మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్)

వికీపీడియా నుండి
(మోబ్రే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్)అనేది స్వయం ప్రేరితంగా (Automatically),స్వీయ ప్రచోదంగా నీటిమట్టాన్ని నియంత్రణలో వుంచు ఉపకరణం లేదా పరికరం.మాబ్రిని మోబ్రే అణీకూదా పిలుస్తారు. మాబ్రి లేదా మోబ్రే అనే ఈ పరికరాన్ని బాయిలరులలో నీటిమట్టాన్ని తగిన స్థాయిలో ఉంచుటకు ఉపయోగిస్తారు.

బాయిలరు పనిచేస్తున్నప్పుడు బాయిలరులో స్టీము ఉత్పత్తి అయ్యేసమయంలో,స్టీము ఉత్పత్తికి విలోమాను పాతంలో బాయిలరు లోని నీటి మట్టం తగ్గుతుంది.అనగా స్టీము ఉత్పత్తి పెరిగేకొలది,నీటిమట్టం తగ్గుతుంది.ఇలా తగ్గిన నీటిని ఫీడ్ వాటరు పంపును తిప్పి బాయిలరు షెల్ లో తగిన మట్టం వరకునీరు నింపవలసి వున్నది.మట్టానికి నీరు చేరగానే పంపును నిలిపి వెయ్యాలి.ఇలా ఫీడ్ పంపును నీటిమట్టం తగ్గిన ప్రతిసారి తిప్పి,మట్టానికి నీరు రాగానే నిలిపెయ్యడం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ.ఇలా పంపును తిప్పడం,ఆపడం అనేది బాయిలరు ఆపరేటరు నేరుగా చేయ్యునప్పుడు,ఏదైనా కారణం చేత మట్టానికి మించి నీరు ఎక్కినను పంపును నిలిపి వెయ్యనిచో డ్రమ్ములో స్టీము జ అగు ప్రదేశం తగ్గి స్టీముతో పాటు నీరు కలిసి పొయ్యి స్టీములో తేమ శాతం పెరిగి పోవును.ఇలా నీరు కలిసిన స్టీమును వెట్ స్టీము లేదా అసంతృప్త స్టీము/నీటి ఆవిరి అందఉరు.అలాగే అవసరమైన మట్టానికి నీరు చేరినా పంపు తిప్పనిచో ఫైరు ట్యూబు బాయిలరు అయినచో నీటిమట్టం ట్యూబుల కన్నతక్కువ మట్టానికి పడి పోవడంతో ట్యూబులు బాగా వేడెక్కి,అధిక ఉష్ణోగ్రత కారణంగా సాగి,వ్యాకోచించి పగిలి పోయి ప్రమాదం జరుగును.అలాగే వాటరు ట్యూబు బాయిలరుల ట్యూబులలో నీరు లేక పోయిన ట్యూబులు వేడెక్కి కరిగి పగిలి పొయ్యి పెద్ద ప్రమాదం జరుగును.అందువలన మానవ తప్పిదం వలన జరిగే ప్రమాద నివారణకై ఆటోమాటిక్ గా పంపును తిప్పే,ఆపి పరికరమే మాబ్రి/మోబ్రే[1].

మాబ్రిలోని భాగాలు[2][మార్చు]

నిలువు స్తుపాకరాపు ఉక్కు గొట్టం/ఫ్లోట్ చాంబరు[మార్చు]

ఇది దాదాపు 500-600 మి.మీ పొడవు వుండును, పైభాగాన ఫ్లాంజి వుండును.అడుగున మరలున్న రంద్రం వుండును. దీనికి డ్రైన్ వాల్వును బిగిస్తారు.నిలువు ఆకారానికి పక్కల కొద్ది దూరం ఎడంగా రెండు తక్కువ పొడవున్న పైపులు వుండి వాటికీ ఫ్లాంజిలుండును.

స్టీలు ఫ్లోట్[మార్చు]

పొడవుగా స్తుపాకార స్టెయిన్‌లెస్ స్టీలుతో చేసిన ఫ్లోట్(లోపలి భాగం గుల్లగా వుండి ద్రవాల మీద తెలియాడు పొడవాటి గుండ్రని ఆకారం)వుండును.స్తూపాకర ఫ్లోట్ పైన కిందభాగాలు కొద్దిగా ఉబ్బుగా వుండును. ఫ్లోట్ లోపలి భాగం ఖాలిగా/గుల్లగా వుండటం వలన ఈ ఫ్లోట్ నీటిలో తెలియాడును.ఎడైన వస్తువు తొలగించిన నీటి/ద్రవం భారం కన్న,వస్తువు భారం తక్కువ ఉన్నచో అది తెలియాడును. ఫ్లోట్ పైన సన్నని స్టీలు కడ్డీ వుంది చివర చిన్నని అయస్కాంతం బిగించబడి వుండును.

స్విచ్ మెకానిజం భాగం[మార్చు]

ఈభాగం మాబ్రినిలువు గొట్టంపై ఫ్లాంజి బోల్తులతో బిగించటానికి సమానంగా డమ్మీ ఫ్లాంజిని కల్గిమధ్యలో ఒకస్టీలు గొట్టం వెల్డ్ చెయ్యబడి/అతుకబడి వుండును.ఈ గొట్టంలోనే స్టీలు ఫ్లోట్ రాడ్ పైభాగం, పైకి కిందికి కదులును

హెర్మిటికల్లి సీల్డ్ స్విచ్‌లు/ గాలిచొరబడకుండా మూయబడిన స్విచ్‌లు[మార్చు]

వీటిని స్విచ్ మెకానిజం భాగం మధ్యలో బోలుగా వున్న స్టీలుగొట్టం ఉపరితలం పై కొద్ది కొద్ది దూరం ఎడంగా హెర్మిటికల్లి సీల్డ్ స్విచ్‌లు బిగించబడి వుండును.కేవలం నీటీ మట్టాన్ని నియంత్రణ కైనచో రెండు స్విచ్‌లు వుండును. ఒకటి నీరు కనిష్టమట్టానికి నీరు వున్నప్పుడు పంపును ఆన్ చెయ్యుటకు, రెండవది గరిష్ట మట్టానికి నీరు చేరగానే పంపును ఆపుటకు. మరికొన్ని మోబ్రేలలో మూడో స్విచు వుండును.ఈ స్విచు పంపు ఆన్ కాక పోయిన లేక పంపు తిరుతున్నప్పటికి నీరు బాయిలరులోకి ఎక్కనప్పుడు.బాయిలరులో కనిష్టమట్టాని కన్న తక్కువకు నీటిమట్టం పడిపోయిన,ఈ స్విచ్చు బాయిలరు ఫిడ్ కన్వెయరు, ID,FD ఫ్యానులను ఆపును.ఈ స్విచ్ లలో మాగ్నటిక్ స్నాప్ మెకానిజం వుండును .ఫ్లోట్ రాడ్/కడ్డీ నీటిమట్టానికి అనుగుణంగా పైకి కిందికి కదులుతూ స్విచ్ సమీపానికి రాడ్ రాగానే,రాడ్ చివర నున్న మాగ్నెట్ యొక్క అయస్కాంత ప్రభావం వలన స్విచ్ పని చెయ్యును.[3]

వాతావరణ రక్షణ తొడుగు(weather proof cap)[మార్చు]

ఇది స్విచ్ మెకానిజం భాగాన్ని కప్పివుంచే తొడుగు.

మాబ్రి/మోబ్రే నిర్మానం-పనిచేసె విధానం[మార్చు]

నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం వుండి దాని నిలువు పక్కభాగంలో కొద్ది ఎడంగా ఫ్లాంజి వున్న రెండు చిన్న గొట్టాలు/ పైపులువుండును.ఇందులో పై ఫ్లాంజి బాయిలరు స్టీము వున్న భాగానికి కలుపబడి వుండగా, కింది పక్కన వున్న మరో ఫ్లాంజి బాయిలరులో నీరు వున్న భాగానికి కలుపబడి వుండును.ఈ రెండు కూడా బాయిలరుకు నేరుగా కాకుండా వాల్వుల ద్వారా కలుపబడి వుండును.ఏదైన సమస్య మాబ్రిలో వచ్చిన ఈవాల్వులను మూసి, మాబ్రిను విప్పి తనిఖీ చెయ్యవచ్చు. అలాగే పైభాగాన కూడా ఒక ఫ్లాంజి వుండును. ఈ ఫ్లాంజికి స్విచ్ మెకానిజం వున్న భాగాన్ని ఫ్లాంజి ద్వారా బిగిస్తారు.అలాగే నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం అడుగు భాగాన ఒక వాల్వు వుండి,మూసి వుండును.అప్పుడప్పుడు ఈ వాల్వును తెరచి లోపలి నీటిని బయటికి వదలవచ్చును.స్విచ్ మెకానిజం భాగంలో మధ్యనున్న స్టెయిన్‌లెస్ స్టీలు గొట్టం బయట కొద్ది దూర ఎడం వుండునట్లు మూడు మాగ్నటిక్ ఎలక్ట్రికల స్విచులు బిగించబడి వుండును.అన్నింటికన్నపైనున్న1వ స్విచు లెవల్ కు స్టిల్ ఫ్లోట్ రాడు పైభాగంలో వున్న అయస్కాంతం రాగానే,పంపు ఆగి పోవును. మధ్యలో వున్న 2వ స్విచు వద్దకు రాగానే పంపు ఆగి పోవును.ఏదైన కారణంచే పంపు పనిచెయ్యక పోయి నీటి మట్టం మరింత తగ్గిన,మూడో స్విచ్ వద్దకు రాగానే ఈ స్విచ్ వలన బాయిలరు బాయిలరు ID ఫ్యాన్,FD ఫ్యాన్, ఇంధన సరాఫరా వ్యవస్థ ఆగిపోవును. అంతే కాదు ప్రమాద ఘంటిక/అలారం మోగును[4][1].

బయటి లింకుల వీడియో చిత్రాలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

ఆధారాలు/మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "What is mobrey". thermodyneboilers.com. Retrieved 22-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "Mobrey Switches" (PDF). hemkuntelectronics.com. Retrieved 22-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "Mobrey Vertical magnetic level switches" (PDF). pmip.cz. Retrieved 22-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  4. "float switch". zipway.com.tw. Retrieved 22-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)