Jump to content

కిన్నెరసాని పాటలు

వికీపీడియా నుండి

కిన్నెరసాని పాటలు కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణచే రచింపబడిన గేయకావ్యము.

విషయ సూచిక

[మార్చు]
  1. కల్పన
  2. కిన్నెర పుట్టుక
  3. కిన్నెర నడకలు
  4. కిన్నెర నృత్యము
  5. కిన్నెర సంగీతము
  6. కడలి పొంగు
  7. కిన్నెర దుఃఖము
  8. గోదావరీ సంగమము
  9. కిన్నెర వైభవము

నేపథ్యము

[మార్చు]

ఇతివృత్తం

[మార్చు]

గోదావరిలో కలిసిపోయే ఒక వాగు కిన్నెరసాని. కవి ఈ వాగును ఒక గొప్పంటి గృహిణిగా ఊహిస్తున్నాడు. ఆమెకు కూడా అత్తాకోడళ్ళపోట్లాట తప్పింది కాదు. భర్త మీద ప్రేమను ఒదులుకోక అత్తమీద పెత్తనం చలాయించలేక ఏమీ చేయలేని ప్రియుడ్ని వదలి కోపంతో కిన్నెర అడవుల వెంట పరుగెడుతుంది. తన ప్రియురాల్ని వెదుకుతూ తుదకు ప్రేమతాపంతో ఇద్దరూ కలుసుకొని ఒకరి ఎడబాటును ఇంకొకరు సహించలేకపోతారు. అపుడు అతను శోకించి శోకించి ఆమెను విడిచి కొండగా (రాయి)మారతాడు. ఆ సమయంలో కిన్నెరసాని తొడిమలేని పువ్వులా, మిక్కిలి సిగ్గుగల రాచకన్నెలా, కాంతిలేని రత్నంలా నడుస్తుంది. రాయిలా పడివున్న భర్తను విడువలేక సాగుతుంది కిన్నెరసాని వగపు తీగలా తిరుగుతుంది. తాను కూడా రాయిని కాలేక నదిని అయినందుకు లోలోపల దిగులు చెందుతుంది. విషాద గీతికల్లా శబ్దం చేస్తూ నడుస్తుంది. ఒకచోట నిలబడలేక అటుఇటు ఉరుకుతుంది. పోనీ తిరిగి కిన్నెరసానిగా ప్రవహించ వలెనని భావిస్తుంది. ఆ కోరిక ఆవహించగా తనను విడిచి భర్త ఉండలేడని, ఇక చెలిమి లేదని తలపోస్తుంది. అటువంటి భర్తతో కాపురం లేనందుకు వగస్తుంది, ఏడుస్తుంది కిన్నెరసాని. జలదేవతలు వచ్చి కిన్నెరసానిని పదమని బలవంత పెట్టగా పతిని వదలలేక వదలలేక కదలిపోతుంది. కిన్నెరసానిని చూచి కడలిరాజు మోహించి ఉప్పొంగుతాడు. కిన్నెరసాని తను తొందరపాటును, తెలివితక్కువ తనాన్ని తలచుకుని భోరున విలపిస్తుంది. ఆమె ఏడుపును చూసి అడవిలోని ఎలుగులు, పులుగులు, మృగములు, గాలులు రోదిస్తాయి. ఈ వార్త విని గోదావరి కరిగిపోయి తన కెరటాలను చాచి కిన్నెరసానిని ఆదుకుని కడలిరాజు నీ జోలికి రాడు అని అభయమిస్తుంది. గోదావరీనది ఆశ్రయంలో కిన్నెరసాని తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుంది.

పత్రికాభిప్రాయాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇవికూడా చదవండి

[మార్చు]
  1. | విశ్వనాథ సత్యనారాయణ స్వీయగానంలో కిన్నెరసానిపాటలు
  2. | ఆంధ్రభారతిలో కిన్నెరసాని పాటలు పూర్తి పాఠ్యం
  3. | కస్తూరి మురళీకృష్ణ బ్లాగు రాతలు కోతలులో కిన్నెరసానిపాటలు గేయకావ్యంపై విశ్లేషణ