కాష్మోరా (2016 సినిమా)
కాష్మోరా | |
---|---|
![]() | |
దర్శకత్వం | గోకుల్ |
రచన | గోకుల్ జాన్ మహేంద్రన్ ఆర్. మురుగేశన్ |
నిర్మాత | ఎస్. ఆర్. ప్రకాశ్ బాబు ఎస్. ఆర్. ప్రభు |
నటవర్గం | కార్తీ నయనతార శ్రీదివ్య వివేక్ |
ఛాయాగ్రహణం | ఓం ప్రకాశ్ |
కూర్పు | వి. జె. సబు జోసెఫ్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదారులు | తెనేందల్ ఫిలింస్ (తమిళం) పివిపి సినిమా (తెలుగు) |
విడుదల తేదీలు | 2016 అక్టోబరు 28 |
నిడివి | 164 నిమిషాలు |
దేశం | India |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹600 మిలియన్లు[1] |
వసూళ్ళు | ₹265 మిలియన్లు[2] |
కాష్మోరా 2016లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము.
కథ[మార్చు]
సినిమా ఆగ్నేయాసియాలోని దైవకుమారి ఆలయంలో ప్రారంభం అవుతుంది. దైవకుమారి ఆలయంలో కీలకమైన తాళపత్ర గ్రంథాలను ఓ పక్షి రూపంలో రాజ్‌నాయక్ ఆత్మ(కార్తీ)దొంగలించి మంత్రాల చెరువు దగ్గరలోని దెయ్యాలకోటకు తెప్పించుకుంటాడు. ఏడు శతాబ్దాలుగా ఆత్మ రూపంలో కోటలోనే ఉన్న రాజ్‌నాయక్‌కు మళ్లీ జన్మించాలంటే కాష్మోరా(కార్తీ) సహాయం అవసరం అని తాళపత్ర గ్రంథాల సహాయంతో తెలుసుకుంటాడు. కాష్మోరా అతని కుటుంబం దెయ్యాలు, ఆత్మలతో మాట్లాడుతామని మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేస్తుంటారు. కాష్మోరా చేసే మోసాలు తెలియని ప్రజలు అతన్ని బాగా నమ్ముతుంటారు.
ఓ సందర్భంలో రాజకీయ నాయకుడు ధనకోటి ఓ హత్యకేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఎన్నో పూజలు చేసినా ఫలితం ఉండదు. అప్పుడు కాష్మోరా సహాయం కోరుతాడు ధనకోటి, కోర్టు హత్య కేసు కోట్టేయడంతో కాష్మోరా మహిమ గల వ్యక్తి అని నమ్ముతాడు. ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్‌కు భయపడి తన వద్ద ఉన్న డబ్బు, నగలు, పత్రాలన్నింటినీ కొన్ని బ్యాగుల్లో పెట్టి కాష్మోరా దగ్గర దాస్తాడు. కాష్మోరా ఆ డబ్బుతో పారిపోతూ ఓ పెద్ద బంగళాకు చేరుకుంటాడు. ఆ బంగళా ఎవరిది? రాజ్‌నాయక్ ఎవరు? రాణీ రత్నమహాదేవికి, రాజ్‌నాయక్‌కు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు కాష్మోరా ఎదుర్కొన పరిస్థితులేంటి? అనేది మిగిలిన కథ.[3]
తారాగణం[మార్చు]
- కార్తీ
- నయనతార
- శ్రీదివ్య
- వివేక్
- జంగిరి మధుమిత
సాంకేతికవర్గం[మార్చు]
- సంగీతం: సంతోష్ నారాయణ్
- సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
- కళ: రాజీవన్
- ఎడిటింగ్: వి.జె.సాబు జోసెఫ్
- విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్: స్టాలిన్ శరవణన్
- నిర్మాతలు: పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్
మూలాలు[మార్చు]
- ↑ "Kashmora 2 days box office collection : Karthi's film collects 25 crore within 2 days". Ibtimes. Retrieved on 31 October 2015.
- ↑ "Kashmora 2 days box office collection : Karthi's film collects 25 crore within 2 days". Ibtimes. Retrieved on 31 October 2015.
- ↑ http://www.newindianexpress.com/entertainment/review/2016/oct/29/kashmora-review-second-half-makes-up-for-downer-first-1532926.html