Jump to content

కార్ల్ డేవిడ్ అండర్సన్

వికీపీడియా నుండి
కార్ల్ డేవిడ్ అండర్సన్
అండర్సన్ 1936
జననం(1905-09-03)1905 సెప్టెంబరు 3
న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం1991 జనవరి 11(1991-01-11) (వయసు 85)
సాన్ మారినో, కాలిఫోర్నియా,
జాతీయతయునైటెడ్ స్టేట్స్
రంగములుభౌతిక శాస్త్రము
వృత్తిసంస్థలుCalifornia Institute of Technology
చదువుకున్న సంస్థలుCalifornia Institute of Technology (B.S. and Ph.D)
ముఖ్యమైన విద్యార్థులుDonald A. Glaser
Seth Neddermeyer
ప్రసిద్ధిDiscovery of the positron
Discovery of the muon
ముఖ్యమైన పురస్కారాలుNobel Prize in Physics 1936
Elliott Cresson Medal (1937)

కార్ల్ డేవిడ్ ఆండర్సన్ (సెప్టెంబర్ 3, 1905 - జనవరి 11, 1991) అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త . అతను ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ 1932 లో కనుగొన్నారు. ఈయన చేసిన ఉత్తమ ఆవిష్కరణకు 1936 లో భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

అండర్సన్ న్యూయార్క్ నగరంలో జన్మించాడు. ఈయన స్వీడిష్ నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందినవాడు. ఈయన భౌతిక శాస్త్రము, ఇంజనీరింగ్ లను కాల్‌టెక్ (బ్యాచులర్ ఆఫ్ సైన్సు:1927,డాక్టర్ ఆఫ్ ఫిలాసపీ:1930) లో పూర్తిచేశాడు. రాబర్ట్ ఎ. మిల్లికాన్ పర్యవేక్షణలో ఆయన విశ్వకిరణాలపై పరిశోధనలు ప్రారంభించినపుడు ఊహించని విధంగా క్లౌడ్ ఛాంబర్ చిత్రాలలో పరమాణు ఉపకణాన్ని కనుగొన్నాడు. ఈ కణం పరమాణు ఉపకణమైన ఎలక్ట్రాన్తో సమానమైన ద్రవ్యరాశి గలదిగా గుర్తించాడు. కానీ ఈ కణం ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం (ఋణావేశం) నకు వ్యతిరేక ఆవేశం (ధనావేశం) ఉన్నట్లు గుర్తించాడు. ఈ పరిశోధన 1932 లో ప్రకటించబడింది. దీనిని యితర శాస్త్రవేత్తలు ఆ తర్వాత కాలంలో ధ్రువీకరించారు. పాల్ డిరాక్ యొక్క సైద్ధాంతిక ప్రిడిక్షన్ పాజిట్రాన్ కూడా ఈ కణ ఉనికిని ఋజువు చేసింది. అండర్సన్ మొకట విశ్వకిరణాలలో ఈ కణాలను కనుగొన్నాడు. ఆ తర్వాత ఆయన సహజ రేడియోధార్మిక పదార్థమైన ThC'' (208Tl)[1] నుండి వెలువడిన గామా కిరణాలను యితర పదార్థాలపై ప్రక్షిప్తం చేసినపుడు ఫలితంగా పాజిట్రాన్-ఎలక్ట్రాన్ జంటలు యేర్పడుటను ఋజువు చేసెను. ఈయన చేసిన కృషికి 1936 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని "విక్టర్ హెస్"తో పాటుగా పొందారు.[2] మ్యూయాన్ కణం ఉప పరమాణు కణాలు జాబితాలో మొదటిది.

1936 లో అండర్సన్ , ఆయన యొక్క విద్యార్థి ఐన "సేథ్ నెడెర్మేయర్" కలసి మ్యూయాన్ (లేదా "మ్యూ-మీసాన్) అనే పరమాణు కణాన్ని కనుగొన్నారు. ఈ పరమాణు కణం ఎలక్త్రాన్ యొక్క ద్రవ్యరాశికి 207 రెట్లు ఉంటుంది కానీ అది ఎలక్ట్రాన్ తో సమానమైన ఋణావేశాన్ని, 1/2 స్పిన్ ను కలిగి ఉంటుంది. దీనికి కూడా కాశ్మిక్ కిరణాలలోనే కనుగొన్నారు. అండర్సన్, నెడెర్మేయన్ లు స్ట్రాం ఇంటరేక్షన్ సిద్ధాంతంలో హిడెకి యుకవా ప్రతిపాదించిన కణం అయిన పైయాన్ను కూడా వీక్షించారు.

అండర్సన్ తన అకడమిక్, పరిశోధనా జీవితాన్ని "కాల్‌టెక్"లో గడిపారు. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఆయన రాకెట్ లపై పరిశోధనలు చేశారు. ఈయన 1950 లో "అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్"కు పెలోగా ఎంపిక కాబడ్డారు.[3] ఈయన 1911, జనవరి 11 న మరణించారు.

ప్రచురణలు

[మార్చు]
  • C.D. Anderson (1933). "The Positive Electron". Physical Review. 43 (6): 491. Bibcode:1933PhRv...43..491A. doi:10.1103/PhysRev.43.491.
  • C.D. Anderson (1932). "The Apparent Existence of Easily Deflectable Positives". Science. 76 (1967): 238–9. Bibcode:1932Sci....76..238A. doi:10.1126/science.76.1967.238. PMID 17731542.
  • C.D. Anderson (1957), Technical adviser to The Strange Case of the Cosmic Rays, Bell System Science Film, Directed by Frank Capra, Frank Capra Productions.

సూచికలు

[మార్చు]
  1. ThC" is a historical designation of 208Tl, see Decay chains
  2. Physics 1936
  3. "Book of Members, 1780-2010: Chapter A" (PDF). American Academy of Arts and Sciences. Retrieved 17 April 2011.

యితర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.