కావ్యగంగ
కావ్యగంగ | |
కృతికర్త: | |
---|---|
అనువాదకులు: | బెళ్లూరి శ్రీనివాసమూర్తి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కావ్యసంపుటి |
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్యం |
ప్రచురణ: | కిశోర కవితాసమితి ముదిగల్లు |
విడుదల: | 1957 |
ఈ కావ్యసంపుటిని[1] బెళ్లూరి శ్రీనివాసమూర్తి రచించాడు. దీనిలో మూడు కావ్యాలున్నాయి.
- తెలుగు పొలము
- మహాత్యాగి
- అపశ్రుతి
ఈ కావ్యగంగ కావ్యసంపుటిని మైసూరు యూనివర్సిటీ వారు డిగ్రీ పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు.
తెలుగు పొలము
[మార్చు]ఈ కృతిని కవి తన జన్మస్థానమైన తెలుగు మాగాణము నందు అభిమానము వ్యక్తము చేస్తూ అభివర్ణనాత్మకముగా రచించాడు. తన ప్రజల సుగుణసంపదలను కవి ఎంతో ఆత్మాభినివేశముతో గానము చేస్తున్నాడు.
మహాత్యాగి
[మార్చు]గౌతమ బుద్ధుని జీవితాన్ని సంస్కరిస్తూ వ్రాసిన కావ్యము.
అపశ్రుతి
[మార్చు]పసిగుడ్డుగా వున్న కూతురు మరణముచే కలిగిన విషాదము ఈ కావ్యముగా పరిణమించింది.
ఉదాహరణలు
[మార్చు]తెలుగున్ కర్షకు లేలెడు
పొలములకు సమీపమందె పొమ్ము, ప్రశాంత
స్థలముల నిర్మలకుల్యా
జలకణముల చలువ హృదయశాంతి ఘటింపన్
వర్షాకాలంబగుచో
హర్షంబున జూచు పుణ్య మబ్బున్ నీకున్
కర్షక జీవనములు - ది
వ్యర్షి ప్రాయములు, విడువ కవకాశంబుల్
వరిమళ్లనిగమపట్టుల
వరుసలు వరుసలు బలాకవర్గముగని సుం
దరస్వర్గ భ్రాంతిన్‌గని
పరవశతను గాంతు - నేన పలుకగనేలా!
(తెలుగు పొలము నుండి)
దర్శనీయము లంబినీ ధన్యభూమి
శాక్యముని చంద్రులకు నాడు జన్మభూమి -
వివిధ సారస్వతానేక విధ రస ప్ర
మత్త కవితల్లజ మరందమధుల లేఖి
నీ గళత్కావ్య నిర్నిద్రగతులు
పూచెనో దివ్య సౌందర్య ముగ్ధరీతి
నాడు నేడును - నెంత పుణ్యస్థలంబు.
అమల తరువాటికా మనోహరము, శ్రావ్య
తర శకుంత రుతామోద కరము, అంబ
ప్రసవబాధ సహించిన వన్యతలము
లంబినీ భూమి మధుర మార్గములయందు
నీదు తొలియేడ్పులోభావనిబిడమైన
యేమి సందేడమున్నదోయీ! తపస్వి!
గౌతమా! నీవు పుట్టిన కాననంపు
శోభలో నాదు హృదయంబు సొక్కిపోయె
(మహాత్యాగి నుండి)
మూలాలు
[మార్చు]- ↑ [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రిక ఫిబ్రవరి 1958 సంచిక పేజీలు 104