కాల్షియం పెర్క్లోరేట్

వికీపీడియా నుండి
(కాల్సియం పెర్క్లోరేట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాల్షియం పెర్క్లోరేట్
పేర్లు
IUPAC నామము
Calcium perchlorate
ఇతర పేర్లు
Calcium perchlorate tetrahydrate, Calcium diperchlorate, Perchloric acid calcium salt (2:1), Calcium perchlorate, hydrated
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13477-36-6]
పబ్ కెమ్ 61629
SMILES [Ca+2].O=Cl(=O)(=O)[O-].[O-]Cl(=O)(=O)=O
  • InChI=1/Ca.2ClHO4/c;2*2-1(3,4)5/h;2*(H,2,3,4,5)/q+2;;/p-2

ధర్మములు
Ca(ClO4)2
మోలార్ ద్రవ్యరాశి 238.9792 g/mol
స్వరూపం White to yellow crystalline solid
సాంద్రత 2.651 g/cm3
ద్రవీభవన స్థానం 270 °C (518 °F; 543 K)
188 g/100mL (20 °C)
ద్రావణీయత EtOH, MeOH
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Inhalation, ingestion or contact (skin, eyes) with vapors or substance may cause severe injury, burns, etc. Fire may produce irritating, corrosive and/or toxic gases. Runoff from fire control or dilution water may cause pollution. [ఆధారం చూపాలి]
Eye hazard Avoid contact with eyes. In case of contact, rinse immediately with plenty of water and seek medical advice
Skin hazard Avoid contact with skin. In case of contact, rinse immediately with (manufacturer's instructions)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

'కాల్సియం పెర్క్లోరేట్' లేదా కాల్సియం పెర్‌క్లోరేట్ అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక లోహ పెర్క్లోరేట్ లవణం.కాల్సియం,క్లోరిన్, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన ఏర్పడిన సమ్మేళన పదార్థం.ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క రసాయన ఫార్ములా Ca (ClO4)2.ఈ రసాయన సంయోగ పదార్థం చూచుటకు పసుపు-తెలుపు వర్ణ మిశ్రిత స్పటిక పదార్థం. కాల్సియం పెర్క్లోరేట్ బలమైన ఆక్సీకరణ సంయోగ పదార్థం.

భౌతిక లక్షణాలు

[మార్చు]

భౌతిక స్థితి

[మార్చు]

కాల్సియం పెర్క్లోరేట్ తెల్లగా లేదా పసుపు రంగులో ఉన్న స్పటిక అణుసౌష్టవం కలిగిన ఘన పదార్థం.[1] కాల్సియం పెర్క్లోరేట్ అణుభారం 238.9792 గ్రాములు/మోల్.[2]

సాంద్రత

[మార్చు]

సాధారణ ఉష్ణోగ్రత (25 °C)వద్ద కాల్సియం పెర్క్లోరేట్ సాంద్రత 2.651 గ్రాములు/సెం.మీ3.[1] కాల్సియం పెర్క్లోరేట్ ద్రవీభవన స్థానం 270 °C (518 °F;543K)

ద్రావణీయత

[మార్చు]

నీటిలో కరుగును.20 °C వద్ద 100 మి.లీ నీటిలో188 గ్రాములు కరుగును.

ఇతర ధర్మాలు

[మార్చు]

కాల్సియం పెర్క్లోరేట్ బలమైన అకర్బన ఆక్సీకరణకారక రసాయన పదార్థం. ఇది ఇతర పదార్థాలు దహన చర్యకు దోహద పడును,కొన్ని సార్లు పదార్థాల విస్పొటన కూడా జరుగును. కాల్సియం పెర్క్లోరేట్ అయాన్ (ClO4)సౌష్టవపరంగా చుతుర్భుజ కోణనిర్మాణం కల్గి,దీని యొక్క తక్కువ ఎలక్ట్రాన్ దాతృత్వం,ఎక్కువ ప్రోటాన్ గ్రహీత గుణం వలన,బలంగా ద్రావణంలో స్థిరత్వం కల్గి ఉంది.

ద్రవాంక వ్యవస్థ

[మార్చు]

కాల్సియం పెర్క్లోరేట్ ద్రావణం సరళ ద్రవాంక వ్యవస్థ (eutectic system) ఏర్పరచును. కాల్సియం పెర్క్లోరేట్ ద్రావణం ద్రవాంశ మేళనము (eutectic composition), 4.2 మోల్/100 గ్రాములనీరులో

ఉత్పత్తి

[మార్చు]

పెర్క్లోరేట్ లవణాలు,క్షారాల, పెర్ క్లోరోక్ ఆమ్లాల సంయోగ జనితాలు/ఉత్పాదితాలు. కాల్సియం కార్బోనేట్, అమ్మోనియం పెర్ క్లోరేట్ మిశ్రమాలను వేడి చెయ్యడం వలన కాల్సియం పెర్క్లోరేట్ ఏర్పడును.రసాయన చర్య ఫలితంగా అమ్మోనియం కార్బోనేట్ వాయుస్థితి/ రూపంలో ఏర్పడి వెలువడి,కాల్సియం పెర్క్లోరేట్ ఘన స్థితిలో ఏర్పడును.

రసాయన చర్యలు

[మార్చు]

నీటిలో కరుగును. రసాయన చర్య జరుపును. కాల్సియం పెర్క్లోరేట్ శక్తివంతమైన అక్సీకరణకారకం.ఇది క్షయికరణకారకాలతో రసాయన చర్య జరపడం వలన ఉష్ణం, వాయుస్థితి ఉత్పాదికాలు ఏర్పడును.[3]

నీటితో చర్య

[మార్చు]

కాల్సియం పెర్క్లోరేట్ అమితమైన ఆర్ద్రతాకర్షక/జలాకార్షగుణం ( hygroscopic) (తేమ/చెమ్మను పీల్చుకొను ధర్మం)కలిగి ఉన్నందునందునసాధారణంగా నాలుగు జలాణువులను కలిగిన కాల్సియం పెర్క్లోరేట్ టెట్రా హైడ్రేట్ (Ca (ClO4)2 • 4H2O)రూపంలో లభించును.

లోహాలతో రసాయన చర్య

[మార్చు]

కీయాశీలక లోహాలతో,సైనైడులతో,ఈస్టరులతో, థైయోసైనైడిలతో తీవ్రస్థాయిలో రసాయన చర్య జరుపును[3]

భద్రతపరమైన సమస్యలు

[మార్చు]

కాల్సియం పెర్క్లోరేట్ హానికర రసాయన పదార్థం.కాల్సియం పెర్క్లోరేట్ ఆవిరులు లేదా పదార్థం కళ్ళు లేదాచర్మాన్ని తాకిన కాలిన గాయాలు,బొబ్బలు ఏర్పడును. అలాగే శ్వాసించిన,లేదా అన్నకోశం చేరినను పై పరిణామాలే ఏర్పడును.కాల్సియం పెర్క్లోరేట్ ను మండించిన ఇరిటేసన్ కల్గించే క్షయికరణ,, విషపూరితమైన వాయువులను విడుదల చేయును.[1]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "CALCIUM PERCHLORATE". cameochemicals.noaa.gov. Retrieved 2016-03-20.
  2. "Calcium Perchlorate". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2016-03-20.
  3. 3.0 3.1 "CALCIUM PERCHLORATE". chemicalbook.com. Retrieved 2016-03-20.