Jump to content

కాశేపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 15°01′N 77°40′E / 15.02°N 77.67°E / 15.02; 77.67
వికీపీడియా నుండి

కాశేపల్లి, అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కాశేపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
కాశేపల్లి is located in Andhra Pradesh
కాశేపల్లి
కాశేపల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°01′N 77°40′E / 15.02°N 77.67°E / 15.02; 77.67
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం పెద్దవడుగూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి అతి చిన్న గ్రామమైనా గణనీయమైన అభివృద్ధి సాధించింది. వ్యవసాయమే జీవనాధారంగా గ్రామ రైతులు ముందుకు సాగుతున్నారు. 1275 మంది జనాభా వున్న కాశేపల్లి 1959లో పంచాయతీగా ఆవిర్భవించింది. దాదాపు 950 మంది ఓటర్లు వున్న ఈ గ్రామంలో అపారమైన దేశభక్తి కనబడుతోంది. అన్నదాతల బిడ్డలు దేశంకోసం సరిహద్దుల్లో పహరా కాస్తున్నారు. జిల్లాలో ఒక్క కాశేపల్లి గ్రామం నుంచే 16 మంది సైనికులుగా ఎంపికయ్యారు. కొడుకులు దేశానికి సేవచేస్తూ సరిహద్దుల్లో ఉంటే, ఇక్కడ వారి తల్లిదండ్రులు వ్యవసాయంలో అభివృద్ధి సాధిస్తున్నారు. పారిశుద్ధ్యం, విద్యా రంగాల్లో గ్రామాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు.

దేశసేవలో...

[మార్చు]

కాశేపల్లి గ్రా మం నుంచి 16 మంది సైనికులుగా ఎంపిక కావడం కాశేపల్లి గ్రామస్తులకు ఉన్న దేశభక్తిని చాటుతోంది. గ్రామం నుంచి వెన్నపూసల ముత్యాలరెడ్డి, శ్రీరామిరెడ్డి, నారాయణరెడ్డి, ఓబిరెడ్డి, గోపాల్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, శివారెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎం. రామకృష్ణా రెడ్డి తదితరులు జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాలలో సైనికులుగా విధులు నిర్వహిస్తున్నారు.

రచ్చకట్ట

[మార్చు]

ఈ రచ్చకట్టపై కూర్చొని మాట్లాడుకుంటుంటే కాశేపల్లి రైతులకు కాలం కర్పూరంలా కరిగి పోతుంది. దేశ రాజకీయాలు సైతం ఈ రచ్చకట్టపై రసవత్తరంగా చర్చకు వస్తాయి. పంటలకు, పశువులకు సంబంధించిన గ్రామ విషయాలన్నింటినీ ఇక్కడ రైతులు చర్చించుకుంటారు. కట్టపై వున్న చింతచెట్టు వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడంలో ఏసీలకు ఏమాత్రం తీసిపోదంటారు గ్రామ ప్రజలు.

బండిశిల తిరుణాళ్ళు..

[మార్చు]
బండిశిల తిరునాళ్ళు

తిరుణాళ్ళు ప్రారంభమయ్యాయంటే గ్రామంలోని ప్రతి ఇల్లూ బంధువులతో, కూతుళ్ళు, అళ్లుళ్లతో కళకళలాడు తుంటుంది. గ్రామం సమీపంలో వారం రోజులపాటు జరిగే ఈ తిరుణాలలో చుట్టు పక్కల గ్రామాల ఎద్దులతో రథాన్ని లాగించడం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ వెలసిన సుంకుల మ్మ, ముత్యాలయ్య దేవతలను మహిమాన్వితులుగా భావించి కాశేపల్లి రైతులు తమ పిల్లలకు ఆ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]