మల్లేశ్వరం (బెంగళూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లేశ్వరం

మల్లేశ్వర
సమీపప్రాంతం
Mantri Central, Bangalore.jpg
OrangesandApples 03.jpgChowdiah Memorial Hall.jpg
మంత్రి సెంట్రల్, మల్లేశ్వర కూరగాయల మార్కెట్, చౌడయ్య మెమోరియల్ హాల్
మల్లేశ్వరం is located in Bengaluru
మల్లేశ్వరం
మల్లేశ్వరం
నిర్దేశాంకాలు: 13°00′11″N 77°33′51″E / 13.0031°N 77.5643°E / 13.0031; 77.5643Coordinates: 13°00′11″N 77°33′51″E / 13.0031°N 77.5643°E / 13.0031; 77.5643
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
మెట్రోపాలిటన్ ప్రాంతంబెంగళూరు మెట్రోపాలిటన్ ప్రాంతం బెంగళూరు
భాషలు
 • అధికారికకన్నడ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
560003, 560055

మల్లేశ్వరం, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరానికి వాయువ్య దిశలో ఉన్న శివారు ప్రాంతం. ఇది బిబిఎంపి జోన్లలో ఒకటి. 1898లో వచ్చిన ప్లేగు వ్యాధి తరువాత ఇది ఒక శివారు ప్రాంతంగా అభివృద్ధి చేయబడింది. చాలామంది నగర కేంద్రం నుండి బయటకు వచ్చారు. కడు మల్లేశ్వర దేవాలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి మల్లేశ్వరం అని పేరు వచ్చింది.[1] బెంగళూరు వరల్డ్ ట్రేడ్ సెంటరు, మంత్రి స్క్వేర్, ఓరియన్ మాల్ వంటి షాపింగ్ మాల్స్, అనేక కార్యాలయాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

మైసూర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్ హెచ్.వి.నంజుండయ్య అప్పటి శివారు మల్లేశ్వరంను నిర్మించాడు.[1] ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. నోబెల్ గ్రహీత సి.వి.రామన్, శాస్త్రవేత్త కృష్ణస్వామి కస్తూరిరంగన్, బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ ప్రకాష్ పడుకోనే, అతని కుమార్తె దీపికా పదుకోణే, కర్ణాటక సంగీతకారుడు దొరైస్వామి అయ్యంగార్, నృత్యకారిణి శాంతారావు, సినీ తారలు బి. సరోజా దేవి, రాధిక పండిట్, జగ్గేష్ మొదలైనవారు ఇక్కడ నివసించేవారు.

బెంగళూరు సెంట్రల్ టిఫిన్ రూమ్ (1920), జనతా హోటల్, న్యూ కృష్ణ భవన్, వీణ స్టోర్స్ వంటివి వారసత్వ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.[2]

ప్రదేశం[మార్చు]

ఇది నగర వాయువ్య భాగంలో ఉంది. ఇక్కడికి సమీపంలో యశ్వంత్‌పూర్, రాజాజినగర్, సదాశివ్‌నగర్, శేషాద్రిపురం, కెంపెగౌడ బస్ టెర్మినస్ ఉంది. సంపిగే రోడ్ లో మల్లేశ్వరం మెట్రో స్టేషను ఉంది.

ముఖ్యమైన ప్రదేశాలు[మార్చు]

  • జామియా మసీదు
  • కడు మల్లేశ్వర దేవాలయం
  • శ్రీ గంగమ్మ దేవి దేవాలయం
  • శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
  • శ్రీ కన్యాకపరమేశ్వరి దేవాలయం
  • శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం
  • శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం[3]
  • సాంకే ట్యాంక్
  • ఎంఈఎస్ పియు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్
  • మంత్రి స్క్వేర్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Malleshwaram retains the Bangalore of yore". DNA India. 2012-04-09. Retrieved 2021-02-06.{{cite web}}: CS1 maint: url-status (link) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "DNA" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Malleswaram Bangalore PinCode". citypincode.in. Archived from the original on 2015-09-24. Retrieved 2021-02-06.
  3. "Bengaluru's Malleswaram: Where live gods and their noble soldiers". The New Indian Express. Retrieved 2021-02-06.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లంకెలు[మార్చు]