కృష్ణస్వామి కస్తూరిరంగన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణస్వామి కస్తూరిరంగన్ (జననం: అక్టోబర్ 24, 1940) ఈయన భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1940, అక్టోబర్ 24 న తమిళనాడు రాష్ట్రంలోని ఎర్నాకులంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను ఎర్నాకులం లోని ఎస్.ఆర్.వి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తిచేసాడు. ఈయన సెంట్రల్ ముంబైలోని మాతుంగాలోని రామ్‌నారైన్ రుయా కాలేజీలో సైన్స్ విభాగంలో పూర్తిచేశాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. ఈయన 1971 లో అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో పనిచేస్తూ ప్రయోగాత్మక హై ఎనర్జీ ఖగోళ శాస్త్రం నుంచి డాక్టరేట్ డిగ్రీని పొందాడు.