స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు
స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు
స్ప్లిట్ డిస్కు/వైఫర్ చెక్ వాల్వు

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు అనేది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం.ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువు ప్రవాహం కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును. వ్యతిరేక మార్గంలో ప్రవహించుటకు ప్రయత్నించిన వెంటనే కవాట తలుపు, కవాట ప్రవేశమార్గం/వాకిలిని మూసివేసి, ప్రవాహం వెనక్కి వెళ్ళకుండా నిరోదించును.

కవాటమనగా నేమి?[మార్చు]

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవంలేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం[1].ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును.గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు. తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.

ఏకదిశ ప్రవాహ కవాటమనగానేమి?[మార్చు]

ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును[2]. ఏకదిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు, నాన్ రిటర్నువాల్వు అంటారు.వ్యతిరేక దిశలో ప్రవహించు టను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును.ఉదాహరణకుగ్లోబ్ వాల్వు లేదాప్లగ్ వాల్వు లేదా బాల్ వాల్వు లలో రెండు వైపులా ప్రవహిం చును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు.గొట్టంలో ఒక ద్రవం కొంత పీడనంతో ఒక దిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/ మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకోచక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును. బాయిల రు పని చేయునపుడు అందులో తయా రగు స్టీము అధిక పీడనం కల్గి వుండును.కావున బాయిలరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయి లరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి, ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం, వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవాటాలు నిరోధించును. పంపుల ద్వారా నదులు, కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన, ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు[మార్చు]

స్ప్లిట్ డిస్కు ఏకదిశ ప్రవాహ కవాటంలో కవాట తలుపు రెండు సమాన అర్ధ వృత్తాకార భాగాలుగా వుండి, ఒక కీలుచీలకు బిగించబడి వుండును. కీలకానికి, తలుపులకు బిగించిన ఒక స్ప్రింగు వలన రెండు అర్ధవృత్తాకార భాగాలు వృత్తాకారంగా కవాట ప్రవాహ రంధ్రం/బెజ్జాన్ని మూసి ఉంచును.దీనిని డబుల్ డిస్కు చెక్ వాల్వు, ఇంకా వైఫెర్ చెక్ వాల్వు అనికూడా అంటారు.దీనీ డబుల్ డిస్కు చెక్ వాల్వు అనికూడా అంటారు[3]

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు నిర్మాణం[మార్చు]

చెక్ వాల్వులో ప్రధానంగా వున్న భాగాలు.

  • 1.బాడీ లేదా బాహ్యా నిర్మాణం
  • 2.కవాట తలుపులు/డిస్కులు
  • ౩.స్ప్రింగు
  • 4.కీలు చీల

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు పరిమాణం/సైజు-నిర్మాణంకై వాడు లోహాలు[మార్చు]

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వులను 2 అంగుళాల నుండి 48 అంగుళాల సైజు వరకు చేస్తారు.కవాటాన్నిపోత ఇనుము.కంచు,316 రకపు స్టెయిన్‌లెస్ స్టీలు, తక్కువ కార్బను ఉన్న ఉక్కు, మోనెల్ వంటి లోహలతో చేస్తారు[4]

బాడీ లేదా బాహ్య నిర్మాణం[మార్చు]

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు యొక్క బాడీ లేదా బాహ్య నిర్మాణం బటరుఫై వాల్వును పోలి వుండును.వాల్వు నిర్మాణం ఇంచుమించు అలాగే వుండును.బటరుఫై వాల్వులో కవాట తలుపు అఖండంగా వృత్తాకారంగా వుండగా, స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వులో కవాట తలుపు రెండు సమ అర్ధవృత్తాకార తలుపుల ఆకారంలో వుండును.బాడీ కాస్ట్ ఐరన్ లేదా కాస్ట్ స్టీలుతో లేదా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.

కవాట తలుపు/డిస్కు[మార్చు]

కవాట తలుపు లేదా వాల్వు డిస్కు రెండు సమ అర్ధవృత్తాకార నిర్మాణం కల్గి వుండును.అర్ధ వృత్తాకార సమాంతర భాగంలో ఒకటి లేదా రెండు అంగుళికం వంటి బొడిపెలు వుండును.వీటి గుండా ఒక కీలు చీలను జొప్పించి తలుపులను వేలాడదీయుదురు. కీలు చీలకు రెండు తలుపులను వృత్తాకారంగా విడదీసి వుంచేలా స్ప్రింగు అమర్చబడి వుండును.స్ప్రింగు వత్తిడి వల్ల మామూలు స్థితిలో కవాట తలుపు వృత్తాకారంగా కవాట ప్రవాహ ద్వారాన్ని మూసి ఉంచును.ప్రవాహం మొదలైనపుడు, అది కవాట తలుపుల పై కల్గించు వత్తిడి/ పీడనం వలన స్ప్రింగు దగ్గరిగా నొక్కబడి O ఆకారంలో ఉన్న తలుపులు V ఆకారంలో దగ్గరగా నొక్కబడి, పైపులో ప్రవాహం మొదలగును. ప్రవాహం ఆగగానే, స్ప్రింగువత్తిడి వలన తలుపులను మాములుగా O ఆకారంగా విస్తరింప చేసి, కవాట రంధ్రం/ద్వారాన్ని మూసి వేయును.

కీలచీల(pivot)[మార్చు]

ఈ కీలుకే కవాట తలుపులను వేలాడ దీయుదురు.ఇది ఒక మడత బందులా తలుపులు కదులుటకు సహకరించును.

స్ప్రింగు[మార్చు]

దీనిని స్థితిస్థాపక గుణం కల్గిన స్టెయిన్ లెస్ స్టీలుతో తయారు చేయుదురు. ఈ స్ప్రింగు మామూలు స్థితిలో కవాట తలుపులను గుండ్రంగా బిళ్ళలా వుండేలా చేయును.

వినియోగం[మార్చు]

ఈ వాల్వును ఎక్కువ ఉష్ణోగ్రత, పీడనంవున్నప్రవాహలప్రసరణకు వాడవచ్చును.తీవ్రమైన రసాయనాలను, ఆమ్లాలను, వాయువుల ప్రసరణకు వాడవచ్చును[3]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]