Jump to content

కాళోజీ కళాక్షేత్రం

వికీపీడియా నుండి
కాళోజీ కళాక్షేత్రం
కాళోజీ కళాక్షేత్రం నమూనా
సాధారణ సమాచారం
రకంఆడిటోరియం
ప్రదేశంహన్మకొండ, తెలంగాణ
దేశంభారతదేశం
భౌగోళికాంశాలు17°59′59″N 79°33′48″E / 17.999622°N 79.563275°E / 17.999622; 79.563275
యజమానితెలంగాణ ప్రభుత్వం

కాళోజీ కళాక్షేత్రం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండలో నిర్మించబడుతున్న కళా ప్రాంగణం.[1] ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు పేరుమీద రూ. 50 కోట్లతో ఈ కళాక్షేత్రం నిర్మించబడుతోంది.[2]

ప్రారంభం

[మార్చు]

2014, సెప్టెంబరు 9న కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బాలసముద్రంలో ప్రెస్‌ క్లబ్‌ సమీపంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఈ కళాక్షేత్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు.[3] 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12,990 చ.మీ. (1,39,823 చ.అ) వైశాల్యంతో నిర్మిస్తున్న ఈ కళాక్షేత్రంకు సంబంధించి దేశ, విదేశాల్లో నిర్మించిన పలు భవనాల నమూనాలను సేకరించి, వాటిలో అత్యుత్తమమైన దానిని ఎంపిక చేశారు.

నిర్మాణం

[మార్చు]

నాలుగు అంతస్తులుగా (జీ ప్లస్‌ 4) నిర్మిస్తున్న ఈ కళాక్షేత్రం మొదటి దశలో భవనం సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ పనులు, మూడో దశలో ల్యాండ్‌ స్కేపింగ్‌, పాథ్‌ వే, పార్కింగ్‌ ఇతరత్రా పనులు చేపట్టుతారు.[4]

సౌకర్యాలు

[మార్చు]

ఈ కళాక్షేత్రం మొదటి అంతస్తులో బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ల్లో ఆర్ట్‌ గ్యాలరీ, ఆడిటోరియం, రిహార్సల్స్‌ రూం, గ్రీన్‌ రూం, లాబీ, మొదటి అంతస్తులో ఆర్టియం, ప్రీ ఫంక్షన్‌ ఏరియా, ఆఫీసు గదులు, ఫుడ్‌ కౌంటర్‌, స్టోర్‌ రూమ్స్‌, వాష్‌ రూమ్స్‌.రెండో అంతస్తులో గ్రంథాలయం, ఆఫీసు, స్టోర్స్‌, లాబీ, వాష్‌ రూములు, మూడు, నాలుగో అంతస్తుల్లో ప్రీ ఫంక్షన్‌ లాబీ, బాల్కనీ, టెర్రస్‌, క్యాట్‌వాక్‌ లాబీ ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు 1,000 మంది కూర్చునే సామర్థ్యంతో మూడు ఎకరాల స్థలంలో అత్యాధునిక ఆడిటోరియంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మించబడుతోంది[5] సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రజలు దీనిని అద్దెకు తీసుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. India, The Hans (2015-09-08). "Kaloji Kala Kshetram a non-starter". www.thehansindia.com. Retrieved 2021-08-30.
  2. "New Kaloji Kala Kendram soon in memory of poet Kaloji Narayana Rao". Deccan Chronicle. 2014-09-03. Retrieved 2021-08-30.
  3. "Work on Kaloji Kalakshetram to resume". The Hindu. 2020-01-20. ISSN 0971-751X. Retrieved 2021-08-30.
  4. "Kaloji memorial to be better than Falaknuma". Deccan Chronicle. 2017-09-19. Retrieved 2021-08-30.
  5. "Minister releases Kaloji Kala Kshethram building model". The Hindu. 2015-06-16. ISSN 0971-751X. Retrieved 2021-08-30.