కిరణ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరణ్ కుమార్‌

కిరణ్ కుమార్ నగల వ్యాపారి, లలితా జ్యువెలర్స్ అధినేత. లలితా జ్యువెలర్స్ వ్యాపార ప్రకటనల్లో కనిపిస్తూ పేరుపొందాడు. ర‌జినీకాంత్ హీరోగా 2014లో వచ్చిన లింగ సినిమాలోనూ కిర‌ణ్ కుమార్ నటించి ఆక‌ట్టుకున్నారు.[1]

బాల్యం[మార్చు]

నెల్లూరు నగరంలో మూల్ చంద్ జైన్, సుశీలాబాయి దంపతులకు కిరణ్ కుమార్ జన్మించాడు. తల్లిదండ్రుల ఎనిమిదిమంది సంతానంలో అందరికన్నా అతనే చిన్నవాడు. ఎనభై సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి వలసవచ్చి నెల్లూరులో స్థిరపడ్డ కుటుంబం వారిది. బంగారు నగల తయారీ కేంద్రమైన నెల్లూరులో కిరణ్ తండ్రి మూల్ చంద్ బంగారు పనివాడిగా పనిచేసేవాడు. కుటుంబ స్థితిగతుల వల్ల బాల్యంలో ఒకపూట తింటే, మరోపూట తినలేని కటిక దారద్ర్యాన్ని అనుభవించాడు. బడి చదువుతో ప్రారంభించినా అతనికి ఆసక్తి లేక చదువు కొనసాగించలేదు. ఐదవ తరగతితో చదువు మానేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

బాలకార్మికుడిగా[మార్చు]

తొమ్మిది సంవత్సరాలకే చదువు మానుకున్న కిరణ్ కుమార్ తోటి పిల్లలు కొందరిని చూసి వారితో పాటుగా బంగారు దుకాణాల్లో బాలకార్మికుడిగా పనిచేయసాగాడు. అలా కొన్నాళ్ళు పనిచేసి నైపుణ్యం సాధించాడు.

వ్యాపార ప్రయత్నాలు[మార్చు]

పన్నెండు సంవత్సరాల వయసులో అతనికి నెల్లూరు బంగారు దుకాణాల్లో తయారుచేసిన నగలను చెన్నై, కేరళలోని పలు నగరాల్లో దుకాణాలకు హోల్ సేల్ గా అమ్ముతారని తెలిసింది. తాను కూడా హోల్ సేల్ వ్యాపారస్తుడిని కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంట్లో వెతికి చూస్తే కిరణ్ తల్లి సుశీల జాగ్రత్తగా దాచుకున్న నాలుగు బంగారు గాజులు మాత్రమే కనిపించాయి. ఎవరికీ చెప్పకుండా వాటిని తీసుకువెళ్ళి కరిగించగా వచ్చిన 65 గ్రాముల బంగారంతో కొన్ని జుమ్కీలు తయారుచేశాడు. ఆ కాస్త ఆభరణాలు తీసుకుని చెన్నై వెళ్ళి, తాను నెల్లూరులో అందరినోట పేరు విన్న లలితా జ్యువెలర్స్ షాపుకు వెళ్ళిపోయాడు. అప్పటి లలితా జ్యువెలర్స్ అధినేత కందస్వామికి ఆ జుమ్కీలు అమ్మజూపితే, రోజుకు కిలోల లెక్కన బంగారం కొని అమ్ముతూండే అతనికి నవ్వు వచ్చింది. ఆ వెనుకే చిన్న పిల్లాడి తాపత్రయానికి ముచ్చట పడ్డాడు. నిరుత్సాహపరచకుండా వీటిని పరీక్షించి కొనుక్కుంటాను రేపు రమ్మని పంపేశాడు.

ఆరోజు జరిగిన సంగతి ఇంట్లో చెప్పడంతో తండ్రి ఆగ్రహోదగ్రుడయ్యాడు. తల్లి మాత్రం ఆ కాస్తే ఇంట్లో మిగిలిన చివరి బంగారు తునకలని, దాని విషయంలో ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకొమ్మని అతనికే నిర్ణయాన్ని వదిలివేసింది.

హోల్ సేల్ వ్యాపారం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ల‌లితా జ్యుయ‌ల‌రీస్ య‌జ‌మాని ర‌జినీకాంత్ సినిమాలో తెలుసా..?". Manam News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-27. Retrieved 2022-06-05.