Jump to content

కాట్రగడ్డ పద్దయ్య

వికీపీడియా నుండి
కాట్రగడ్డ పద్దయ్య
జననం (1943-05-20) 1943 మే 20 (వయసు 81)
పాములపాడు
వృత్తిపురాతత్వవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

కాట్రగడ్డ పద్దయ్య భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎమెరిటస్, పూణే డెక్కన్ కళాశాల మాజీ డైరెక్టర్. అతను పురావస్తు సిద్ధాంతానికి, పద్దతికీ రెండు ప్రధాన దృక్కోణాలను పరిచయం చేశాడు.[1] 2012లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. [2]

పద్దయ్య పూణేకు చెందినవాడు. 1968లో పూణే విశ్వవిద్యాలయం నుండి పురావస్తు శాస్త్రంలో డాక్టరల్ డిగ్రీ పొందాడు.[3] డెక్కన్ కళాశాల ఆర్కియాలజీ విభాగంలో చేరి యూరోపియన్ పూర్వ చరిత్రలో లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, అతను రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆ తరువాత సంస్థ డైరెక్టరుగా ర్యాంకుల్లో ఎదిగాడు.[4] పదవీ విరమణ సమయంలో, దక్కన్ కళాశాల పద్దయ్యకు ప్రొఫెసర్ ఎమిరిటస్ హోదాను ప్రదానం చేసింది.[5][4]

దక్కన్‌లోని షోరాపూర్ దోయాబ్‌లోని ప్రాచీన శిలాయుగ, నియోలిథిక్ సంస్కృతులపై పద్దయ్య విస్తృత పరిశోధనలు చేసాడు.[6][7] పురావస్తు అధ్యయనాలలో అతను సైద్ధాంతిక, పద్దతికి సంబంధించిన దృక్పథాలతో ఘనత పొందాడు. వీటిని ప్రధాన ఆవిష్కరణలుగా భావిస్తారు. [8] అతను యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికోతో కలిసి రెండు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌లు పొందాడు. ఇది అమెరికా, భారతీయ పురావస్తు శాస్త్రవేత్తల మధ్య మెరుగైన సహకారానికి సహాయపడింది.[1] అతను మిచిగాన్ విశ్వవిద్యాలయం, ఆన్ అర్బోర్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ నుండి సీనియర్ లెక్చర్ గ్రాంట్లు కూడా అందుకున్నాడు.[1]

ప్రఖ్యాత పండితుడు, కెన్నెత్ అడ్రియన్ రైన్ కెన్నెడీతో సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్న పద్దయ్య,[9] 7 పుస్తకాలు,[1] పీర్ రివ్యూడ్ పత్రికల్లో అనేక వ్యాసాలూ రచించాడు.[10][11][12] అతని ముఖ్యమైన రచనలలో కొన్ని:

  • భారతీయ పురావస్తు శాస్త్రంలో ఇటీవలి అధ్యయనాలు [13]
  • షోరాపూర్ దోయాబ్, దక్షిణ భారతదేశంలోని నియోలిథిక్ సంస్కృతిపై పరిశోధనలు [14]
  • న్యూ ఆర్కియాలజీ అండ్ ఆఫ్టర్‌మాత్: ఎ వ్యూ ఫ్రమ్ ఔట్‌సైడ్ ది ఆంగ్లో-అమెరికన్ వరల్డ్ [15]
  • భారతదేశ పూర్వ గతం అధ్యయనానికి మల్టిపుల్ అప్రోచ్‌లు: సైద్ధాంతిక పురావస్తు శాస్త్రంలో వ్యాసాలు [16]

పద్దయ్య ఇండియన్ హిస్టారికల్ రివ్యూ, జర్నల్ ఆఫ్ సోషల్ ఆర్కియాలజీ [5] వంటి పత్రికల సంపాదకీయ బోర్డులకు సేవలందించాడు. పురావస్తు శాస్త్రంపై అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు.[17] సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్ ఆఫ్ లండన్ లో గౌరవ సహచరుడు. పద్దయ్యకు 2012లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. [5] [18]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "USIEF". USIEF. 2014. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 17 December 2014.
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  3. Gullapalli, Praveena; Jhaldiyal, Richa (2014). "Paddayya, Katragadda". Springer. Springer. pp. 5707–5708. doi:10.1007/978-1-4419-0465-2_320. ISBN 978-1-4419-0426-3.
  4. 4.0 4.1 "Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014.
  5. 5.0 5.1 5.2 Gullapalli, Praveena; Jhaldiyal, Richa (2014). "Paddayya, Katragadda". Springer. Springer. pp. 5707–5708. doi:10.1007/978-1-4419-0465-2_320. ISBN 978-1-4419-0426-3.Gullapalli, Praveena; Jhaldiyal, Richa (2014). "Paddayya, Katragadda". Springer. Springer. pp. 5707–5708. doi:10.1007/978-1-4419-0465-2_320. ISBN 978-1-4419-0426-3.
  6. K. Paddayya, ed. (January 2004). Recent Studies in Indian Archaeology (Indian Council of Historical Research Monograph, 6). Munshiram Manoharlal Publishers. p. 454. ISBN 978-8121509299.
  7. "Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014."Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014.
  8. "USIEF". USIEF. 2014. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 17 December 2014."USIEF" Archived 2015-08-28 at the Wayback Machine. USIEF. 2014. Retrieved 17 December 2014.
  9. Rajendran, S. (7 May 2014). "The hindu". The hindu. Retrieved 17 December 2014.
  10. "IISC" (PDF). IISC. 2014. Retrieved 17 December 2014.
  11. "Academia". Academia. 2014. Retrieved 17 December 2014.
  12. "Worldcat". Worldcat. 2014. Retrieved 17 December 2014.
  13. K. Paddayya, ed. (January 2004). Recent Studies in Indian Archaeology (Indian Council of Historical Research Monograph, 6). Munshiram Manoharlal Publishers. p. 454. ISBN 978-8121509299.K. Paddayya, ed. (January 2004). Recent Studies in Indian Archaeology (Indian Council of Historical Research Monograph, 6). Munshiram Manoharlal Publishers. p. 454. ISBN 978-8121509299.
  14. K. Paddayya; D. R. Shah (August 1997). Investigations into the Neolithic Culture of the Shorapur Doab, South India (Studies in South Asian Culture). Brill Academic Pub. ISBN 978-9004037694.
  15. K. Paddayya (1990). The New Archaeology and Aftermath: A View from Outside the Anglo-American World. Ravish Publishers.
  16. K. Paddayya (September 2004). Multiple Approaches to the Study of India's Early Past: Essays in Theoretical Archaeology. Aryan Books International. p. 230. ISBN 978-8173054785.
  17. "Deccan College". Deccan College. 2014. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 17 December 2014.
  18. "Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014."Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014.