Jump to content

శాంతారావు (నృత్యకారిణి)

వికీపీడియా నుండి
శాంతారావు
జననం
శాంతారావు

1930
మరణండిసెంబరు 28, 2007
వృత్తినృత్యకారిణి

శాంతారావు (1930 - డిసెంబరు 28, 2007) భారతదేశానికి చెందిన నృత్యకారిణి. ఆమె భరతనాట్యం, కథాకళి, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించింది.

జననం

[మార్చు]

శాంతారావు, 1930లో మంగళూరులో జన్మించింది.[1] ముంబై, బెంగుళూరులో నివసించింది.

నృత్యరంగం

[మార్చు]

రావున్ని మీనన్ దగ్గర కథాకళి, పానిక్కర్ దగ్గర మోహినియట్టం నేర్చుకుంది. 1940లలో శ్రీలంక వెళ్లి గుణయా వద్ద కండియన్ నృత్యాలు కూడా నేర్చుకుంది. శాంతా అనేక నృత్య రూపాలను నేర్చుకున్నప్పటికీ, చివరికి ఆమె భరతనాట్యాన్ని ఎంచుకుంది, భరతనాట్యం నేర్చుకోవడానికి పాండనల్లూరుకు వెళ్లి, గురు మీనాక్షి సుందరం పిళ్ళై ఇంటి వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది. 1943లో ఎగ్మోర్ లోని మద్రాస్ మ్యూజియం థియేటర్ లో తొలి ప్రదర్శన ఇచ్చి, ప్రశంసలు అందుకుంది.[2]

పురస్కారాలు

[మార్చు]

1971లో భారతదేశం ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నది.[3] సంగీతం, నృత్యం, నాటకం అభివృద్ధికోసం భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నది.[4] 1993-94లలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి శాస్త్రీయ నృత్యం విభాగంలో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం అందుకుంది.[5]

మరణం

[మార్చు]

శాంతారావు 2007, డిసెంబరు 28న బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో తన స్వగృహంలో మరణించింది.[6]

ఉపయుక్త గ్రంథాలు

[మార్చు]
  • Sunil Janah; Ashoke Chatterjee (1979). Dances of the Golden Hall: Photographs of the Indian classical dancer Shanta Rao. Indian Council for Cultural Relations.

మూలాలు

[మార్చు]
  1. Selma Jeanne Cohen; Dance Perspectives Foundation (1998). International encyclopedia of dance: a project of Dance Perspectives Foundation, Inc. Oxford University Press. ISBN 978-0-19-512309-8.
  2. "Shanta Rao". Sahapedia. Retrieved 2021-02-06.
  3. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs (India). Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 6 February 2021.
  4. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 2015-05-30. Retrieved 6 February 2021.
  5. "Kalidas Award Holders (Classical Dance)". Department of Culture, Government of Madhya Pradesh. Archived from the original on 9 April 2012. Retrieved 6 February 2021.
  6. Dr. Sunil Kothari (16 May 2008). "Remembering the one and only Shanta Rao". Narthaki. Retrieved 6 February 2021.