Jump to content

కాళి బేయ్న్

వికీపీడియా నుండి
కాళి బేయ్న్ శుభ్రం చేస్తున్న దృశ్యం

.కాళి బేయ్న్ అనేది పంజాబ్ రాష్ట్రంలో గల ఒక నీటి ప్రవాహం.ఈ ప్రవాహం హరికే దగ్గర బియాస్, సట్లెజ్ నదులలో కలుస్తుంది. గురు నానక్ ఈ నీటి ప్రవాహంలో మునగటం వలన జ్ఞానాన్ని పొందాడని విశ్వసిస్తారు. 2000లో హరిత విప్లవం సమయానికి ఈ కాలువ కలుషితంగా ఉంది. తరువాత బల్బిర్ సింగ్ షెచ్వాల్ పోరాటంతో ఈ కాలువ శుభ్రపడింది.

నామ ఆవిర్భావం

[మార్చు]

కాళి బేయ్న్ అంటే నల్లని నది అని అర్ధం.[1]ఈ నీటిలో ఉండే మినరల్స్ నల్లని రంగును ప్రతిభింబిస్తాయి కావున దీనికి కాళి అనే పేరు వచ్చింది.[2] పంజాబీ పదమైన బేయ్న్ సంస్క్రత పదం వేణి నుండి వచ్చింది అంటే నీటి ప్రవాహం అని అర్ధం.[3]

నది ఆవిర్భావం

[మార్చు]

పంజాబ్ రాష్ట్రంలోని, దసుయా తాలూకాలోని, ధోనయా గ్రామం నుండి ఆవిర్భవించింది ఈ నది. ఓధ్రా రివుల్ట్, ముకెరియన్ హైడల్ కెనాళ్ళ నుంచి వచ్చే నీరే ఈ నదికి ప్రధాన ఆధారం. 160కి.మీలు ప్రయాణించి హరికె పట్టన్ ప్రాంతం వద్ద బియాస్, సట్లజ్ నదుల్లో కలుస్తుంది ఇది.[4] హోషియర్పూర్ ప్రాంతంలో ఈ నదిని పడమర బేయ్న్ అని అంటారు. హోషియర్పూర్, కపుర్తలా మండలాల్లో కాళి బేయ్న్ నది బియాస్ నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. ఈ నది లోతు 1.5 నుండి 3 మీటర్లు ఉంటుంది.[5] అక్బర్ రాజ్యం చేస్తున్న సమయంలో ఈ నదికి ఇటుకలతో ప్రహరీ కట్టారు.[4] చోటి బేయ్న్ అనే నది కాళీ బేయ్న్ కు ఉపనది.[6] కాళి బేయ్న్ నది హోషియార్పూర్, కపుర్తల, జలంధర్ మండలాల్లో ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున కపుర్తల, సుల్తాన్ పూర్ లోధి వంటి నగరాలు ఉన్నాయి.[7] తెర్కియానా దగ్గర ఉన్న ముకేరియన్ హైడెల్ చానల్ ఈ నది నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నిర్మించారు.[8]

నది శుద్ది

[మార్చు]

సంత్ బల్బీర్ 2000 సంవత్సరంలో మొదలెట్టిన కరసేవ కార్యక్రమం ఉదృతం అయ్యి 2003 వరకూ సాగటంతో వత్తిడీ అధికమై పంజాబ్ ప్రభుత్వం ఈ నది శుభ్రతకు నడుకట్టింది. నది తీరం వెంబడి శుభ్రపరచి, అనేక ఘాట్లు నిర్మించింది.


మూలాలు, బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sultanpur Lodhi: the site where Guru Nanak attained enlightenment". TwoCircles.net. 20 December 2014. Retrieved 25 December 2014.
  2. Sreelata Menon (2011). Guru Nanak: The Enlightened Master. Penguin Books India. p. 4. ISBN 978-0-14-333190-2.
  3. Nigah, Manpreet (September 2007). An Assessment of Seechewal Initiative in the State of Punjab, India: An example of Community-based Conservation? (PDF). Winnipeg: University of Manitoba. p. 64. Archived from the original (PDF) on 10 ఏప్రిల్ 2014. Retrieved 25 December 2014.
  4. 4.0 4.1 "Quiet flows the Kali Bein, again". The Hindu. 24 April 2006. Retrieved 25 December 2014.
  5. Mandeep Singh; Harvinder Kaur (1 January 2005). Punjab Today. Deep & Deep Publications. p. 60. ISBN 978-81-7629-702-8.
  6. "District collector joins Seechewal in cleaning Chhoti Bein". Times of India. 2 August 2014. Retrieved 25 December 2014.
  7. "Efforts to check pollution of Kali Bein". The Tribune. 19 November 2014. Archived from the original on 26 డిసెంబరు 2014. Retrieved 25 December 2014.
  8. "Prayers dry up on lips as Kali Bein fails to rise at Sultanpur Lodhi". The Indian Express. 15 April 2011. Retrieved 25 December 2014.