కామన ప్రభాకరరావు
Jump to navigation
Jump to search
కామన ప్రభాకర్ రావు | |
---|---|
నియోజకవర్గం | మండపేట శాసనసభనియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మండపేట, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | 1962 మే 25
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | సత్యవాణి |
సంతానం | ఇద్దరు కొడుకులు |
కామన ప్రభాకర్ రావు ( Telugu: కామన ప్రభాకర రావు ), భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కామన ప్రభాకరరావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మండపేట శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. [1]
సామాజిక సేవ[మార్చు]
- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగా ప్రభాకరరావు పనిచేశారు & గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు 600 మంది గోదావరి వరద బాధితులకు సహాయం చేశారు. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, కాకినాడ అనే వ్యాపార సంస్థను ప్రభాకర్ రావు నడుపుతున్నాడు.
- విద్య, ఆరోగ్యం మహిళా సాధికారత, రక్తదాన శిబిరాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ, Dr.DNR భవన్ ట్రస్ట్; Dr.DNR భవన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కు అనుబంధంగా ఉంది), ఇది మండపేటలోని పేద ప్రజలకు ఉచిత కంప్యూటర్ విద్యను అందిస్తుంది.
రాజకీయ జీవితం[మార్చు]
- కామన ప్రభాకర్ రావు, 1978లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించారు ఇందిరా గాంధీ, తో కలిసి జనతా పార్టీ ప్రభుత్వంపై విచారణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
- 1993-94 వరకు కామన ప్రభాకర్ రావు ఆలమూరు నియోజకవర్గ విద్యుత్ సలహా కమిటీ చైర్మన్ గా పనిచేశాడు.
- తూర్పుగోదావరి జిల్లా 1993-94 వరకు కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా పనిచేశాడు.
- 1994-99 మండల పరిషత్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడుగా పనిచేశాడు.
- 1994-99 ఏడిత నుండి ఎంపీటీసీ సభ్యుడుగా పనిచేశాడు.
- తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ 1993-98 జిల్లా కన్వీనర్ గా పని చేశాడు
- 1986-89 తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాడు.
- 1990-94 తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- 2000-2007 వరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు.
- 2003 నుంచి 206 వరకు, తూర్పుగోదావరి జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు,
- 2002-2013 వరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి సభ్యుడిగా పని చేశాడు.
- 2003-2004 పిఠాపురం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పనిచేశాడు.
- 2006లో జరిగిన పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్ .
- 2006 జనవరి నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశానికి రిసెప్షన్ కమిటీ సభ్యుడుగా పనిచేశాడు
- 2009 ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర విభజనకు అనుకూలం[మార్చు]
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఎంపీలను సస్పెండ్ చేస్తూ ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీసీ కార్యదర్శి కామన ప్రభాకరరావు ఓ ప్రకటనలో తెలిపారు. [2]
- ↑ "'Common man' gets Congress ticket - ANDHRA PRADESH". The Hindu. 2014-04-15. Retrieved 2016-06-18.
- ↑ "'A wrong decision' - ANDHRA PRADESH". The Hindu. 2014-02-12. Retrieved 2016-06-18.