కాడు మల్లేశ్వర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాడు మల్లేశ్వర దేవాలయం
కాడు మల్లేశ్వర దేవాలయం is located in Bengaluru
కాడు మల్లేశ్వర దేవాలయం
బెంగళూరులో ప్రాంతం ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు13°00′18″N 77°34′17″E / 13.004966°N 77.5714462°E / 13.004966; 77.5714462

కాడు మల్లేశ్వర దేవాలయం, బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న శివాలయం. సా.శ. 17వ శతాబ్దంలో నిర్మించబడిన హిందూ దేవాలయం. ఈ దేవాలయం పేరుమీదుగా ఈ ప్రాంతానికి మల్లేశ్వరం అనే పేరు పెట్టారు.[1] ప్రధాన గర్భగుడి లోపల ఒక పెద్ద శివలింగం ఉంది.

చరిత్ర

[మార్చు]

సా.శ. 17వ శతాబ్దంలో మరాఠా రాజు శివాజీ సోదరుడు వెంకోజీ ద్రావిడ శైలిలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు.[2] శివుడిని మల్లికార్జునుడిగా పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో నందిశ్వర తీర్థ (బసవ తీర్థ) దేవాలయం కూడా ఉంది. దీనిన వృషభవతి నది యొక్క ప్రధాన వనరు లేదా జన్మస్థలం అని అంటారు.

నిర్మాణ శైలి

[మార్చు]

బెంగళూరులోని ఘనత పొందిన అనేక పాత దేవాలయాలలో ఇదీ ఒకటి. దాదాపు 200 సంవత్సరాల క్రితం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఇక్కడ శివుడితోపాటు పార్వతి దేవిని కూడా పూజిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణం ముందు నందిశ్వర తీర్థ ఆలయం కూడా నిర్మించబడింది. ఈ ఆలయ సముదాయం విస్తారమైన తోట మధ్యలో విస్తరించి ఉంది. 1669లో "శివలింగం" మీద ఉన్న శాసనాలలో ఛత్రపతి శివాజీ సోదరుడు వెంకోజీకి చెందిన చరిత్ర తెలియజేస్తోంది.

ఉత్సవాలు

[మార్చు]

ఈ ఆలయంలో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పూజలు నిర్వహించబడుతాయి. ఈ ఆలయంలో దాదాపు అన్ని పండుగలను ఆచారాలతో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వ సమయంలో పదిహేను రోజుల ఉత్సవం ఏర్పాటు చేయబడుతోంది. ఈ పెద్ద పండుగను జరుపుకునేందుకు స్థానిక భక్తులు, నిర్వాహకులు ఒక వేడుకను నిర్వహిస్తారు. భక్తులు ఈ రాత్రి ఉపవాసం పాటిస్తూ, శివలింగం మీద పండ్లు, పువ్వులు, బెల్ ఆకులను సమర్పిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Temples of Malleshwaram – Venugopal Swamy, Kaadu Malleshwara and Sai Baba Temple". Archived from the original on 23 నవంబరు 2019. Retrieved 6 February 2021.
  2. Dasharathi, Poornima. "A whiff of Malleswaram". Citizen Matters. Retrieved 6 February 2021.