Jump to content

కాటా శ్రీనివాస్ గౌడ్

వికీపీడియా నుండి
కాటా శ్రీనివాస్ గౌడ్
నియోజకవర్గం పటాన్‌చెరు

వ్యక్తిగత వివరాలు

జననం 13 డిసెంబర్ 1980
అమీన్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కాటా దర్శన్ గౌడ్, నీలమ్మ
జీవిత భాగస్వామి కాటా సుధా రాణి
సంతానం శ్రీనిధి & కౌశిక్ గౌడ్
నివాసం 23/9-2A, వినాయక్ నగర్ కాలనీ, రామచంద్రాపురం మండలం, సంగారెడ్డి జిల్లా

కాటా శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 2005లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, పటాన్‌చెరు ఆటో యూనియన్‌ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నుండి ఇండియన్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా, 2009లో రెండుసార్లు ఉమ్మడి మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి, 2013లో జరిగిన గ్రామా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి అమీన్‌పూర్ సర్పంచ్‌గా ఎన్నికై ఆ తరువాత ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచ్ల జిల్లా ఫోరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.   

కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకుగాను ఆయనను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నియమించారు. ఆయన 2018 & 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2023). "ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ తుది జాబితా". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Eenadu (10 November 2023). "పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  3. Sakshi (10 November 2023). "నీలం స్థానంలో కాట." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.