Jump to content

కిల్లంపల్లి శ్రీనివాసరావు

వికీపీడియా నుండి

కిల్లంపల్లి శ్రీనివాసరావు (కె.శ్రీనివాసరావు గా సుపరిచితులు) (Killampalli Srinivasarao)సైద్దాంతిక గణిత భౌతికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్.[1] ఆ సంస్థ 1962లో స్థాపించబడినది. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లాడి రామకృష్ణన్.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన పూర్వీకులు రాజమండ్రి వాస్తవ్యులు. ఆయన తండ్రి కె.వల్లభేశ్వర రావు (1899-1983) చెన్నైలో ప్రఖ్యాత న్యాయవాదిగా ఉండేవారు. ఆయన తండ్రి తన పోస్టుగ్రాడ్యుయేట్ చదువుల నిమిత్తం చెన్నై వచ్చి స్థిరపడ్డారు. శ్రీనివాసరావు తల్లి లక్ష్మీకాంతమ్మ తెలుగు సాహిత్యం లో ప్రముఖ సేవలనందించారు. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్నవాడు శ్రీనివాసరావు.

ఆయన చెన్నై నందలి ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎస్.సి ని 1964 లో పూర్తి చేసారు. ఆయన పరమాణువులోని కేంద్రకంలోని పైయాన్ ఫోటో ప్రొడక్షన్ అనే అంశంపై అల్లాడి రామకృష్ణన్ నేతృత్వంలో పి.హెచ్.డి చేసారు. అదే 1972లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందారు. అదే సంవత్సరం ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ లో సభ్యునిగా చేరి నవంబరు 2002 లో పదవీవరమణ పొందిన వరకు తన సేవలనందించారు.[2]

కెరీర్

[మార్చు]

ఆయన మూడు దశాబ్దాలకు పైగా (1972-2002) ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ (చెన్నై) లో పనిచేసి, సీనియర్ ప్రొఫెసరుగా పదవీవిరమణ చేసారు. గణిత శాస్త్రంలోని స్పెషల్ ఫంక్షన్స్, క్యు-సిరీస్, గ్రూప్ థియరీ ఆల్జీబ్రాస్, కంప్యూటరు ఆల్జీబ్రా అంశాలమీద శ్రీనివాస రామానుజన్ రాసిన నోట్‌బుక్స్ మీద పరిశోధనలు చేసారు. యూనివర్శిటీ ఆఫ్ బాన్ లోని అలెగ్జాండర్ వోస్ హంచోలెడ్జ్ ఫౌండేషన్ ఫెలో, కెనడా, యూరప్, జపాన్,అమెరికా దేశాలలోని పలు యూనివర్శిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్. అంతర్జాతీయ ప్రముఖ పత్రికలలో, అనేక గణిత శాస్త్ర సంబంధిత వ్యాసాలు, పరిశోధనా పత్రాలను వెలువరించారు. "క్వాంటం థియరీ ఆఫ్ యాంగ్యులర్ మోమెంటం, సెలెక్టెడ్ టాపిక్స్" మొదలైన పుస్తకాలను రచించారు. కొన్ని పుస్తకాలకు సహ రచయితగా ఉన్నారు. "జర్నల్ ఆఫ్ కంప్యూటేషనల్ అండ్ అప్లయిడ్ మేథమెటిక్స్" మొదలైన గణితశాస్త్ర ప్రత్యేక పత్రికలు వెలువరించిన మెమోరియల్ గ్రంథ సంపుటాలకు సంపాదకత్వం వహించారు.[3]

శ్రీనివాస రామానుజన్-ఎ మాథమెటికల్ జీనియస్

[మార్చు]

ఆయన 1998లో "శ్రీనివాస రామానుజన్ - ఎ మాథెమెటికల్ జీనియస్" అనే గ్రంథాన్ని రచించారు. ఈ పుస్తకం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఈ గ్రంథాన్ని 2004, డిసెంబరులో మరింతగా పరిష్కరించి విస్తరించి పునర్ముద్రించారు. శ్రీనివాస రామానుజన్ సంబంధించిన జీవిత విశేషాలు, పరిశోధనా వివరాలు అనేకంతో పాటు అమూల్యమైన అరుదైన ఛాయాచిత్రాలు కూడా ఈ గ్రంథంలో స్థానం సంపాదించుకున్నాయి. ఆయన "రామానుజన్ మ్యూజియం అండ్ మాథ్స్ ఎడ్యుకేషన్ సెంటర్"(రాయపురం,చెన్నై) డైరక్టరుగా ఉన్నారు.[4]

రచయితగా

[మార్చు]

ఆయన మూడు పుస్తకాలను రచించారు. ఆయన ఎనిమిది పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. అంతర్జాతీయ జర్నల్స్ లో 57 ఆర్టికల్స్ ను, భారతీయ జర్నల్స్ లో 43 పత్రాలను ప్రచురించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Professional Experience of Dr. K. Srinivasa Rao". imsc.res.in/. Retrieved 12 May 2016.
  2. 2.0 2.1 2.2 "K. Srinivasa Rao and his work". sciencedirect.com/. Retrieved 12 May 2016.
  3. ఆంధ్ర శాస్త్రవేత్తల్జు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. 1 August 2011. p. 107.
  4. "Life of Srinivasa Ramanujan1". imsc.res.in/. K. Srinivasa Rao. Retrieved 12 May 2016.

ఇతర లింకులు

[మార్చు]