిగతా బొగ్గు రకాలకంటే ఎక్కువ.

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లిగ్నైట్&oldid=2889777" నుండి వెలికితీశారు