కాశ్మీరీ సైకియా బారుహ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశ్మీరీ సైకియా బారుహ్
జననం
వృత్తినటి, గాయని, యాంకర్, న్యూస్‌కాస్టర్‌
క్రియాశీల సంవత్సరాలు1971-2014-ప్రస్తుతం

కాశ్మీరీ సైకియా బారుహ్, అస్సామీ సినిమా, నాటకరంగ, నటి, గాయని. పుతోలా ఘర్, సంధ్యా రాగ్, అగ్నిస్నాన్, హ్ఖగోరోలోయ్ బోహు దూర్ వంటి అవార్డు గెలుచుకున్న అస్సామీ సినిమాలో అద్భుతమైన పాత్రల్లో నటించింది.[1]

జననం, విద్య

[మార్చు]

కాశ్మీరి సైకియా బారుహ్ అస్సాం రాష్ట్రం, మంగళ్‌దోయ్‌లో జన్మించింది. మంగళ్‌దోయ్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసి, తర్వాత 1981లో గౌహతిలోని కాటన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది.[2]

సినిమారంగం

[మార్చు]

1971లో అవార్డు గెలుచుకున్న అరణ్య అనే అస్సామీ సినిమాలోని ప్రసిద్ధ పాట ఏయి పూర్ణిమార్ రాతిలో నృత్యకారుల బృందంలో సాధారణ కళాకారిణిగా నటించింది. పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1976లో సమరేంద్ర నారాయణ్ దేవ్ దర్శకత్వంలో వచ్చిన పుటోలా ఘర్ అనే సినిమాలో ప్రధాన నటిగా అరంగేట్రం చేసింది. 1977లో, భాబేంద్ర నాథ్ సైకియా దర్శకత్వం వహించిన సంధ్యా రాగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారతీయ పనోరమాలో ప్రదర్శించబడిన మొదటి అస్సామీ చిత్రంగా నిలిచింది. అగ్నిస్నాన్ (1985), మయూరి (1986), ఆంథోనీ ముర్ నామ్ (1986), ఏయి దేశ్ ముర్ దేశ్ (1986), హ్ఖగోరోలోయ్ బోహు డోర్ (1995) వంటి అస్సామీ సినిమాలలో కూడా నటించింది. 1990లలో దూరదర్శన్‌ అస్సామీ బులెటిన్‌లలో న్యూస్‌కాస్టర్‌గా పనిచేసింది. ప్రస్తుతం, టెలివిజన్‌లో యాంకర్/అస్సామీ టాక్ షోలు, ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది.

సినిమాలు

[మార్చు]
  • అరణ్య
  • పుటాలా ఘర్ (1976)
  • సంధ్యా రాగ్ (1977)
  • అగ్నిస్నాన్ (1985)
  • మయూరి (1986)
  • ఆంథోనీ ముర్ నామ్ (1986)
  • ఏయి దేశ్ ముర్ దేశ్ (1986)
  • హ్ఖగోరోలోయ్ బోహు డోర్ (1995)
  • చెనై ముర్ ధులియా

మూలాలు

[మార్చు]
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (10 July 2014). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781135943189.
  2. "Kashmiri Saikia Baruah Actors Celebrities official contact website for booking/artistebooking.com". www.artistebooking.co.in. Archived from the original on 2020-07-26. Retrieved 2022-02-09.

బయటి లింకులు

[మార్చు]