నైవేలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నైవేలి లేదా నేయ్వెలి అనేది తమిళనాడు కు చెందిన కడలూర్ జిల్లాలోని ఒక విద్యుత్ ఉత్పాదన చేసే టౌన్ షిప్. చెన్నై కు దక్షిణంగా సుమారు 200 కి.మీ దూరంలో ఉంది. 1956 లో ఇక్కడ లిగ్నైట్ కనుగొన్న తర్వాత నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ పేరుతో ఇక్కడ టౌన్ షిప్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ టౌన్ షిప్ సుమారు 53 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం సుమారు 21,000 ఇళ్ళు ప్రభుత్వం నిర్మించింది. ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ. తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగ భాగం ఇక్కడి నుంచే ఉత్పత్తి కావడం విశేషం. ఇక్కడి నుంచి ప్రస్తుతం 2,500 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది.

"https://te.wikipedia.org/w/index.php?title=నైవేలి&oldid=2115600" నుండి వెలికితీశారు