Jump to content

కాళీపట్నం కొండయ్య

వికీపీడియా నుండి

కాళీపట్నం కొండయ్య (1900 - 1996) సుప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, పత్రికా సంపాదకులు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఈడూరు గ్రామంలో జన్మించారు. వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. డిగ్రీ పూర్తిచేశారు. అక్కడ జాతీయోద్యమ భావాలకు ప్రేరితులై భీమవరం ప్రాంతంలో జాతీయోద్యమం నిర్వహించారు. కొంతకాలం కళాశాలలో రసాయనశాస్త్రం బోధించారు. తర్వాత "వీరభారతి" అనే రహస్య మాసపత్రిక ప్రారంభించారు. ఇది ప్రజలలో మూఢ నమ్మకాలు తొలగింపుకు ఉపయోగపడేది. కొండయ్య చారిత్రిక పరిశోధన చేసి మహమ్మదీయ రాజ్యాలలో జాతీయ వికాసం అనే గ్రంథాన్ని రచించారు.[1] "విజ్ఞానం" అనే వైజ్ఞానిక పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఖగోళ శాస్త్రంపై విశ్వరూపం గ్రంథం రాశారు. నిడదవోలులో రసాయన పరిశ్రమ పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. కొండయ్య, కాళీపట్నం (1937). మహమ్మదీయ రాజ్యాలలో జాతీయ వికాసం. Retrieved 13 January 2015.