కారం రవీందర్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారం రవీందర్‌రెడ్డి
కారం రవీందర్‌రెడ్డి


పదవీ కాలం
19 మే 2021 – 11 డిసెంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
జీవిత భాగస్వామి జ్యోతి
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం హైదరాబాద్
వృత్తి ప్రభుత్వ ఉద్యోగి, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు

కారం రవీందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్‌జీవో) అధ్యక్షుడిగాపని చేశాడు. రవీందర్‌రెడ్డి 2021, మే 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈ పదవిలో ఆయన ఆరేళ్లపాటు కొనసాగనున్నాడు.[1][2]

తెలంగాణ రాష్ట్రంలో 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ముగ్గురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.[3]

జననం[మార్చు]

కారం రవీందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, వేలేర్లో కారం పాపిరెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించాడు.[4]

ఉద్యోగ ప్రస్థానం[మార్చు]

కారం రవీందర్‌రెడ్డి 1984లో వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం, కమలాపూర్‌ ఏపీ రేయాన్స్‌లో టైపిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆయన 1985 నుంచి వరంగల్‌ కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1987 మే నెలలో డీఎస్సీ ద్వారా రెవెన్యూశాఖకు ఎంపికయ్యాడు. రవీందర్‌ రెడ్డి 2007లో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్నాడు. ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో డిప్యూటీ తహసీల్దార్‌లకు గెజిటెడ్‌ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో నాన్‌ గెజిటెడ్‌ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న రవీందర్‌రెడ్డి డీటీ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా రివర్షన్‌ తీసుకున్నాడు. రవీందర్‌రెడ్డి వరంగల్‌ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా 2020 ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందాడు. [5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (20 May 2021). "టీఎస్‌పీఎస్సీకి కొత్త కళ". Sakshi. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  2. The Indian Express (19 May 2021). "Dr. B Janardhan Reddy appointed TSPSC Chairman". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  3. Eenadu (11 January 2024). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  4. Andhrajyothy (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా కారం రవీందర్‌రెడ్డి". www.andhrajyothy.com. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  5. Sakshi (31 August 2020). "ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా." Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.