క్షితిజసమాంతర ఏకదిశ కవాటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్షితిజసమాంతర ఏకదిశ కవాటం రేఖాచిత్రం
కవరుకు గైడరు వున్న క్షితిజసమాంతర ఏకదిశ కవాటం రేఖాచిత్రం

క్షితిజసమాంతర ఏకదిశ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం.

కవాటం[మార్చు]

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవం లేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం[1]. ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును.గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు.తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.

ఏకదిశ ప్రవాహ కవాటం[మార్చు]

ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును[2]. ఏకదిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు, నాన్ రిటర్నువాల్వు అంటారు.వ్యతిరేక దిశలో ప్రవహించుటను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును. ఉదాహరణకుగ్లోబ్ వాల్వు లేదా ప్లగ్ వాల్వు లేదా బాల్ వాల్వు లలో రెండు వైపులా ప్రవహించును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు. గొట్టంలో ఒక ద్రవం కొంత పీడనంతో ఒక దిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/ మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకో చక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును. బాయిల రు పని చేయునపు డు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును. కావున బాయి లరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయిలరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి,, ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం, వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా టలు నిరోధించును.పంపుల ద్వారా నదులు, కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన, ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

క్షితిజసమాంతర ఏకదిశ కవాటం[మార్చు]

కవాటాన్ని పైపులకు క్షితిజసమాంతరస్థితిలో బిగింపబడి వుండుట వలన ఈ కవాటాన్ని క్షితిజసమాంతర ఏకదిశ ప్రవాహ కవాటం అంటారు[3].ఈ రకపు కవాటాలు కేవలం క్షితిజ సమాంతరంగా బిగించిన పనిచేయును. ఇవి నిలు వుగా, లేదా ఏటవాలుగా బిగించిన పనిచేయవు.ఈ కవాటం చూచుటకు నిర్మాణంలో ఇంచు మించు గ్లోబు వాల్వు వలె వుండును.గ్లోబు వాల్వులో కవాట బిల్లకు కాడ, గ్లాండ్,, పిడి వుండును.క్షితిజసమాంతర ఏకదిశ కవాటంలో ఇవేవి వుండవు. ఇందులో బాడీ, కవాట బిళ్ళ, గైడరు గొట్టమున్న కవరు/మూత/కప్పు వుండును.

క్షితిజసమాంతర ఏకదిశ కవాటం నిర్మాణం[మార్చు]

కవాటంలోని ప్రధాన భాగాలు

  • 1.బాడీ
  • 2.కవాట బిళ్ళ/డిస్కు
  • 3.మార్గనిర్దేశిని (గైడరు)
  • 4.కవరు ప్లేట్/మూత.

బాడీ/దేహ ఆకృతి[మార్చు]

ఇది ఇత్తడి లేదా పోత ఇనుము లేదా పోత ఉక్కుతో చెయ్యబడును.కవాట దేహఆకృతి మధ్యలో ఉబ్బుగా గోళాకారంగా వుండి, రెండు చివరలు సమాంతరంగా వుండును.గోళాకార భాగంలో నిలువుగా రంద్రమున్న వాల్వు సీట్/పీఠం/పీట/ఆసనం వుండును.ఈ రంధ్రం చుట్టూ కంకణం వంటి తొడుగు వుండును.దానిని సీట్ రింగు (పీఠ కంకణం ) అంటారు. నునుపుగా వున్న దీని సమతల ఉపరితలం మీద వాల్వు బిళ్ళ ఖాళీ లేకుండా కూర్చోనును.బాడీ వెలుపల ప్రవాహ దిశను తెలుపు బాణం గుర్తు వుండును. గొట్టంలో ద్రవం లేదా వాయువు ప్రవహించు దిశకు ఈ బాణం గుర్తు వ్యతిరేక దిశలో ఉండునట్లు బిగించిన వాల్వు పనిచేయదు. అందువలన గొట్టం లోని ప్రవాహ దిశ, బాణంగుర్తు ఒకే దిశను చూపించునట్లు కవాటాన్ని బిగించాలి

కవాట బిళ్ళ/డిస్కు[మార్చు]

ఇది గుండ్రంగా వృత్తాకారంలో బిళ్లలా వుండును.కొన్ని రకాల వాల్వులలో ఈ బిళ్ళ పై భాగాన స్తుపాకరంగా ఒక చిన్న బొడిపె వంటికాడ వుండును. ఈ స్తూపాకర బొడిపె కాడ కవరు/మూతకు వున్న గొట్టం గైడరు లోపలి వరకు ఉండును.కవరుకు ఉన్న, గొట్టం వంటి ఈభాగాన్ని గైడరు అంటారు. వాల్వు పని చేయునపుడు, ప్రవాహ వత్తిడికి పైకి లేచిన బిళ్ళ, ప్రవాహ వేగానికి బిళ్ళ పక్కకి తోయ్యబడ కుండా ఈ గైడరు అడ్డుకొనును.కవాట బిళ్ళ బాడిలో నిలువుగా వున్న కవాట రంధ్రం మీద క్షితిజసమాంతరంగా కూర్చోనును.కొన్ని రకాల వాల్వులలో బిళ్ళకు పైన కాకుండా కింద వైపున మూడు నాలుగు బాగాలుగా చీలిన కాడ వుండును.ఈ పొడవాటి చీలిక భాగాలు కవాట బిళ్ళ కవాట రంధ్రం నుండి బయటకు పోకుండా ఆపును. మరికొన్ని కవాటాలలో బిళ్ళ పైనున్న కాడకు స్ప్రింగు కూడా వుండును[4].

గైడరు[మార్చు]

ఇది ప్రవాహవేహానికి పీటరంధ్రం నుండి కవాట బిళ్ళ పక్కకు తప్పుకో కుండా సరైన స్థానంలో ఉండునట్లు చేయును.కొన్ని రకాల వాల్వులలో ఇది కవరు/మూతకు లోపల గొట్టం వంటి ఆకృతిలో వుండును. కొన్నింటిలో కవాట రంధ్రానికి కింది వైపు వుండను. కవాట బిళ్ళకు కింది వైపు చీలిన కాడ వున్న బిల్లకు ప్రత్యేకంగా గైడరు వుండరు.

కవాటం పని చేయు తీరు[మార్చు]

వాల్వును ప్రవాహ పైపుకు క్షితిజసమాంతరముగా బిగిస్తారు.వాల్వులోకి ప్రవాహం, కవాట బిళ్ళవున్న కింది భాగంలో ప్రవేశించును.ప్రవాహం బిళ్ళ అడుగు భాగంపై కల్గించు ఉర్ధ్య పీడన ప్రభావ ఫలితంగా బిళ్ళ పైకి లేచును. ప్రవాహ వేగానికి, బిళ్ళ రంధ్రం నుండి పక్కకు జారి పోకుండా మూతకు వున్నా గైడరు ఆపును.కవాట బిళ్ళకు, కవాట రంధ్రానికి మధ్యలో ఏర్పడిన ఖాళి ద్వారా ప్రవాహం వాల్వు యొక్క రెండ భాగం నుండి బయటకు ప్రవహించును.కవాట రంధ్రం యొక్క పరిమాణం ప్రవాహం లోపలి వచ్చు, బయటికి వెళ్ళు రంధ్రం కన్న తక్కువ ఉండటం వలన, కవాట బిళ్ళ కింద ఎక్కువ పీడనం, బిళ్ళ పైన తక్కువ పీడన ప్రవాహం వుండటం వలన, ప్రవాహం ఉన్నంత సేపు బిళ్ళ, కవాట రంధ్రం పై తేలుతూ వుండును.ప్రవాహం ఆగిపోగానే, బిళ్ళ కింద పీడనం సున్నాకు పడి పోవును, బిళ్ళ దాని బరువు వలన పీట పై కూర్చోనును.ఇప్పుడు బయటికి వెళ్ళిన ప్రవాహం వెనకకు ప్రవహించి బిళ్ళ పైభాగాన కల్గించు వత్తిడి వలన బిళ్ళ కిందకు నొక్క బడి కవాట రంద్రం మీద ఖాళీ లేకుండా కూర్చోని పోవడం వలన, ప్రవాహం వెనక్కి ప్రవహించకుండా ఆగిపోవును.

వినియోగం[మార్చు]

  • 1.బాయిలరు ఫీడ్ వాటరు పైపుకు అమర్చెదరు.
  • 2.ఎత్తైన నిల్వ టాంకులలోనికి (over head tank ) నీటిని తోడు పంపుల డెలివరి గొట్టాలకు ఎక్కువగా హారిజాంటల్ చెక్ వాల్వును వాడుతారు.

బయటి వీడియోల లింకులు[మార్చు]

ఇవికూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]