వెర్టికల్ చెక్ వాల్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెర్టికల్ డిస్కు చెక్ వాల్వు
స్వింగు వెర్టికల్ చెక్ వాల్వు
డైఫ్రాం చెక్ వాల్వు

వెర్టికల్ చెక్ వాల్వు అనేది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం. దీని బాడీని క్షితిజ లంబంగా ప్రవాహ పైపుకు బిగించెదరు. వెర్టికల్ చెక్ వాల్వు అనేది ఇంగ్లీసు పేరు.ఈ ఏకదిశ ప్రవాహ కవాటాన్ని తెలుగులో క్షితిజలంబ ఏకదిశ ప్రవాహ కవాటం అంటారు.ఈ రకపు కవాటంలో ప్రవాహం నిలువుగా పైకి మాత్రమే ప్రవహించును.అసలు కవాటమనగా నేమి?

కవాటమనగా నేమి?[మార్చు]

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవం లేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం[1].ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును.గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు. తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.

ఏకదిశ ప్రవాహ కవాటమనగానేమి?[మార్చు]

ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును[2].ఏకదిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు, నాన్ రిటర్నువాల్వు అంటారు.వ్యతిరేక దిశలో ప్రవహించుటను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును. ఉదాహరణకుగ్లోబ్ వాల్వు లేదాప్లగ్ వాల్వు లేదా బాల్ వాల్వు లలో రెండు వైపులా ప్రవహించును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు. గొట్టంలో ఒక ద్రవం కొంత పీడనంతో ఒక దిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/ మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును. ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకో చక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును. బాయిల రు పని చేయునపుడు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును. కావున బాయి లరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయి లరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి, ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం, వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా టలు నిరోధించును.పంపుల ద్వారా నదులు, కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన, ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

వెర్టికల్ చెక్ వాల్వు/ క్షితిజ లంబ/నిలువు ఏకదిశ ప్రవాహ కవాటం లోని రకాలు[మార్చు]

వెర్టికల్ చెక్ వాల్వు నిర్మాణ పరంగా పలు ఆకృతులలో తయారు అవుతున్నది. నిలువుగా పనిచేయు వాల్వులలో కవాట బిళ్ళ ఆధారంగా కొన్ని చెక్ వాల్వులు.

  • 1.డిస్కు క్షితిజలంబ ఏకదిశ ప్రవాహ కవాటం
  • 2.డైఫ్రామ్ చెక్ వాల్వు/మధ్యపటల ఏకదిశ వాల్వు
  • 3.స్వింగు చెక్ వాల్వు

డిస్కు వెర్టికల్ చెక్ వాల్వు[మార్చు]

ఈ రకపు కవాటంలో కవాటబాడీని క్షితిజలంబంగా/నిలువుగా ప్రవాహ గొట్టానికి బిగింఛబడివుండి, కవాట ద్వారం బిళ్ల ఆకారంలో వుండీ ప్రవాహ వత్తిడికి నిలువుగా పైకి లేచును.ఈ రకపు ఏకదిశ ప్రవాహ కవాటంలో బాడీ అనబడు ఆకృతి భాగం స్తుపాకరంగా వుండును. బాడీని లోహంతో లేదా ప్లాస్టిక్ తో చేస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రతతో పని చేయు కవాటాలను లోహాలతో, తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేయు వాల్వులను ప్లాస్టికు పదార్థాలతో చేస్తారు. చిన్న సైజు (బాడీ లోపలి వ్యాసం ఆధారంగా వాల్వుల సైజును గణిస్తారు. బాడీ లోపలి వ్యాసం ఆధారంగా వాల్వు సైజును మీ.మీ లేదా అంగుళాలలో లెక్కిస్తారు. బాడీ లోపలి రంధ్రం వ్యాసం 25 మీ.మీ ఉన్నచో 25 మీ.మీ వాల్వు లేదా 2అంగుళాల వాల్వు (2”వాల్వు) అంటారు.లోపలి వ్యాసం 40 మీ.మీ ఉన్నచో 40 మీ.మీవాల్వు లేదా 1 1/2” వాల్వు (ఒకటిన్నర అంగుళాల వాల్వు) అంటారు. బాడి చివరలు మరలు కల్గి ఉన్న త్రేడేడ్ ఎండ్ అని, ఫ్లాంజి లున్న ఫ్లాంజ్ ఎండ్ వాల్వులని అంటారు.

డిస్కు వృత్తాకారంగా బిళ్ళ వలె వుండును. వాల్వు నిలువు పీఠం (valve seat) ను తాకు కవాటబిళ్ళ ఉపరితలం నునుపుగా వుండును. బిళ్ళ పైభాగం లేదా కింది భాగంలో స్తూపాకారపు కాడ వంటిది వుండి, అది గైడరు అనబడు దానిలోకి చొప్పించబడి వుండును. బిళ్ళకాడ ఈ గైడరు/మార్గ నిర్దేశినిలో వుండటం వలన, వాల్వు పనిచేయునపుడు పైకి కిందికి కదులు నపుడు, ప్రవాహ వేహానికి కవాట రంధ్రం నుండి స్థాన భ్రంశము చెందకుండా చేయును. కొన్ని కవాటాలలో బిళ్ళకు గైడరుకు మధ్యలో కాడకు స్ప్రింగ్వుండును.లోహంతో చేసిన వాల్వులలో కవాట బిళ్ళ ఇత్తడి లేదా కంచుతో చెయ్యబడి వుండును. ఆహార పదార్థాల, ఔషధ తయారీ పరిశ్రమలో వాడు వాల్వులు, కవాట బిళ్ళలు స్టెయిన్ లెస్ ఉక్కుతో చెయ్యబడి వుండును[3].

డైఫ్రాం(diaphragm) చెక్ వాల్వు/మధ్యపటల ఏకదిశ వాల్వు[4][మార్చు]

ఈ రకపు వాల్వులో కవాటం వెలుపలి ఆకారం స్తూపాకరంగా గొట్టంలా వుండును.లోపల బోలు/డొల్ల శంకువు ఆకారం వంటిభాగం వుండి, కోసుగా ఉన్న భాగం మినహాయింఛి విశాలంగా వున్న భాగంలో పలురంధ్రాలు వుండును. ఈశంకువు పైna స్థితి స్థాపకత గుణం వున్న పదార్థంలో చేసిన శంకువు ఆకారపుపొర వుండును. ఈ పొర అడుగు భాగం (కోసుగా వున్న భాగం) అతికింప బడి, మామూలు స్థితిలో పొర పైభాగం శంకువు ఆకారం గొట్టాన్ని మూసి, రంధ్రాలను కప్పి వుంచును.కింది నుండి పైకి ప్రవాహం మొదలవగానే, ప్రవాహ వత్తిడికి పొర/ డయఫాం దగ్గరగా నొక్కబడి, శంకువు లోహ ఆకారపు రంధ్రాల ద్వారా ప్రవాహం పైకి ప్రవహించడం మొదలగును. కింది ప్రవాహం ఆగి పోగానే పై ప్రవాహ పదార్థ వత్తిడి/బరువు వలన, పొరకు వున్నా సహజ స్థితి స్థాపక గుణం వలన మరల రంధ్రాలను మూసి వేయును[3].

స్వింగు చెక్ వాల్వు[మార్చు]

ప్రధాన వ్యాసం స్వింగు చెక్ వాల్వుచదవండి

ఉపయోగాలు[మార్చు]

  • 1వెర్టికల్ డిస్కు చెక్ వాల్వులను ఎక్కువగా ద్రవాల ప్రవాహ పైపులలో ఉపయోగిస్తారు.
  • 2.పంపుల ఫూట్ వాల్వులు (foot valve) ఎక్కువగా వెర్టికల్ చెక్ వాల్వూమరిక కల్గినవే, కాకపోతే అడుగున ఫిల్టరు అదనంగా జోడింపబడి వుండును.

ఈ వ్యాసాలను కూడా చదవండి[మార్చు]

ఆధారాలు/మూలాలు[మార్చు]