Jump to content

కామ్య పంజాబీ

వికీపీడియా నుండి
కామ్య పంజాబీ
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ 2018లో కామ్య పంజాబీ
జననం (1979-08-13) 1979 ఆగస్టు 13 (వయసు 45)
వృత్తినటి, రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీ
  • బానూ మైన్ తేరీ దుల్హన్
  • శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కి
  • మర్యాద: లేకిన్ కబ్ తక్
  • బిగ్ బాస్ హిందీ సీజన్ 7
రాజకీయ పార్టీఇండియన్ నేషనల్ కాంగ్రెస్
(2021-ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
బంటీ నేగి
(m. 2003; div. 2013)

శలభ్ డాంగ్
(m. 2020)
పిల్లలు2

కామ్య పంజాబీ (జననం 1979 ఆగస్టు 13)ని కామ్య శలభ్ డాంగ్ అని కూడా పిలుస్తారు.[1][2] ఆమె ఒక భారతీయ నటి, రాజకీయ నాయకురాలు. ఆమె అనేక హిందీ టెలివిజన్ రంగానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది.[3][4] ఆమె 2013లో కలర్స్ టీవి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నందుకు కూడా మంచి పేరు తెచ్చుకుంది.[5] ఆమె 2021 అక్టోబరు 27న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[6]

కెరీర్

[మార్చు]

రేత్, అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీ, బానూ మే తేరీ దుల్హన్ వంటి భారతీయ టెలివిజన్ ధారావాహికలలో పంజాబీ నెగటివ్ పాత్రలు పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. పియా కా ఘర్, మర్యాద: లేకిన్ కబ్ తక్, క్యున్ హోతా హై ప్యార్‌లో కూడా పంజాబీ సానుకూల పాత్రలు పోషించింది.

ఆమె సోనీ టీవీలో కామెడీ సర్కస్ కామెడీ షో రెండవ సీజన్‌లో చేసింది. కలర్స్ టీవీలో బిగ్ బాస్ 7లో కూడా ఆమె పాల్గొన్నది.[7]

1997లో, ఆమె మెహందీ మెహందీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అనామిక రూపొందించిన కాలా షా కాలా అనే మ్యూజిక్ వీడియోలో కూడా భాగమైంది.[8] ఆమె బాలీవుడ్ చిత్రాలైన కహో నా ప్యార్ హై, నా తుమ్ జానో నా హమ్, యాదీన్, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ, కోయి మిల్ గయా, తెలుగు సినిమా మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించింది.[9]

2019లో, ఆమె తన తోటి టెలివిజన్ నటి కవితా కౌశిక్‌తో కలిసి పైజామా పార్టీ నాటకంలో తన రంగస్థల అరంగేట్రం చేసింది.[10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కామ్య పంజాబీ 1979 ఆగస్టు 13న జన్మించింది.[1] బిగ్ బాస్ హిందీ సీజన్ 7లో ఉన్న సమయంలో, ఆమె టెలివిజన్ నటి ప్రత్యూష బెనర్జీతో సన్నిహితగా ఉంది.[11][12] ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య తర్వాత, కామ్య పంజాబీ ఆమె జీవితం ఆధారంగా ఒక చిత్రాన్ని విడుదల చేసింది.[13]

కామ్య పంజాబీ 2003లో బంటీ నేగీని వివాహం చేసుకుంది.[14] ఆమె 2009లో తన కుమార్తె ఆరాకు జన్మనిచ్చింది.[15] వారు 2013లో విడాకులు తీసుకున్నారు.[16]

ఆమె టెలివిజన్ నటుడు కరణ్ పటేల్‌తో డేటింగ్ చేసింది కానీ 2015లో విడిపోయారు.[17][18]

ఆమె తన ప్రియుడు, ఢిల్లీకి చెందిన వైద్యుడు శలభ్ డాంగ్‌ని 2020 ఫిబ్రవరి 10న ఆమె తిరిగి వివాహం చేసుకుంది.[19] అయితే, శలభ్‌ డాంగ్ కి అతని మొదటి భార్య ఇషాన్ లకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇక కామ్య పంజాబీ, శలభ్ డాంగ్‌లకు ఆరా, ఇషాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.[20][21][22]

రాజకీయం

[మార్చు]

కామ్య పంజాబీ 2021 అక్టోబరు 27న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[23]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్
2001 స్స్ష్హ్...కోయ్ హై నిషా
2002 కెహతా హై దిల్ కరిష్మా సింగ్
క్యున్ హోతా హై ప్యార్ర్ రమ్య
పియా కా ఘర్ సిమ్రాన్
2002–2003 కమ్మల్ విధిశా
2003–2006 అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీ కిరణ్
2004 సీఐడి ఆమెనే
2004-2006 రెత్ నేత్ర
2005-2007 వో రెహ్నే వాలీ మెహ్లోన్ కీ కామ్య పరాశర్
2006–2009 బానూ మెయిన్ తేరీ దుల్హన్ సింధూర ప్రతాప్ సింగ్
2007 అంబర్ ధార దీపిక
2008 కామెడీ సర్కస్ పోటీదారు [24]
2009 జీత్ జాయేంగే హమ్ దేవయాని
నాగిన్ - వాదోన్ కి అగ్నిపరిక్షా నాగిన్
2010–2012 మర్యాద: లేకిన్ కబ్ తక్? ఉత్తర జఖర్
2012 పర్వర్రిష్ – కుచ్ ఖట్టీ కుచ్ మీతీ మందిరా భగత్
2013 దో దిల్ ఏక్ జాన్ దయా మయి
నౌతంకి: ది కామెడీ థియేటర్ పోటీదారు
బిగ్ బాస్ 7 పోటీదారు (తొలగించబడిన రోజు 91) 8వ స్థానం[25]
2014 బెయింటెహా జరీనా ఖురేషి
ఎఫ్.ఐ.ఆర్. భాను మిత్ర
ది అడ్వెంచర్స్ ఆఫ్ హతీమ్ రెహనా
బిగ్ బాస్ 8 అతిథి
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ 1 పోటీదారు
2015 డోలి అర్మానో కీ దామిని సిన్హా
కిల్లర్ కరోకే అట్కా తో లట్కా పోటీదారు
ఆనత్ శ్వేత
బిగ్ బాస్ 9 అతిథి
2016 డర్ సబ్కో లగ్తా హై విద్యా పరిహార్ ఎపిసోడ్ 22[26]
బాక్స్ క్రికెట్ లీగ్ 2 పోటీదారు
కామెడీ నైట్స్ బచావో అతిథి
2016–2021 శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీ ప్రీతో కౌర్ సింగ్
2016 బిగ్ బాస్ 10 అతిథి
2017 తు ఆష్కీ
2018 బిగ్ బాస్ 12
2019 కిచెన్ ఛాంపియన్
బిగ్ బాస్ 13
2020 బిగ్ బాస్ 14
2021 బిగ్ బాస్ 15 [27]
2022 సంజోగ్ గౌరీ [28]
2023 రాజ్ మహల్ - డాకిని కా రహస్య మంటలేఖ
తేరే ఇష్క్ మే ఘయల్ నందిని
2023-ప్రస్తుతం నీర్జా - ఏక్ నయీ పెహచాన్ దిదున్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Happy Birthday Kamya Punjabi: 5 times the actor ruled television". Indian Express. 13 August 2017. Archived from the original on 9 December 2019. Retrieved 13 September 2019.
  2. "Kamya Panjabi joins Congress, calls it a 'beautiful start to my new beginning'". The Indian Express (in ఇంగ్లీష్). 2021-10-28. Retrieved 2024-02-01.
  3. "Kamya Panjabi goes bare back to support Ekta Kapoor for her film Lipstick Under My Burkha". The Times of India (in ఇంగ్లీష్). 10 July 2017. Archived from the original on 6 March 2021. Retrieved 1 April 2021.
  4. Mazumder, Ranjib (28 January 2009). "Kamya Panjabi does a balancing act". DNA India (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2021. Retrieved 1 April 2021.
  5. "I prepared myself to prove that women can tough it out: Kamya Panjabi". Hindustan Times (in ఇంగ్లీష్). 16 December 2013. Archived from the original on 9 December 2019. Retrieved 13 September 2019.
  6. "Actor Kamya Panjabi joins Congress, says 'looking forward to serving nation'". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-10-27. Retrieved 2024-02-01.
  7. IANS (March 26, 2023). "Kamya Panjabi: I Am Not Open To Any Dance Reality Shows". Outlook India.
  8. "Kamya PanjabiPhotos - Stars-TV-The Times of India Photogallery". photogallery.indiatimes.com. Retrieved 2024-02-02.
  9. "Kamya Panjabi". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-02.
  10. Vajpayee, Soumya (16 May 2019). "TV actresses Kavita Kaushik and Kamya Punjabi debut with a play on women's empowerment". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 March 2021. Retrieved 24 February 2021.
  11. "Kamya Punjabi posts heartwarming video for late friend Pratyusha Banerjee on her birth anniversary". India Today. 10 August 2018. Archived from the original on 11 August 2018. Retrieved 13 September 2019.
  12. "Shooting a suicide scene made Kamya Punjabi emotional, remember Pratyusha Banerjee". The Indian Express (in Indian English). 21 September 2016. Archived from the original on 7 March 2021. Retrieved 13 September 2019.
  13. "Mumbai court issues notices to Kamya Punjabi for releasing film starring Pratyusha Banerjee. She join congress party in october 2021 in mumbai". Hindustan Times (in ఇంగ్లీష్). 5 April 2017. Archived from the original on 5 December 2020. Retrieved 13 September 2019.
  14. "Trouble in Kamya Punjabi's marriage again?". The Times of India. 17 May 2013. Archived from the original on 9 December 2021. Retrieved 13 September 2019.
  15. "Kamya Panjabi and husband Shalabh Dang wish daughter Aara on her birthday, share heart-touching posts - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 6 October 2020. Archived from the original on 1 November 2021. Retrieved 2021-11-01.
  16. "Urvashi Dholakia to Kamya Punjabi, TV's single moms who essayed the roles of a father in their child's life". The Times of India (in ఇంగ్లీష్). 16 June 2019. Archived from the original on 17 June 2019. Retrieved 13 September 2019.
  17. "Karan Patel and Kamya break up: What went wrong? - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). 2 June 2015. Archived from the original on 6 March 2021. Retrieved 13 September 2019.
  18. "Ex Kamya Punjabi slams Karan Patel; wife Ankita stands by him - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 19 February 2016. Archived from the original on 5 March 2021. Retrieved 13 September 2019.
  19. "Kamya Punjabi to get married next year". India Today (in ఇంగ్లీష్). 9 September 2019. Archived from the original on 13 September 2019. Retrieved 2021-11-01.
  20. "Kamya Punjabi to tie the knot with Shalabh Dang". The Indian Express (in Indian English). 12 September 2019. Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.
  21. "Kamya Punjabi to get married next year". India Today (in ఇంగ్లీష్). 12 September 2019. Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.
  22. "Unseen pictures from Shakti actress Kamya Panjabi and Shalabh Dang's fun-filled wedding". The Times of India (in ఇంగ్లీష్). 10 February 2020. Archived from the original on 13 February 2020. Retrieved 11 February 2020.
  23. "Television actor Kamya Punjabi joins Congress in Mumbai" (in ఇంగ్లీష్). 27 October 2021. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  24. "Last laugh". Hindustan Times (in ఇంగ్లీష్). 6 August 2008. Archived from the original on 9 December 2021. Retrieved 13 September 2019.
  25. "I have not played any game on Bigg Boss: Kamya Punjabi". Hindustan Times (in ఇంగ్లీష్). 15 December 2013. Archived from the original on 7 March 2021. Retrieved 13 September 2019.
  26. "Kamya Punjabi to star in 'Darr Sabko Lagta Hai'". TOI. 8 January 2016. Archived from the original on 9 January 2016. Retrieved 9 January 2016.
  27. "Bigg Boss 15: Kamya Panjabi questions Ieshaan Sehgaal's demeaning comment on the number of boys in Miesha Iyer's life; watch - Times of India". The Times of India (in ఇంగ్లీష్). November 2021. Archived from the original on 1 November 2021. Retrieved 2021-11-01.
  28. Cyril, Grace (July 14, 2022). "Shefali Sharma, Kamya Punjabi to portray two distinct mothers in upcoming show Sanjog". India Today. Archived from the original on 17 July 2022. Retrieved July 23, 2022.