Jump to content

కాయిల్ పంపు

వికీపీడియా నుండి
కాయిల్ పంపు నమూనా

కాయిల్ పంపు అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది కాయిల్ (చుట్ట) ఆకారంలో ట్యూబ్ (గొట్టం) ను కలిగి ఉంటుంది, ఇది ఇరుసుతో పాటుగా తిరుగునట్లు ఇరుసుకు అమర్చబడి ఉంటుంది. ఈ కాయిల్ పంపును ఇంజను శక్తితో లేదా జంతువు శక్తితో పనిచేయిస్తారు. ఇరుసు వేగంగా తిరిగినపుడు కాయిల్ పంపు కూడా వేగంగా తిరిగి సమర్ధంగా పనిచేస్తుంది. ఇది తిరుగుతున్నప్పుడు ట్యూబ్ ద్వారా నీటిని తీసుకొని నీటిని పైకి చేర్చేందుకు అమర్చబడిన మరొక పైపుకి పంపిస్తుంది, ఈ పైపులో నుంచి నీరు పైకి వస్తుంది.

సాధారణంగా నీటిపారుదల ప్రయోజనాల కోసం అనేక "తక్కువ లిఫ్ట్ పంపు"ల వలె ఈ కాయిల్ పంపును ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పటికి ఆసియాలోని రైతులు ఉపయోగిస్తున్నారు.

ప్రయోజనాలు

[మార్చు]

కాయిల్ పంపు ఆర్కిమెడెస్ స్క్రూకు ప్రత్యామ్నాయంగా నిర్మించబడింది. ఆర్కిమెడెస్ స్క్రూ వలె కాక దీనిని అడ్డంగా కూడా నడిపించవచ్చు, ఆర్కిమెడెన్ స్క్రూ అయితే 30° వంగి ఉంటుంది. సరైన రొటేటింగ్ సీల్ బిగించి ఉన్న కాయిల్ పంపు, ఎక్కువ ఎత్తుకు నీటిని సరఫరా చేయగలదు, సాధారణంగా 5 నుంచి 10 మీటర్ల పైకి నీటిని పంపించగలదు. ఇతర సూత్రాలతో నడుపబడుతున్న కొత్త పంపులు ఉద్భవిస్తున్నప్పటికి, కొన్ని ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఒక ముఖ్యమైన సాధనంగా కాయిల్ పంపు మిగిలిపోయింది, దీనిని నిర్మించడం, మరమ్మతు చేయడం సులభం, అంతేకాక దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ పంపు నిర్మించేందుకు అవసరమైన అన్ని భాగాలు మెటల్ గా స్థానిక వనరుల నుండే లభించగలదు. దీని రూపం సులభంగా చెయ్యవచ్చు.

ప్రతికూలతలు

[మార్చు]

ముందు చెప్పినట్లుగా, ఈ పంపు కేవలం చిన్న ఎత్తు మీదకే నీటిని పంపించగలదు. డ్రైనేజీ, సాగునీటిపారుదల వ్యవస్థలలో వచ్చిన అనేక ఇతర పంపింగ్ అనువర్తనాల వలన లేదా నీరు ఎక్కువ లోతు నుండి తోడవలసిన పరిస్థితుల వలన ఈ పంపులు తగినవిగా లేవు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మర పంపు - ఆర్కిమెడిస్ స్క్రూ