Jump to content

కాశీరాం వెచన్ పవారా

వికీపీడియా నుండి
కాశీరాం వెచన్ పవారా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
ముందు అమ్రిష్ పటేల్
నియోజకవర్గం శిర్పూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

కాశీరాం వెచన్ పవారా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు శిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కాశీరాం పవారా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో శిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పవారా రంజిత్‌సిన్హ్ భర్త్‌సిన్హ్ పై 39813 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డాక్టర్ జితేంద్ర యువరాజ్ ఠాకూర్ పై 25201 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

కాశీరాం పవారా అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో శిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ జితేంద్ర యువరాజ్ ఠాకూర్ పై 49174 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ జితేంద్ర యువరాజ్ ఠాకూర్ పై 1,45,944 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. India Today (23 November 2024). "Shirpur, Maharashtra Assembly Election Results 2024 Highlights: BJP's Kashiram Vechan Pawara defeats Independent candidate Dr.Jitendra Yuvraj Thakur with 145944 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  5. CNBCTV18 (23 November 2024). "Maharashtra Elections 2024: 14 candidates win by over 1 lakh votes, all from Mahayuti" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)