కార్బ్యురేటర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెనిడిక్స్‌- టెక్నికో (స్టామ్‌బర్గ్‌) సింగిల్‌ బ్యారల్‌ కార్బ్యురేటర్‌ మోడల్‌ బిఎక్స్‌యువి-3 వర్గీకరణతో పాటు

కంబషన్‌ ఇంజన్లలో గాలి మరియు ఇంధనాన్ని కలపడానికి ఉపయోగించే పరికరాన్ని కార్బ్యురేటర్‌ లేదా కార్బ్యురెట్టార్‌ అని పిలుస్తారు. 1885[1]కు ముందు కార్ల్‌ బెంజ్‌ దీన్ని ఆవిష్కరించాడు. దీనికి 1886లో[2] పేటెంట్‌ లభించింది. దీన్ని వాడుక భాషలో కార్బ్‌ అని పిలుస్తారు.

కార్బురేటర్‌ అనే పదం కార్బురే అనే ఫ్రెంచ్‌ పదం నుంచి వచ్చింది. కార్బురే అనగా కార్బైడ్‌ అని అర్థం.[3] కార్బురర్‌ అనగా కార్బన్‌తో కలపపడం అని అర్థం. ఇంధన రసాయన శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే, బాష్పశీల స్వభావం కలిగిన అస్థిర హైడ్రోకార్బన్‌తో కలపడం ద్వారా ఇంధనం యొక్క కార్బన్‌ పరిమాణాన్ని (తద్వారా శక్తిని) పెంచడం అని చెప్పవచ్చు.

చరిత్ర మరియు అభివృద్ధి[మార్చు]

కార్బ్యురేటర్‌ను 1885లో కార్ల్‌బెంజ్‌ ఆవిష్కరించాడు. (బెంజ్‌ అండ్‌కో వ్యవస్థాపకుడు, తరువాత (1927) లో దీన్ని గోట్‌లిబ్‌ డైమర్‌ యొక్క డైమ్లర్‌ మోటారెన్‌ ఏజీలో విలీనం చేసాడు. ఈ రెండు కలిసి డైమర్‌ బెంజ్‌ ఏజీ గా ఏర్పడ్డాయి. ప్రఖ్యాత మెర్సిడెస్‌-బెంజ్‌ ద్వారా ఇది చిరపరిచితమైనదే). 1886లో దీనికి పేటెంట్‌ పొందాడు. హంగేరీకి చెందిన జోనస్‌ స్లోంకా మరియు డోనట్‌ బెంకీలు 1893లో మరింత అభివృద్ధి పరిచారు.[4] ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన ఫెడ్రిక్‌ విలియమ్‌ లాంకెస్టర్ ‌కార్లలో విక్‌ కార్బ్యురేటర్లను అమర్చడం పై ప్రయోగాలు నిర్వహించాడు. 1896లో ఫెడ్రిక్‌ మరియు ఆయన సోదరుడు ఇద్దరూ కలిసి గ్యాసోలిన్‌ ఆధారంగా నడిచే సింగిల్‌ సిలెండర్‌ ఇంటర్నల్‌ కంబర్షన్‌ ఇంజిన్‌తో పాటు చైన్‌డ్రైవ్‌ కలిగిన కారును ఇంగ్లాండ్‌లో రూపొందించారు.5 hp (3.7 kW) దాని యొక్క సామర్థ్యం, పనితీరుపై వారు సంతృప్తి చెందలేదు. దీంతో ఆ తరువాత సంవత్సరం ఒకదానికొకటి ఎదురుగా ఉండే రెండు సిలెండర్లతో పాటు తమ కొత్త విక్‌ కార్బ్యురేటర్‌ డిజైన్‌ను ఉపయోగించారు. 1900వ సంవత్సరంలో ఇది విజయవంతంగా తన టూర్‌ను పూర్తి చేసుకుంది.1,000 mi (1,600 km) ఈ విధంగా కార్బ్యురేటర్లను అనుసంధానించడం అనేది ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ పురోగతికి ఒక కీలకమైన మెట్టుగా చెప్పవచ్చు.

ఫ్యూయల్‌ ఇంజక్షన్ విధానం ఆమోదయోగ్యమైన కాలంలో అంటే, 1980 చివర వరకు కూడా ఆటోమొబైల్‌ పరిశ్రమలో అమెరికాలో తయారైన గ్యాసోలిన్‌ ఆధారిత ఇంజిన్లలో కార్బ్యురేటర్లను ఇంధన సరఫరా విధానంలో ఉపయోగించేవారు. అమెరికన్‌ మార్కెట్‌లో చివరి కార్బ్యురేటెడ్‌ కార్లు ఇవి

 • ౧౯౯౦ (సామాన్య ప్రజానీకం కోసం) : ఓల్డ్స్‌ మొబైల్‌ కస్టమ్స్‌ క్రూసియర్‌, బ్రూక్‌ఎస్టేట్‌ వ్యాగన మరియు సబరు జెస్టీ
 • 1991 (పోలీసు) : ఇంజిన్‌తో కూడిన ఫోర్డ్‌ క్రౌన్‌ విక్టోరియా పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌
 • 1991 (ఎస్‌యువి) : జీప్‌ గ్రాండ్‌ వ్యాగనార్‌
 • 1994 (లైట్‌ ట్రక్‌) : ఇసూజీ[5]


2006 చివర వరకు కూడా కొన్ని లెడా కార్లలో కార్బ్యురేటర్లను ఉపయోగించారు. తక్కువ ధరకు లభించడం, ఆక్సిలేటర్‌కు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉండటం, త్వరగా ఇంజెక్షన్‌ చేసే విధంగా ఉండటంతో ఇప్పటికీ చాలా మోటార్‌సైకిళ్లలో కార్బ్యురేటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే 2005 నాటికి ఫ్యూయల్‌ ఇంజక్షన్‌తో కొత్త మోడళ్లు చాలా మార్కెట్లో ప్రవేశపెట్టారు. చిన్న ఇంజిన్లు, పాత వాహనాలు లేదా స్పెషలైజ్డ్‌ వాహనాలు, కార్‌ రేసింగ్‌ వంటి వాటిలో ఇప్పటికీ మనం కార్బ్యురేటర్లను చూడవచ్చు. ఇలాంటి వాటిలో కార్బ్యురేటర్లు ఫుల్‌లోడ్‌ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని విడుదల చేయడం ద్వారా రేసింగ్‌లో పాల్గొనడానికి వీలుగా ఉంటుంది.

మూల సూత్రాలు[మార్చు]

వేగంగా గాలి కదిలితే, దాని స్థిరపీడనం తగ్గుతుంది, తద్వారా గతిశీల ఒత్తిడి పెరుగుతుంది. అన్న బెర్నోలీసూత్రం ఆధారంగా కార్బ్యురేటర్‌ పనిచేస్తుంది. యాక్సిలరేటర్ అనుసంధానం నేరుగా ఇంధన ప్రవాహనాన్ని నియంత్రించదు. దానికి బదులుగా కార్బ్యురేటర్‌లో ఉండే వివిధ విభాగాలు, గాలిని నేరుగా ఇంజిన్‌లోకి పంపేవిధంగా ఉత్తేజపరుస్తుంది. ఈ ప్రవాహం యొక్క వేగం, తత్ఫలితంగా ఒత్తిడి రెండు కలిసి ఎంతమొత్తంలో ఇంధనాన్ని ఎయిర్‌స్టీమ్‌లో ప్రవేశ పెట్టాలన్న విషయాన్ని నిర్ధారిస్తాయి.

కార్బ్యురేటర్లను పిస్టన్‌ ఇంజన్లతో కూడిన ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో ఉపయోగించినప్పుడు, ఎయిర్‌క్రాఫ్ట్‌ తలకిందులుగా ప్రయాణించేటప్పుడు ఇంధన కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఆ తరువాత తొలిదశ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ విధానాన్ని ఉపయోగించే వాటిని ప్రెజర్‌ కార్బ్యురేటర్లు అని అంటారు.

చాలా కార్బ్యురేటెడ్‌ ( ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌కు వ్యతిరేకంగా) ఇంజిన్లలో ఒక్క కార్బ్యురేటర్‌ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని ఇంజిన్లలో (మోటార్‌సైకిల్‌ ఇంజిన్లు) బహుళ కార్బ్యురేటర్లు ఉంటాయి. పాత ఇంజిన్లు ఆధునీకరించిన కార్బ్యురేటర్లను ఉపయోగిస్తాయి. వీటిలో గాలి కార్బ్యురేటర్‌ యొక్క దిగువ భాగం నుంచి ప్రవేశించి, పై నుంచి బయటకు పోతుంది. దీని వల్ల ఇంజిన్‌ ఎప్పటికీ కారదు. మనిఫోల్డ్‌లో పోకుండా కార్బ్యురేటర్‌ నుంచి బయటకు కారుతుంది. ఇది ఆయిల్‌ బాత్‌ ఎయిర్‌క్లీనర్‌ను ఉపయోగిస్తుంది. కార్బ్యురేటర్‌ కింద ఉండే మెష్‌ ఎలిమెంట్‌ దిగువ ఉండే ఆయిల్‌పూల్‌ నుంచి ఆయిల్‌ కవర్‌ మెష్‌ ద్వారా గాలిని తీసుకుంటుంది. పేపర్‌ ఎయిర్‌ ఫిల్టర్లు లేని సమయంలో ఇది ఎంతో సమర్థమైన వ్యవస్థగా భావించే వారు.

1930 ప్రారంభం వరకు కూడా అమెరికాలో ఆటోమొటివ్‌ వాడకాల్లో డౌన్‌డ్రాఫ్ట్‌ కార్బ్యురేటర్లును విస్తారంగా ఉపయోగించేవారు. డౌన్‌డ్రాఫ్ట్‌లో ఇంజిన్‌బే ప్రాంతంలో ఖాళీ ప్రదేశం తక్కువగా ఉండటంతో యూరోప్‌లో డౌన్‌డ్రాఫ్ట్‌ స్థానాన్ని సైడ్‌డ్రాఫ్ట్‌ కార్బ్యురేటర్లతో భర్తీ చేశారు. అదే విధంగా ఎస్‌యు టైప్‌ కార్బ్యురేటర్ల్ల (వేరే ఉత్పత్తిదారులు రూపొందించిన ఇలా తరహాలోఉండేవి) వాడకం పెరిగింది. ఇప్పటికీ ప్రొపెల్లర్‌ ఆధారంగా నడిచే చిన్న చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆధునీకరించిన కార్బ్యురేటర్‌ మోడల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే అత్యాధునిక డిజైన్‌లైన కాన్‌స్టాంట్‌ వెలసిటీ (CV) బింగ్‌ కార్బ్యురేటర్లను అధిక సంఖ్యలో ఉపయోగిస్తున్నారు.[ఉల్లేఖన అవసరం]

అవుట్‌బోర్డ్‌ మోటార్‌ కార్బ్యురేటర్లు ఒకరకంగా సైడ్‌డ్రాఫ్ట్‌ కార్బ్యురేటర్లే. ఇవి ఒకదాని పై మరొకటి ఉండి సిలెండర్‌ బ్లాక్‌ పై నిట్టనిలువుగా ఉండే సిలెండర్‌కు అవసరమైన ఇంధనాన్ని అందిస్తాయి.

1979 ఎవిన్‌రూడ్‌ టైప్‌1 మెరైన్‌ సైడ్‌డ్రాఫ్ట్‌ కార్బ్యురేటర్‌

క్రియ[మార్చు]

 • ఫిక్స్‌డ్‌ వెంట్యూరా : వెంట్యూరిలో గాలి వేగం ఇంధన సరఫరాకు అనుగుణంగా మారుతుంది. ఈ రకమైన నిర్మాణం చాలా అమెరికన్‌, జపాన్‌ కార్లలో డౌన్‌డ్రాఫ్ట్‌ కార్బ్యురేటర్ల రూపంలో మనం గమనించవచ్చు.
 • చలనశీల వెంట్యూరా : నిరంతర బత్తిడి ఉండే కార్బ్యురేటర్లలో ఫ్యూయల్‌ జెట్‌ ఓపెనింగ్‌ స్లైడ్‌ ద్వారా మార్చబడుతుంది (అదే సమయంలో గాలి ప్రయాణించడాన్ని కూడా మారుస్తుంది) ఫ్యూయల్‌ జెట్‌ లోపల మునిగి ఉండే ట్యాప్‌రాడ్‌ నీడిల్‌ను అనుసంధానించిన వ్యాక్యూమ్‌ ఆధారిత పిస్టన్‌ ఈ పనిని చేస్తుంది. దీని యొక్క సరళరూపం సాధారణంగా చిన్న మోటార్‌సైకిళ్లు, డార్ట్‌ బైక్స్‌లో గమనించవచ్చు. ఇందులో స్లైడ్‌, నీడిల్‌ రెండు కూడా ప్రత్యక్షంగా థొరెట్‌ పొజిషన్‌ నుంచి నియంత్రించబడతాయి. డిజైన్‌లో ఉండే అవరోధాలను అధిగమించడానికి ఈ తరహా కార్బ్యురేటర్లను యాక్సిలేటర్‌ పంప్‌లతోపాటు అనుసంధానం చేస్తారు. సైడ్‌ డ్రాఫ్ట్‌ ఎస్‌యు కార్బ్యురేటర్‌ మరియు హిటాచీ, జెన్నిత్‌`స్ట్రోమ్‌బర్గ్‌ మరియు ఇతర తయారీదారులు తయారుచేసే ఇదే తరహా మోడల్స్‌ను చలనశీల వెంట్యూరాకు ఉదాహరణగా చెప్పువచ్చు. ఎస్‌యు, జెన్నిత్‌- స్ట్రోమ్‌బర్గ్‌ కంపెనీలు యుకే కేంద్రంగా పనిచేస్తుండటంతో యుకే కార్‌మార్కెట్‌లో ఈ కార్బ్యురేటర్ల ఆధిపత్యం సాధించడానికి కారణంగా చెప్పవచ్చు. ఈ తరహా కార్బ్యురేటర్లను వోల్వో మరియు ఇతర యూకేయేతర తయారీ దారులు విరివిగా ఉపయోగించేవారు. ఇదే తరహాలో ఉండే ఇతర మోడల్స్‌ను కొన్ని యూరోపియన్‌, మరికొన్ని జపాన్‌ ఆటోమొబైల్స్‌లో ఉపయోగించేవారు. ఈ కార్బ్యురేటర్లను కాన్‌స్టాంట్‌ వెలాసిటి లేదా కాన్‌స్టాంట్‌ వ్యాక్యూమ్‌ కార్బ్యురేటర్లు అని కూడా అంటారు. ఇందులో ఒక ఆసక్తికర మోడల్‌ ఫోర్డ్‌ VV (వేరియబుల్‌ వెంట్యూరి) కార్బ్యురేటర్‌, ఇది ఫిక్స్‌డ్‌ వెంట్యూరీ కార్బ్యురేటర్‌ అని చెప్పవచ్చు. ఒకవేపు ఉండే వెంట్యూరీ మడత బందులా ఉండి తిరుగుతూ తక్కువ ఆర్‌పీఎం వద్ద నారో థోట్‌ను ఎక్కువ ఆర్‌పీఎం వద్ద ఎక్కువ థోట్‌ను ఇస్తుంది. వివిధ రకాల వేగాల వద్ద గాలి ప్రవాహం సక్రమంగా ఉండేవిధంగా, ఇంధనం, గాలి చక్కగా కలిసే విధంగా ఈ డిజైన్‌ను రూపొందించారు. అయితే వివి కార్బ్యురేటర్లు సర్వీస్‌ విషయంలో సమస్యలు ఉన్న మోడల్‌గా రుజువైంది.
అత్యధిక సామర్థ్యం ఉన్న నాలుగు బ్యారల్‌ కార్బ్యురేటర్‌

ఇంజిన్‌ నూటికి నూరుశాతం పనిచేస్తున్న సమయంలో కార్బ్యురేటర్‌ ఇలా ఉంటుంది:

 • ఇంజిన్‌లో గాలి ప్రవాహాన్ని లెక్కిస్తుంది
 • ఇంధనం, గాలి యొక్క నిష్పత్తి సక్రమంగా ఉండే విధంగా ఇంధనాన్ని విడుదల చేస్తుంది. (ఉష్ణోగ్రత వంటి కారకాలను సరిచేయడం ద్వారా)
 • ఇంధనం, గాలిని సక్రమంగా, సరైన నిష్పత్తిలో కలుపుతుంది.

ఒకవేళ గాలి మరియు గ్యాసోలిన్‌ (పెట్రోల్‌) ఆదర్శవంతమైనప్పుడు ఈ పని ఎంతో సులువుగా జరుగుతుంది. పదార్థాల యొక్క స్నిగ్థత, ఫ్లూయిడ్‌డ్రాగ్‌, జడత్వం కారణంగా ఇది ఈ ఆదర్శ లక్షణం నుంచి క్రమేపీ దూరంగా జరిగిపోవడంతో అతి ఎక్కువ లేదా అతి తక్కువ వేగాల వద్ద వీటిని నియంత్రించడం చాలా సంక్షిష్టమైన అంశమవుతుంది. వివిధ రకాల ఉష్ణోగ్రతలు, వాతావరణ పీడనాలు, ఇంజిన్‌ యొక్క వివిధ రకాల వేగాలు, లోడ్‌లు మరియు అపకేంద్ర బలాల వద్ద కార్బ్యురేటర్‌ సరైన ఇంధన, గాలి సమ్మెళనాలను అందించాల్సి ఉంటుంది.

 • కోల్డ్‌ స్టార్ట్‌
 • హాట్‌ స్టార్‌
 • నిశ్చలంగా లేక నెమ్మదిగా నడవడం
 • యాక్సిలరేషన్‌
 • హైస్పీడ్‌/ఎక్కువ సామర్థ్యం
 • థొరెటల్‌ పూర్తిగా తెరుచుకోనప్పుడు (తక్కువ లోడ్‌ ఉన్నప్పుడు)

వీటికి అదనంగా ఆధునిక కార్బ్యురేటర్లు తక్కువ పరిమాణంలో ఉద్గారాలను వెలువరించే విధంగా ఉండాలి.

ఈ అన్ని పరిస్థితుల్లో సక్రమంగా పనిచేయడానికి చాలా కార్బ్యురేటర్లలో సంక్షిష్టమైన యంత్ర నిర్మాణం ఉంటుంది. వీటిని సర్యూట్స్‌ అని అంటారు. ఇవి వివిధ రకాల ఆపరేషన్‌ మోడ్స్‌లో పనిచేయడానికి ఉపయోగపడతాయి.

ప్రాథమిక అంశాలు[మార్చు]

కార్బ్యురేటర్‌ యొక్క క్రాస్‌ సెక్షన్‌

సాధారణంగా కార్బ్యురేటర్‌లో పెంజినా లేదా బ్యారెల్‌ అని పిలిచే ఓపెన్‌ పైపులతో నిర్మితమై ఉంటుంది. దీని ద్వారా ఇంజిన్‌ యొక్క ప్రధానవిభాగంలోకి గాలి ప్రవేశిస్తుంది. ఈ పైప్‌లను వెంట్యురా అని అంటారు. ఇవి ముందు సన్నగా ఉండి, తరువాత వెడల్పుగా ఉంటాయి. ఫలితంగా వేగం పెంచినప్పుడు ఈ సన్నని మార్గాల ద్వారా గాలి ప్రవాహం పెరుగుతుంది. వెంట్యూరా కింది భాగంలో బటర్‌ఫ్లై వాల్వ్‌ ఉంటుంది. దీన్ని థోరెటల్‌ వాల్వ్‌ అని అంటారు.చక్రంలా ఉండి తిరుగుతూ ఉండే ఈ వాల్వ్‌ గాలి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుంది. చక్రం బలంగా తిరుగుతూ గాలి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. కార్బ్యురేటర్‌ మెడ భాగం నుంచి బయటకు వెళ్లే గాలిని ఈ వాల్వ్‌ నియంత్రిస్తుంది. ఫలితంగా ఇంజిన్‌ సామర్థ్యం మరియు వేగాన్ని నియంత్రిస్తూ, గాలి మరియు ఇంధనాన్ని సమపాళ్లలో కలుపుతుంది. ఈ థొరాటిక్‌ వాల్వ్‌ను కేబుల్‌ లేదా వివిధ రకాల రాడ్లు లేదా జాయింట్ల ద్వారా మెకానికల్‌గా కలుపుతారు. చాలా తక్కువ సమయాల్లో కార్లలోని యాక్సిలేటర్‌ పెడల్‌ లేదా దాని సమానంగా ఇతర వాహనాలు, పరికరాల్లో ఉపయోగించే వాటికి న్యుమాటిక్‌ లింక్‌ల ద్వారా కలుపుతారు. వెంట్యూరాతో సన్ననిభాగంలో ఉండే చిన్న రంధ్రాల ద్వారాను, ఫుల్‌థోరెట్‌ పనిచేయనప్పుడు పీడనాన్ని తగ్గించగల ప్రాంతాల్లో ఇంధనాన్ని గాలి ప్రవాహంలోకి ప్రవేశపెడతారు. ఇంధన ప్రవాహాన్ని కార్బ్యురేటెడ్‌ ఆర్టిఫైస్‌ ద్వారా సరిచేస్తారు. ఇది ఫ్యూయల్‌ పాత్‌లో ఉండే జెట్‌ మాదిరిగా ఉంటాయి.

ఆఫ్‌ ఐడల్‌ సర్క్యూట్‌[మార్చు]

పూర్తిగా మూసి ఉన్న పరిస్థితిలో ఉన్న థొరెటల్‌ కొంచెం తెరుచుకుంటే, థొరెట్‌ ప్లేట్స్‌ వెనుక ఉన్న అదనపు ఇంధనపు రంధ్రాలు తెరుచుకుంటాయి. థొరెట్‌ ప్లేట్‌ తక్కువ పీడనం ఉన్న ప్రాంతాన్ని సృష్టిస్తుంది, ఫలితంగా గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది మరింత ఇంధనం ప్రవహించడానికి, థొరెట్‌ తెరుచుకోవడం వల్ల ఏర్పడే వ్యాక్యూమ్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా సాధారణంగా థొరెట్‌ సర్యూట్‌ తెరుచుకున్నప్పుడు ఎంత ఇంధనం అయితే సరఫరా అవుతుందో, అంత ఇంధనం ప్రవహించే విధంగా చేస్తుంది.

మొయిన్‌ ఓపెన్‌ థొరెటల్‌ సర్క్యూట్‌[మార్చు]

థొరెటెల్‌ ప్రగతిశీల స్థితిలో తెరుచుకున్నప్పుడు, గాలి ప్రవాహానికి సంబంధించి ఎలాంటి పరిమితులు, హద్దులు లేకపోవడంతో మొత్తం వ్యవస్థ యొక్క వ్యాక్యూమ్‌ తగ్గించబడుతుంది. అదే విధంగా ఐడిల్‌ మరియు ఆఫ్‌ ఐడిల్‌ సర్య్సూట్స్‌లోనూ తగ్గుతుంది. ఈ సందర్భంలో బెర్నోలి నియమం ప్రకారం కార్బ్యురేటర్‌లో ఉండే వెంట్యూరి షేప్‌ పనిచేయడం ప్రారంభిస్తుంది (అనగా చలన వేగం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది). వెంట్యూరీలో గాలి వేగం పెరుగుతుంది. అత్యధిక వేగం వద్ద ఏర్పడ్డ తక్కువ పీడనం వల్ల ఇంధనాన్ని వెంట్యూరా మధ్యలో ఉన్న నాజిల్స్‌ లేదా నాజిల్‌ ద్వారా ఎయిర్‌స్ట్రీమ్‌ పీల్చుకుంటుంది. ఈ ప్రభావాన్ని పెంచడం కోసం కొన్ని సందర్భాల్లో ప్రాథమిక వెంట్యూరాలో లోపల యాక్సిల్‌పైనే అదనంగా బూస్టర్‌ వెంట్యూరిస్‌ను ఏర్పాటు చేస్తారు.

థొరెటెల్‌ మూసుకున్నప్పుడు, సరైన ఇంధన ప్రవాహాన్ని కలిగించలేని తక్కువ పీడనం సృష్టించే స్థాయికి వెంట్యూరిలో గాలి ప్రవాహం తగ్గుతుంది. అప్పుడు ఐడిల్‌ సర్క్యూట్‌ పైన చెప్పిన విధంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.

బెర్నోలీ సిద్ధాంతం ప్రకారం, ద్రవాలకు సంబంధించి పెద్ద ఓపెనింగ్‌ మరియు పెద్ద మొత్తంలో ప్రవాహాలుంటే వేగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో చిన్న మొత్తాలు, తక్కువ వేగంలో (రేమండ్‌ నంబర్) తో ప్రయాణిస్తున్న ద్రవాల్లో స్నిగ్థత కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న మోడల్‌ ఇంజిన్లలో చాలా చిన్న కార్బ్యురేటర్లు ఉపయోగించినప్పుడు ఇంజిన్‌ నిశ్చలంగా ఉన్నప్పుడు లేదా తక్కువ వేగంగా ఉన్నప్పుడు బెర్నోలీ సిద్ధాంతం సమర్థంగా ఉపయోగపడదు. చిన్నమోడల్‌ ఇంజిన్లను జెట్‌తో పోలిస్తే, ప్రవాహ పరిమితులుండటంతో పీడనం తగ్గి గాలి ప్రవాహంలోకి ఇంధనాన్ని పీల్చుకుంటుంది. ఇదే విధంగా నిశ్చిలంగా లేదా తక్కువ వేగంతో నడిచే జెట్స్‌లో ఉండే పెద్ద కార్బ్యురేటర్లను థొరెటెల్‌ వాల్వ్యు పక్కన ఉంచుతారు. బెర్నోలీ సిద్ధాంతం కంటే స్నిగ్థత ప్రభావ కారణంగా పీడనం తగ్గించబడుతుంది. చల్లగా ఉండే ఇంజిన్లను స్టార్ట్‌ చేయడానికి సాధారణంగా ఉపయోగించే పరికరమే చౌక్‌. ఇది ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే పనిచేస్తుంది.

పవర్‌వాల్వ్‌[మార్చు]

ఓపెన్‌ థొరెటల్‌ ఆపరేషన్‌లో ఇంధనం, గాలి ఓ సరైన పాళ్లలో కలవడం వల్ల మరింత ఎక్కువ శక్తి విడుదలవుతుంది, అదే విధంగా ప్రీ ఇగ్నీషన్‌ విస్పోటకాల నుంచి కాపాడుతుంది, ఇంజిన్‌ చల్లగా ఉంచుతుంది. ఇది సాధారణంగా స్పింగ్‌ తరహాలో ఉండే పవర్‌వాల్వ్‌ ఇంజిన్‌ వ్యాక్యూమ్‌ను ఆపేడయం ద్వారా జరపబడుతుంది. థొరెటల్‌ తెరుచుకోవడంతో వ్యాక్యూమ్‌ తగ్గిపోతుంది. స్పింగ్‌ వాల్వ్‌ను తెరుచుకుంటుంది. తద్వారా మరింత ఇంధనం మొయిన్‌ సర్క్యూట్‌లో ప్రవహిస్తుంది. టూ స్ట్రోక్‌ ఇంజిన్లలో పవర్‌వాల్వ్‌ యొక్క పని పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఆన్‌లో ఉంటుంది. ఒక నిర్దిష్ట ఆర్‌పిఎమ్‌ వద్ద ఇది ఆపివేయబడుతుంది. ఎక్కువ ఆర్‌పీఎం వద్ద అంటే ఇంజిన్‌ యొక్క రెవ్‌ రెంజ్‌ దాటిన తరువాత ఇది క్రియాత్మకం అవుతుంది. మిశ్రమం లీన్‌ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ వేగాన్ని సంతులనం చేస్తుంది.

పవర్‌వాల్వ్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడటంతో పాటు కార్బ్యురేటర్‌ మీటరింగ్‌ రాడ్ లేదా స్టెప్‌ అప్‌ రాడ్‌ అనే వ్యవస్థల సాయంతో డిమాండ్‌ ఎక్కువున్నప్పుడు ఇంధన మిశ్రమాన్ని సుసంపన్నం చేస్తుంది. 1950ల్లో కార్టర్‌ కార్బ్యురేటర్‌లో[ఉల్లేఖన అవసరం] ప్రాథమికంగా రెండు వెంట్యూరిస్‌, నాలుగు బ్యారల్‌ కార్బ్యురేటర్‌ ఉన్న వాటిలో ఈ తరహా వ్యవస్థలను ప్రవేశపెట్టారు. స్టెప్‌అప్‌ రాడ్‌లను సాధారణంగా 1-,2 -, లేదా నాలుగు బ్యారల్‌ కార్టర్‌ కార్బ్యురేటర్‌ 1980 వరకు వాటి ఉత్పత్తి నిలిచిపోయేవరకు విస్త్రతంగా ఉపయోగించేవారు. స్టెప్‌అప్‌ రాడ్స్‌ కింద భాగంలో అతికించబడతాయి. ఇవి ప్రధాన మీటరింగ్‌ జెట్‌ వరకు విస్తరించి ఉంటాయి. వీటి పై భాగం వ్యాక్యూమ్‌ పిస్టన్‌కు జతచేయబడతాయి లేదా మెకానికల్‌గా కలపబడుతుంది. థొరెటెల్‌ తెరిచినప్పుడు (మెకానికల్‌ లింకేజ్‌), మొత్తం వ్యవస్థలో వ్యాక్యూమ్‌ తగ్గిపోయినప్పుడు మెయిన్‌జెట్‌లో ఉన్న రాడ్స్‌ పైకి లేపబడతాయి. స్టెప్‌అప్‌రాడ్‌ను మెయిన్‌జెట్‌లో చిన్నది చేయడం ద్వారా, అది ఇంధన ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. స్టెప్‌అప్‌ రాడ్‌ను మెయిన్‌జెట్‌ నుంచి పెంచినప్పుడు మరింత ఇంధనం వాటి గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా ఇంజిన్‌ యొక్క అవసరాలకు అనుగుణంగా ఇంధన అవసరం తీర్చబడుతుంది. కొన్ని నాలుగు బ్యారెల్‌ కార్బ్యురేటర్‌ల్లో మీటరింగ్‌ రాడ్లను కేవలం ప్రాథమికంగా రెండు వెంట్యూరిస్‌లో ఉపయోగిస్తారు. కానీ కొన్ని మాత్రం, రోసెస్టర్‌ క్వాడ్రాజెట్‌ వంటి వాటిలో ప్రాథమిక, సెకండరీ సర్క్యూట్స్‌లోనూ ఉపయోగిస్తారు.

యాక్సిలేటర్‌ పంప్‌[మార్చు]

గాలితో పోలిస్తే గ్యాసోలిన్‌కు ఎక్కువ జడత్వం ఉండటం కారణంగా థొరెట్టల్‌ వేగంగా తెరుచుకుంటే ఇంధన ప్రవాహం కంటే, గాలి ప్రవాహాని కంటే మరింత వేగంగా పెరుగుతుంది. దీని ఫలితంగా తాత్కాలికంగా ఇంజిన్‌లో శుష్క పరిస్థితి ఏర్పడటంతో, యాక్సిలరేషన్‌ పరిస్థితిలో ఇంజిన్‌ తడబడుతుంది. థొరెటల్‌ తెరుచుకున్నప్పుడు జరగాల్సిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది). థొరెటల్‌లో కలపబడిన ఫ్లంగర్‌ లేదా డయాఫామ్‌ తరహాలో ఉండే చిన్న మెకానికల్‌ పంపును అమర్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇది జెట్‌ ద్వారా చిన్న మొత్తలో గ్యాసోలిన్‌ను తీసుకొని కార్బ్యురేటర్‌ థోట్‌లోకి ప్రవేశపెడుతుంది. అదనంగా జొప్పించే ఈ ఇంధనం థొరెటల్‌ టిప్‌ ఇన్‌ వద్ద ఉండే శుష్క పరిస్థితిని అడ్డుకుంటుంది. చాలా వరకు యాక్సిలేటర్‌ పంపులను వాల్యూమ్‌ లేదా కాలవ్యవధి లేదా ఇతర పద్ధతుల్లో ఎడ్జెస్ట్‌ చేస్తారు. పంప్‌లో తిరిగేభాగాల్లో ఉండే సీల్‌ కారణంగా పంప్‌ అవుట్‌పుట్‌ తగ్గించబడుతుంది. ఈ రకంగా యాక్సిలేటర్‌ పంప్‌లో తగ్గించడం వల్ల యాక్సిలేషన్‌ పరిస్థితుల్లో ఇంజిన్‌ తడబడుతుంది. పంప్‌కున్న సీల్‌ను మార్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది.

కోల్డ్‌ స్టార్‌ పరిస్థితుల్లో ఇంజిన్‌ను ఇంధనం ద్వారా ప్రారంభించడానికి యాక్సిలేటర్‌ పంప్‌ను కూడా ఉపయోగిస్తారు. ఎక్కువగా రంజకం వల్ల, ఉదాహరణకు చౌక్‌ను సరిగా ఎడ్జెస్ట్‌ చేయకపోవడం వల్ల ఇంజిన్‌ కారుతుంది . ఎక్కువ మొత్తంలో ఆయిల్‌ ఉండి, మండటానికి అవసరమైనంత గాలి లేనప్పుడు ఇది జరుగుతుంది. ఈ కారణంగా, కొన్ని కార్బ్యురేటర్లలో అన్‌లోడెన్‌ మెకానిజం ఉంటుంది. ఇంజిన్‌ బిగుతుగా ఉన్నప్పుడు యాక్సిలేటర్‌లో థొరెటల్‌ బాగా తెరుచుకొని ఉంటుంది. అప్పుడు అన్‌లోడర్ చౌక్‌ను ఎత్తిపట్టుకొంటుంది. తద్వారా అదనపు గాలి ప్రవేశిస్తుంది. దీంతో ఎక్కువగా ప్రవహించే ఇంధనం నియంత్రించబడి ఇంజిన్‌ స్టార్ట్‌ అవుతుంది.

చౌక్‌[మార్చు]

ఇంజిన్‌ చల్లగా ఉన్నప్పుడు ఇంధన బిందువులు పెద్దగా క్రియాత్మకంగా ఉండవు. ఇవి మనీఫోల్డ్‌లో ఉండే ఇన్‌టేక్‌ గోడల పై సాంద్రీకరించబడతాయి. ఫలితంగా సిలెండర్లలో ఇంధన కొరత ఏర్పడి, ఇంజిన్‌ ప్రారంభం కావడం కష్టమవుతుంది. అందువల్ల ఇంజిన్‌ను ప్రారంభించడానికి, అది వేడెక్కే వరకు నడపడానికి ఇంధనం, గాలి కంటే మరింత విలువైన మిశ్రమం అవసరపడుతుంది. విలువైన మిశ్రమం తేలిగ్గా మండించగలిగినదై ఉండాలి.

అదనపు ఇంధనాన్ని అందించడానికి సాధారణంగా చౌక్‌ ను ఉపయోగిస్తారు. కార్బ్యురేటర్‌ యొక్క ప్రవేశంలో, వెంట్యూరికి ముందు ఉండే ఇది గాలి ప్రవేశాన్ని నిరోధిస్తుంది. ఈ విధంగా నిరోధించడం వల్ల కార్బ్కురేటర్‌ బ్యారెల్‌లో అదనపు వ్యాక్యూమ్‌ సృష్టించబడుతుంది, ఇది ఐడల్‌ మరియు ఆప్‌ ఐడల్‌ సర్క్యూట్‌ల నుంచి మెయిన్‌ మీటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా సప్లిమెంట్‌ వరకు ఇంధనాన్ని నెడుతుంది. ఈ విధంగా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పనిచేసేందుకు అవసరమైన విలువైన మిశ్రమాన్ని అందిస్తుంది.

దీనికి అదనంగా చౌక్‌ పూర్తిగా పనిచేస్తున్నప్పుడు థొరెటల్‌ ప్లేట్‌ పూర్తిగా మూసుకుపోకుండా కాపాడే పరికరాలు లేదా కామ్‌ (ఫాస్ట్‌ ఐడల్‌ కామ్‌ ) కు చౌక్‌ను అనుసంధానం చేస్తారు. ఇది ఎక్కువ వేగంగా వద్ద ఇంజన్‌ను ఐడల్‌ స్థితిలో ఉంచేట్లు చేస్తుంది. ఫాస్ట్‌ ఐడల్‌ ఇంజిన్‌ త్వరగా వేడెక్కేలా చేస్తుంది, చల్లగా ఉన్నప్పుడు ఇన్‌టేక్‌ సిస్టమ్‌లో గాలి ప్రవాహాన్ని పెంచడం ద్వారా మరింత స్థిరంగా ఉండేట్లు చేస్తుంది. ఇది చల్లగా ఉండే ఇంధనాన్ని మరింత ఆటమైజ్‌ చేయడానికి ఉపయోగపడుతుంది.

చాలా కార్బ్యురేటర్‌ కార్లలో చౌక్‌ డ్రైవర్‌ డ్యాష్‌బోర్డ్‌లో ఉండే పుల్‌నాబ్‌కు ఒక కేబుల్‌ ద్వారా కలుపుతారు. కొన్ని కార్బ్యురేటర్‌ కార్లలో ఇంజిన్‌ వేడికి లేదాఎలక్ట్రానిక్‌ హీటింగ్‌ ఎలిమెంట్‌ ద్వారా థర్మోస్టాట్‌లో ఉండే బై మెటాలిక్‌ స్ప్రింగ్‌ ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. ఈ వేడి చౌక్‌లో ఉండే థర్మోస్టాట్‌కు ఇంజిన్‌ కూలెంట్‌ లేదా వేడిగాలి బయటకు పోయే ఎగ్జాస్ట్‌ ద్వారా అందించబడుతుంది. ఇటీవల కాలంలో రూపొందించిన డిజైన్లలో ఇంజిన్‌ వేడిని పరోక్షంగా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో ఉండే సెన్సార్‌ ఇంజిన్‌ వేడిని గుర్తించి, ఎలక్ట్రికల్‌ కరెంట్‌ను వేడి కలిగించే చిన్న భాగంగా మారుస్తుంది.ఇది బైమెటాలిక్‌ స్ప్రింగ్‌ తన టెన్షన్‌ నియంత్రించుకునే విధంగా చేస్తుంది. తద్వారా చౌక్‌ను కంట్రోల్‌ చేస్తుంది. చౌక్‌ అన్‌లోడర్‌ అనే లింకేజ్‌ ఏర్పాటు యాక్సిలేటర్‌ పూర్తిగా నొక్కినప్పుడు చౌక్‌ ఫోర్సెస్‌ ద్వారా స్ప్రింగ్‌ తెరుచుకోకుండా చూసే ఏర్పాటు ఉంటుంది. ఈ ఏర్పాటు ఇంజిన్‌ నుంచి కారడాన్ని నిరోదించడంతో స్టార్‌ అవుతుంది.

కొన్ని కార్బ్యురేటర్లలో చౌక్‌ ఉండదు, కానీ దానికి బదులుగా మిశ్రమాన్ని సుసంపన్నం చేసే సర్క్యూట్‌ లేదా ఎన్‌రిచ్‌నర్‌ ఉంటుంది. దాన్ని సాధారణంగా చిన్న ఇంజిన్లు, ముఖ్యంగా మోటార్‌ సైకిళ్లలోఉపయోగిస్తారు. థొరెటల్‌ వాల్వ్‌ కింద సెకండరీ ఫ్యూయల్‌ సర్క్యూట్‌ను తెరవడం ద్వారా ఎన్‌రిచ్‌నర్‌లు పనిచేస్తాయి. ఈ సర్క్యూట్‌ పూర్తిగా ఐడిల్‌ సర్క్యూట్‌ పనిచేసినట్లే పనిచేస్తుంది. థొరెటల్‌ మూసి ఉన్నప్పుడు అదనపు ఇంధనాన్ని అందిస్తుంటుంది.

సైడ్‌ డ్రాప్ట్‌ స్లైడ్‌ థొరెటల్‌ కార్బ్యురేటర్‌ను ఉపయోగించే బ్రిటిష్‌ క్లాసిక్‌ మోటార్‌సైకిళ్లు కోల్డ్‌ స్టార్‌ పరికరం టిక్క్లర్‌ను ఉపయోగిస్తాయి. ఇది సాధారణంగా స్ప్రింగ్‌ లోడెడ్‌ రాడ్‌. దీనిని నొక్కినప్పుడు ఫ్లోట్‌ను కిందకు నెడుతుంది. తద్వారా అదనపు ఇంధనం ఫ్లోట్‌బౌల్‌ ప్రవహిస్తుంది. ఒకవేళ టిక్క్లర్‌ను ఎక్కువ సమయం నొక్కి పట్టుకుంటే ఇంధనం కార్బ్యురేటర్‌ నుంచి వెలుపల వచ్చి క్రాంక్‌కేస్‌ కింద వరకు ప్రయాణిస్తుంది. అందువల్లనే ఇది ప్రమాదభరితమైనది.

ఇతర భాగాలు[మార్చు]

రెండు సర్క్యూట్‌ల మధ్య జరిగే అన్యోన్య క్రియను వివిధ రకాల మెకానికల్‌ కనెక్షన్లు లేదా గాలిపీడనం కనెక్షన్లు వీటితోపాటు ఉష్ణోగ్రత సునితత్వం, ఎలక్ట్రికల్‌ పరికరాలు వంటివి ప్రభావితం చేస్తాయి. ఇంధన సమర్థత, ఆటోమొబైల్‌ ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలపై ఇవి ప్రభావం చూపుతాయి. వివిధ రకాల ఎయిర్‌బ్లేడ్స్‌ (చాలా సందర్భాల్లో జెట్‌ల తరహాలో కాలిబ్రేట్‌ రేంజ్‌వి ప్రత్యేకంగా ఎంచుకుంటారు) గాలిని ఇంధనం ప్రవహించే భాగాల గుండా ప్రయాణించడానికి తద్వారా ఇంధనాన్ని అందించడం, అది బాష్పీభవనం చెందడాన్ని సుసంపన్నం చేస్తుంది. అదనంగా శుద్ధి చేసేవాటిని కార్బ్యురేటర్‌ మరియు మనిఫోల్డ్‌ భాగాల్లో అమరుస్తారు. ఉదాహరణకు ఎర్లీ ఫ్యూయల్‌ ఎవాపరేటర్‌. ఇది ఇంధనం ఆవిరి కాకుండా కాపాడుతుంది.

ఇంధన సరఫరా[మార్చు]

ఫ్లోట్‌ ఛాంబర్[మార్చు]

హెలీ విసి- ఫ్లో మోడల్‌ 1950 నాటి 1904 కార్బ్యురేటర్లు, పారదర్శికమై న గ్లాసు పాత్రలోని ఉంచిన ఫ్యాక్టరీ పరికరాలు

మిశ్రమాన్ని అందించడం కోసం కార్బ్యురేటర్లలో ఫ్లోట్‌ ఛాంబర్‌ ( బౌల్‌) ఉంటుంది. తక్షణ అవసరాలకు ఇందులో సాధారణ వాతావరణం పీడనాన్ని కలిగిన నాణ్యమైన ఇంధనం ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ను ఫ్యూయల్‌ పంప్‌ ద్వారా ఇంధనంతో నిరంతరం నింపుతూనే ఉంటారు. బౌల్‌లో కచ్చితమైన ఇంధన లెవల్‌ను ఫ్లోట్‌ కంట్రోల్‌ ఇన్‌లెట్‌ వాల్వ్‌ ద్వారా ఉండేట్లు చూస్తారు.సిస్టెరెన్‌ (టాయిలెట్‌ ట్యాంక్‌) లో ఉపయోగించే విధంగా ఇది పనిచేస్తుంది. ఇంధనం వాడుతున్న కొద్దీ ఫ్లోట్‌లో ఇంధనం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఇన్‌లెట్‌ వాల్వ్‌ తెరుచుకుంటుంది, దాని ద్వారా ఇంధనం లోపలి ప్రవేశిస్తుంది. ఫ్లోట్‌‌ బౌల్‌లో ఉపయోగించే ఇంధన పరిమాణాన్ని కొన్ని సమయాల్లో సర్దుబాటు చేయవచ్చు. దీని కోసం సెట్‌స్క్రూ లేదా ఫ్లోట్‌ అనుసంధానం చేయబడ్డ ఆర్మ్‌ను వంచగలిగే బలమైన సాధనం ద్వారా దీన్ని చేపట్టవచ్చు. ఇది ఒకరకంగా సంక్షిష్టమైన ప్రక్రియే. ఫ్లోట్‌ బౌల్‌లోని విండోలోని గీతల ద్వారా సరిగ్గా ఎడ్జెస్ట్‌ అయిందీ లేనిదీ తెలుసుకోవచ్చు లేదా విడగొట్టినప్పుడు ఫ్లోట్‌ కార్బ్యురేటర్‌ నుంచి ఎత్త ఎత్తులో వేలాడుతున్నదో గమనించడం ద్వారాను తెలుసుకోవచ్చు. ఫ్లోట్‌ను వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఫ్లోట్‌ను బోలుగా ఉండే ఆకారంపై ఇత్తడి షీట్లను అతకడం ద్వారానో లేదా ప్లాస్టిక్‌ ద్వారాతో తయారు చేస్తారు. హాలో ఫ్లోట్‌లో చిన్నమొత్తంలో లీకేజ్‌లు ఉంటాయి. ప్లాస్టిక్‌ ఫ్లోట్‌ల్లో క్రమేపీ సూక్ష్మరంధ్రాలు ఏర్పడతాయి. ఫలితంగా అది ఫ్లవన ధర్మాన్ని కోల్పోతుంది. ఈ రెండు సందర్భాల్లో ఫ్లోట్‌ పనిచేసే లక్షణాన్ని కోల్పోతుంది. ఫ్యూయల్‌ లెవల్‌ చాలా అధికంగా ఉన్నప్పటికీ ఇంజిన్‌ సరిగా పనిచేయదు. ఇలాంటి సందర్భాల్లో ఫ్లోట్‌ను మార్చాల్సి వస్తుంది. వాల్వ్‌ తన యొక్క సీట్‌లో కదిలిక ద్వారా ఈ పరిస్థితిని తనకు తానుగా హెచ్చరిస్తుంది. ఫ్లోట్‌ ఓ నిర్ధిష్ట కోణంలో మూసుకు పోవడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా ఇంధనాన్ని పూర్తిగా ఆపివేయడంలో విఫలమవుతుంది. మళ్లీ ఇది ఎక్కువ ఇంధనం ప్రవహించినప్పటికీ ఇంజిన్‌ చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఫ్లోట్‌ బౌల్‌లో ఉన్న ఇంధనం ఆవిరైతే, అది మడ్డి, అవశేషాలు, వార్నిష్‌ను ఫ్లోట్‌బౌల్‌లో విడిచిపెడతాయి. ఇవి ఫ్లోట్‌ ఆపరేషన్స్‌ను అడ్డుకోవడంతో ప్రయాణంలో అవరోధాలు ఏర్పడతాయి. సంవత్సరంలో కొన్ని నెలల్లో మాత్రమే ఈ తరహా సమస్య కనిపిస్తుంది. మిగిలిన సమయాల్లో ఫ్లోట్‌ ఛాంబర్‌ సక్రమంగానే పనిచేస్తుంది. ఈ రకమైన సమస్యను అధిగమించడానికి కమర్షియల్‌ ఫ్యూయల్‌ స్టెబిలేజర్ల ద్వారా ఈ రకమైన సమస్యను అధిగమించవచ్చు.

ఫ్లోట్‌ ఛాంబర్‌లో వాతావరణ పీడనాన్ని కొనసాగించడం కోసం, ఫ్లోట్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించిన గాలి బయటకు పోవడానికి ప్రత్యేక వెంట్‌ ట్యూబ్స్‌ను వాడతారు. ఇవి సాధారణంగా కార్బ్యురేటర్‌ థ్రోట్‌ లోపలకు ఉంటాయి. ఈ వెంట్‌ ట్యూబ్‌ల అమరిక కారణంగా, కొన్ని సమయాల్లో కార్బ్యురేటర్‌నుంచి ఇంధనం బయటకు పోకుండా నిరోధించడం సంక్షిష్టమవుతుంది. కొన్ని సమయాల్లో వీటిని పొడవైన ట్యూబ్‌ల ద్వారా ఆధునీకరిస్తారు. గుర్తించదగ్గ విషయం ఏమిటంటే ఇది ఇంధనాన్ని వాతావరణ పీడనానికి తీసుకొస్తుంది. అందువల్ల పై ప్రవాహంలో అమర్చిన సూపర్‌ ఛార్జర్‌ మీద ఒత్తిడి కల్పించడంతో ఇది థొరెట్‌లోకి ప్రవహించకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో కార్బ్యురేటర్‌ సక్రమంగా పనిచేయడానికి ఎయిర్‌టైట్‌ ప్రజర్‌ బాక్స్‌లో ఉంచాల్సి వస్తుంది. సూపర్‌ఛార్జర్‌ అప్‌స్ట్రీమ్‌లో కార్బ్యురేటర్లను అమర్చిన వాటికి ఇలాంటి ఏర్పాటు అవసరం లేదు. అందువల్లనే సాధారణంగా ఈ విధానాన్నే అనుసరిస్తూ ఉంటారు. అయితే దీని ఫలితంగా గాలి, ఇంధన మిశ్రమం కుదించడం వల్ల ఇంజిన్‌లో బ్యాక్‌ఫైర్‌ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి తరహా పేలుళ్లను డ్రాగ్‌ రేసుల్లో సాధారణంగా చూడవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా ఒత్తిడిని విడుదల చేసే బ్లోఆఫ్‌ ప్లేట్లను ఇన్‌టేక్‌ మనీఫోల్డ్‌లో అమరుస్తారు. బ్రేక్‌వే బోల్టులు సూపర్‌ఛార్జర్‌ దగ్గరగా ఉండే నైలాన్‌ బ్లాకెట్స్‌ను గట్టిగా పట్టుకునేవిధంగా చేయడం ద్వారా మనీఫోల్డ్‌కు జతచేస్తాయి.

ఇంజిన్‌ వివిధ రకాల పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు (ఉదాహరణకు చైన్‌సా) ఫ్లోట్‌ చాంబర్‌ పనిచేయదు. దీనికి బదులుగా డయాఫ్రమ్‌ చాంబర్‌ను ఉపయోగిస్తారు ఫ్లెక్సిబుల్‌ డయాఫమ్‌ను ఫ్యూయల్‌ ఛాంబర్‌కు ఒకవైపు అమరుస్తారు. దీని అమరిక ఏ విధంగా ఉంటుందంటే, గాలి ఒత్తిడి వల్ల డయాఫమ్‌ లోపలికి నెట్టబడుతుంది. ఫలితంగా ఇంజిన్‌ నుంచి ఇంధనం బయటకు పంపబడుతుంది. డయాఫమ్‌ నీడిల్‌ వాల్వ్‌కు జతచేయబడుతుంది. ఇది లోపల వైపుకు కదులుతూ నీడల్‌ వాల్వ్‌ నుంచి ఎక్కువ ఇంధనం లోపలికి వచ్చే విధంగా చూస్తుంది. ఎంత ఇంధనం అవసరమో అంత ఇంధనాన్ని మాత్రమే నింపే పంపే విధంగా చూస్తుంది. ఇంధనం పూర్తిగా నిండిన తరువాత ఇంధన బత్తిడి మరియు చిన్న స్ప్రింగ్‌ కారణంగా డయాఫమ్‌ దూరంగా జరిగి నీడిల్‌వాల్వ్‌ను మూసేస్తుంది. ఒక సంతులిత స్థితికి చేరుకున్న తరువాత నిలకడైన ఫ్యూయల్‌ రిజర్వాయర్‌ స్థితిని కొనసాగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇది కొనసాగుతుంది.

మల్టీ కార్బ్యురేటర్‌ బ్యారెల్‌[మార్చు]

హెలీ మోడల్‌ 2280 ట్యూ బ్యారెల్‌ కార్బ్యురేటర్‌
కొలంబో టైప్‌125, 1961 నాటి ఫెరారీ 250 టీరఆర్‌ స్పైడర్‌లో ఆరు వెబర్‌, టూ బ్యారెల్‌ కార్బ్యురేటర్‌తోపాటు 12 ఎయిర్‌హార్స్‌ ద్వారా గాలిని ప్రవేశపెట్టగల టెస్టారోసా ఇంజిన్‌. ప్రతి సిలెండర్‌లో ఎడ్జెస్ట్‌ చేయగల బ్యారెల్‌ ఉంది.

బేసిక్‌ కార్బ్యురేటర్లలో ఒకే ఒక వెంటూరీ ఉంటే, చాలా కార్బ్యురేటర్లలో ఒకటికంటే ఎక్కువ వెంటూరీలు లేదా బ్యారల్స్‌ ఉంటాయి ఇంజిన్‌ వేగంగా కదలడానికి, మరింత గాలి ప్రవాహానికి సాధారణంగా రెండు బ్యారల్‌ లేదా నాలుగు బ్యారల్‌ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగిస్తుంటారు. మల్టీ బ్యారెల్‌ కార్బ్యురేటర్లలో అసమానంగా, వివిధ సైజుల్లో ఉండే ప్రైమరీ, సెకండరీ బ్యారల్స్‌ ఉపయోగిస్తారు. వివిధ రకాల గాలి, ఇంధన మిశ్రమాలను అందించే విధంగా వీటిని కార్యురేట్‌ చేస్తారు. ప్రొగ్రెసివ్‌ విధానంలో వీటిని అనుసంధానం చేస్తారు. ఫలితంగా ప్రైమరీ బ్యారెల్స్‌ పూర్తిగా తెరుచుకున్న తరువాతే, సెకండరీ బ్యారెల్స్‌ తెరుచుకుంటాయి. ఈ విలక్షణ లక్షణం ద్వారా ప్రైమరీ బ్యారెల్స్‌ పూర్తి ఇంజిన్‌ వేగాల వద్ద గరిష్ఠంగా గాలిని ప్రవహింప చేస్తాయి. మరింత గాలి ప్రవహించడం కోసం క్రాస్‌ సెక్షన్‌ ఏరియాను సృష్టించడం ద్వారా గాలి ప్రవహానికి ఉన్న వ్యతిరేకతను తగ్గిస్తాయి. ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే వాటిలో ఈ తరహా సౌలభ్యం వల్ల పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే ఇలాంటి వాటిలో థొరెటల్‌ ఆపరేషన్‌ అసంగతమైనది. సూక్ష్మత, మరియు సౌలభ్యం కోసం ప్రైమరీ మరియు సెకండరీలు, రెండు సిలెండర్‌ బ్యాంక్స్‌కలిగి ఉన్న సింగిల్‌ కార్బ్యురేటర్‌ కలిగిన V- కాన్ఫిగరేషన్‌ ఇంజిన్లు తెరుచుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క సిలెండర్‌ బ్యాంక్‌ కలిగిన రెండు ఏకరీతి బ్యారెల్స్‌ ద్వారా కాన్షిగర్‌ చేయబడతాయి. V8 లేదా నాలుగు బ్యారెల్‌ కార్బ్యురేటర్‌ కాంబినేషన్‌లో రెండు ప్రైమరీ మరియు రెండు సెకండరీ బ్యారెల్స్‌ను మనం సాధారణంగా చూడవచ్చు.

స్ప్రెడ్‌ బోర్‌ నాలుగు బ్యారెల్‌ కార్బ్యురేటర్‌ను మొదట రోచెస్టర్‌ క్వాడ్రా జెట్‌[ఉల్లేఖన అవసరం] పేరిట 1965లో విడుదల చేసింది. ఈ తరహా మోడల్‌లో ప్రైమరీ, సెకండరీ థొరెటల్‌ బోర్స్‌ యొక్క సైజులు విభిన్నంగా ఉంటాయి. ప్రైమరీ బ్యారెల్‌ సాధారణంగా నాలుగు బ్యారెల్స్‌ ఉపయోగించే వాటిలో ఉండే దాని కంటే తక్కువ సైజు కలిగి ఉంటాయి. సెకండరీ బ్యారెల్స్‌ ఎక్కువ సైజులో ఉంటాయి. తక్కువ సైజులో ఉండే ప్రైమరీలు తక్కువ వేగాల వద్ద ఇంధన వాడకాన్ని తగ్గిస్తాయి. అదే విధంగా పెద్ద పరిమాణంలో ఉండే సెకండరీలు అవసరమైనప్పుడు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. సెకండరీ వెంట్యూరీ గుండా గాలి ప్రవహించడానికి వీలుగా ప్రతి సెకండరీ థోట్‌ పైభాగంలో ఒక ఎయిర్‌ వాల్వ్‌ ఉంటుంది. ఇది చౌక్‌ ప్లేట్‌ తరహాలో కాన్ఫిగర్‌ చేయబడి ఉంటుంది. మూసి ఉన్న పరిస్థితిలో ఇది లైట్‌గా స్పింగ్‌ లోడెడ్‌ తరహాలో ఉంటుంది. ఇంజిన్‌ వేగం, థొరెట్‌ ఓపెనింగ్‌కు అనుగుణంగా ఇది గుణాత్మకంగా తెరుచుకుంటుంది. తద్వారా క్రమేపీ కార్బ్యురేటర్‌ యొక్క సెకండరీలో మరింత గాలి ప్రవహించే అవకాశం ఉంటుంది. ఎయిర్‌ వాల్వ్‌ను సాధారణంగా మీటరింగ్‌ రాడ్స్‌కు అనుసంధానం చేస్తారు. ఎయిర్‌వాల్వ్‌ తెరుచుకోవడంతో ఇవి పైకి లేస్తాయి, తద్వారా సెకండరీ ఫ్యూయల్‌ ఫ్లోను నియంత్రించవచ్చు.

సింగిల్‌ ఇంజిన్‌లో అనేక కార్బ్యురేటర్లను ప్రొగ్రెసివ్‌ లింకేజ్‌ ద్వారా అమర్చవచ్చు. టూ, ఫోర్‌ బ్యారల్‌ కార్బ్యురేటర్లను అత్యధిక సామర్థ్యం కలిగిన అమెరికన్‌ V8 లో, మల్టిపుల్‌ టూ బ్యారల్‌ కార్బ్యురేటర్‌ను అత్యధిక సామర్థ్యం కలిగిన ఇంజిన్లలో చూడవచ్చు. చిన్న చిన్న కార్బ్యురేటర్లను అధిక సంఖ్యలో ఉపయోగించవచ్చు (ఫోటోలో చూడండి) కామన్‌ ప్లీనమ్‌ లేకపోవడంతో ఈ విధంగా కాన్ఫిగరేషన్‌ చేయడంతో గరిష్ఠంగా దీనిగుండా గాలి ప్రహించే అవకాశం ఉంది. క్రాంక్‌షాఫ్ట్‌ తిరుగుతున్నప్పుడు అన్ని సిలెండర్లు ఒకే సారి గాలిని లోపలికి తీసుకోకుండా ఉంటాయి.[6]

కార్బ్యురేటర్‌ ఎడ్జెస్ట్‌మెంట్‌[మార్చు]

గాలి మరియు ఇంధన మిశ్రమంలో ఎక్కువగా ఇంధనం ఉంటే దాన్ని రిచ్‌ అని, తక్కువగా ఇంధనం ఉంటే దాన్ని లీన్‌ అని అంటారు. కార్బ్యురేటర్‌లో ఉండే ఒకటి రెండు నీడిల్స్ను లేదా పిస్టన్‌ ఇంజిన్‌ వాడే ఎయిర్‌క్రాఫ్ట్‌లో పైలట్‌ ద్వారా ఆపరేట్‌ చేయబడే లీవర్‌ను ఎడ్జెస్ట్‌ చేయడం ద్వారా ఈ మిశ్రమాన్ని సరిచేస్తారు. (ఎందుకంటే ఈ మిశ్రమం గాలి సాంద్రత పై ఆధారపడుతుంది కనుక). గాలి నుంచి ఇంధన నిష్పత్తి 14.7:1 (స్టైకోమెట్రిక్‌) గా ఉండాలి. ప్రతి యూనిట్‌ బరువు గల గ్యాసోలిన్‌కు 14.7 యూనిట్ల గాలి వినియోగించబడుతుందని దీని అర్థం. గ్యాసోలిన్‌ కాకుండా వివిధ రకాల ఇంధనాలకు స్టైకోమెట్రిక్‌ నిష్పత్తి వేర్వేరుగా ఉంటుంది.

గ్యాస్‌ ఎనలైజర్‌ను ఉపయోగించడం ద్వారా వెలువడే పొగలోని కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రోకార్బన్‌ మరియు ఆక్సిజన్‌ లెక్కించడం ద్వారాను లేదా కలర్‌ట్యూన్‌[7] పేరిట గ్లాస్‌ స్పార్క్‌ ఫ్లగ్‌ ద్వారా కంబర్షన్‌ ఛాంబర్‌లోని వెలుతురును గమనించడ ద్వారా కార్బ్యురేటర్‌ మిశ్రమాన్ని సరిచేయవచ్చు. స్టైకోమెట్రిక్‌ బర్నింగ్‌ వద్ద ఈ వెలుతురు యొక్క రంగు బునిసెన్‌ బ్లూ కలర్‌లో ఉంటుంది. మిశ్రమం రిచ్‌గా ఉంటే ఇది పసుపు రంగులోకి, లీన్‌గా ఉంటే తెలుపు రంగులోకి మారుతుంది.

ఇంజిన్‌ నడిచే పరిస్థితి, స్పార్క్‌ ఫ్లగ్‌ యొక్క రంగు ద్వారా మిశ్రమం యొక్క పరిస్థితిని అంచనా వేయవచ్చు.నలుపు లేదా డ్రై సూటీ ఫ్లగ్‌ మిశ్రమం రిచ్‌ కండిషన్‌లో ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. తెలుపు నుంచి ఒకమాదిరి గ్రే కలర్‌ మిశ్రమాలు ఫ్లగ్‌ పై ఉంటే అది లీన్‌ కండిషన్‌ను తెలుపుతుంది బ్రౌనిష్‌ గ్రే సరియైన రంగుగా చెప్పవచ్చు. చూడండి స్పార్క్‌ ఫ్లగ్స్‌ గురించి చదవండి

1980 మొదటి వరకు చాలా అమెరికన్‌ మార్కెట్‌ వాహనాల్లో స్పెషల్‌ ఫీడ్‌బ్యాక్‌ కార్బ్యురేటర్లను ఉపయోగించేవారు. ఆక్సిజన్‌ సెన్సార్ల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా ఫీడ్‌బ్యాక్‌ కార్బ్యురేటర్లు బేస్‌ మిశ్రమాన్ని మార్చుకునేది. ఖర్చును నియంత్రడానికే దీన్ని ఉపయోగించేవారు. (1980 నాటి ఉద్గారాలకు అనుగుణంగా పనిచేయడంతోపాటు, అప్పడు మార్కెట్లో ఉన్న మోడల్స్‌ ఆధారంగానే దీన్ని రూపొందించడం వల్ల ఇవి చాల బాగా పనిచేసాయి) హార్డ్‌వేర్‌ ధరలు పడిపోవడంతోపాటు ఉద్గారాలకు సంబంధించి నియమాలు కఠినతరం కావడంతోపాటు ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ను స్టాండర్ట్‌ ఐటమ్‌గా మార్చడంతో ఇవి అదృశ్యమయ్యాయి.

మల్టీప్లై కార్బ్యురేటర్లను మెకానికల్‌ పద్ధతిలో థొరెటల్‌కు కలిపినప్పుడు, అవి సక్రమంగా పనిచేయడానికి సింక్రనైజ్‌ చేయాల్సి ఉంటుంది.

ఉత్ప్రేరక కార్బ్యురేటర్‌[మార్చు]

ఉత్ప్రేరక కార్బ్యురేటర్‌ ఇంధన పొగను వేడిగా ఉన్న నికిల్‌ లేదా ప్లాటినమ్‌ వంటి ఉత్ప్రేరక సమక్షంలో నీరు మరియు గాలిలో కలుపుతుంది. ఇది ఇంధనాన్ని మిథేన్‌, ఆల్కహాల్‌ మరియు ఇతర తేలికన ద్రవాలుగా మారుస్తుంది. ఆధునీకరించడం ద్వారా సుసంపన్నం చేసిన కిరోసిన్‌ను ట్రాక్టర్లను నడపడానికి అనుమతించడం కోసం ఉత్ప్రేరక కార్బ్యురేటర్‌ను ప్రవేశపెట్టారు. అమెరికన్‌ ఆర్మీ రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఉత్తర ఆఫ్రికా కార్యకలాపాల్లో ఉత్ప్రేరక కార్బ్యురేటర్ల వాడకంలో గొప్ప విజయాన్ని సాధించింది.[ఉల్లేఖన అవసరం]

ఉత్ప్రేరక కార్బ్యురేటర్లు వాణిజ్యపరంగా 1930 నుంచే అందుబాటులోకి వచ్చాయి. రెండు పెద్ద కంపెనీలు విస్త్రతంగా ఉన్న ప్రజావాడకాన్ని పరిమితం చేయగలిగాయి. మొదట, కమర్షియల్‌ గ్యాసోలిన్‌కు సంకలనాత్మక పదార్థాలను కలపడం ద్వారా ఉత్ప్రేరక కార్బ్యురేటర్‌ వాడే ఇంజిన్లు ఈ గ్యాసోలిన్‌ను వాడకుండా చేశారు. (ఉదాహరణకు 1932లో ప్రవేశపెట్టిన టెట్రా ఇథైల్‌ లెడ్‌ ఇంజిన్‌ నాక్‌ గ్యాసోలిన్‌ను వాడకుండా నిరోధించగలిగింది. తద్వారా ఎక్కువ కంపారిజ్‌ నిష్పత్తిలకుఅనుమతించింది). రెండవది 1930 కాలంలో గ్యాసోలిన్‌ కంటే కిరోసిన్‌ చౌక అన్న భావన తెరమరుగు కావడంతో క్యాటలిస్ట్‌ కార్బ్యురేటర్లు ప్రాథమిక ప్రయోజనం తొలగిపోయింది).

తయారీదారులు[మార్చు]

ఐరోపాలో[మార్చు]

ఐరోపా బయట[మార్చు]

చిన్న ఇంజన్లు[మార్చు]

ఇతర రకాలు[మార్చు]

మరింత చదువుటకు[మార్చు]

సాధారణ సమాచారం[మార్చు]

పేటెంట్లు[మార్చు]

ఇతర రకాలు[మార్చు]

ఉప ప్రమాణాలు[మార్చు]

సమగ్రమైన విషయాలు[మార్చు]

 1. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ వరల్డ్‌ బయోగ్రఫీ, 2005-2006, థామస్‌ గాలే
 2. "బెంజ్‌ పేటెంట్‌" (PDF). మూలం (PDF) నుండి 2008-05-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-19. Cite web requires |website= (help)
 3. అమెరికన్‌ హెరిటేజ్‌ డైరెక్టరీ,via Answers.కం ఆన్‌లైన్‌ ఎటమోలజీ డిక్షనరీ
 4. "Donát Bánki". Scitech.mtesz.hu. 1922-08-01. మూలం నుండి 2012-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 5. రాక్‌ఆటో ఆన్‌లైన్‌ ఆటో పార్ట్స్‌ క్యాటలాగ్‌
 6. Hibbard, Jeff (1983). Baja Bugs & Buggies. HP Books. p. 24. ISBN 0895861860.
 7. "Colortune". Autoexpertproducts.com. మూలం నుండి 2008-05-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 8. "Amal Carburetters". Amalcarb.co.uk. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 9. బర్లెన్‌ ఫ్యూయల్‌ సిస్టమ్స్‌ ప్రస్తుత తయారీదారు
 10. "Dellorto S.P.A". Dellorto.it. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 11. "Performance Carburetors, Cylinder Heads, Intake Manifolds, EFI Systems, Fuel Pumps, Crate Motors". Edelbrock.com. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 12. "Argelite". Argelitesa.com. మూలం నుండి 2009-10-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 13. "Bing Home Page". Bingcarburetor.com. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 14. "KEIHIN Corporation Home Page!!". Keihin.com. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 15. సమాచారం:http://www.aerocorsair.com/id27.htm
 16. "Holley Performance Carburetors, Fuel Injection, and Fuel Pumps". Holley.com. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 17. "Demon Carburetion - State of the art carburetors for the race and hot rod industry". Barrygrant.com. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)
 18. "Expolded view". Lectronfuelsystems.com. మూలం నుండి 2008-05-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-05. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

మూస:CarEngine nav మూస:Aircraft piston engine components