కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం
కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
సమీప నగరం | కిష్ట్వర్, జమ్మూ కాశ్మీర్ |
విస్తీర్ణం | 400 చ. కి.మీ. |
స్థాపితం | ఫిబ్రవరి4, 1981 |
కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వర్ జిల్లాలో ఉంది. ఈ జిల్లా పేరు నుంచే ఈ ఉద్యనవనాన్నికి కిష్ట్వర్ అని నామకరణం చేశారు.
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని ఫిబ్రవరి 4, 1981 న జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 400 చదరపు కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. దీని పరీవాహక ప్రాంతంలో కాశ్మీరీలు, ఠాకూర్లు, గుజార్లు, రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు నివసిస్తుంటారు.[1]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనం ఉత్తరాన రిన్నే నది, దక్షిణాన కిబార్ నాలా, తూర్పున గ్రేట్ హిమాలయాలు, పశ్చిమాన మార్వా నది ఉన్నాయి. ఈ ఉద్యానవన భూభాగం కఠినమైన, నిటారుగా ఇరుకైన లోయలతో ఉంటుంది. ఈ ప్రాంతం గ్రేట్ హిమాలయాల సెంట్రల్ స్ఫటికాకార బెల్ట్‌లో ఉంది. ఈ ఉద్యానవనం కియార్ నాథ్, కిబార్ నాలాస్ పరీవాహక ప్రాంతాలలో ఉంది. ఇవన్నీ నైరుతి దిశలో ఉన్న మార్వా నదిలోకి ప్రవహిస్తాయి. ఇవ్వన్నీ కలిసి చినాబ్ నదిలో కలుస్తాయి. ఈ ఉద్యానవనంలో మంచు ప్రాంతాల్లో నివసించే హిమాలయ స్నోకాక్, బ్రౌన్ ఎలుగుబంట్లు వంటి ఎన్నో రకాల జంతువులు సంరక్షించబడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం. "Kishtwar National Park". natureconservation.in. Archived from the original on 29 సెప్టెంబరు 2019. Retrieved 29 September 2019.