కిస్ ఆఫ్ లవ్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
నైతిక విలువల పరిరక్షణ పేరుతో యువమోర్చాకు చెందిన కొందరు వ్యక్తులు కోజికోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ప్రేమికులపై విచక్షణా రహితంగా దాడిచేయడాన్ని నిరసిస్తూ 2014, నవంబరు 2న కొచి మొరైన్ తీరంలో మొదలైన యువతీ యువకుల ఉద్యమమే కిస్ ఆఫ్ లవ్. ఆ సందర్భంగా అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు గాఢంగా కౌగలించుకొని ముద్దులు పెట్టుకున్నారు. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం కాదు. అయితే అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. దీంతో తాము చట్ట ప్రకారం నడుచుకోవాలా.. లేక భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలా.. ‘కిస్ ఆఫ్ లవ్’ వారికి సపోర్‌ట చేయాలా.. లేక శ్రీరామ సేన, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్ధతివ్వాలా.. అర్థం కాక హోం శాఖ తలపట్టుకుంది.
2014 లో కర్ణాటక మహిళా కమిషన్ 'కిస్ ఆఫ్ లవ్' ను అనాగరికమైన అటవీక చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ప్రదర్శనను అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై కర్ణాటక మహిళా కమిషన్ చైర్ పర్సన్ మంజులా మానస "కొన్ని ప్రవర్తనలు మనుషులకు, జంతువులకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తాయి. ఆ వ్యత్యాసాన్ని మనుషులు పాటించాలి. నైతిక విలువల పరిరక్షణకు వ్యతిరేకంగా వీధులలో బహిరంగంగా వీళ్ళు చేస్తున్న ముద్దుల ప్రదర్శన అర్ధరహితమైనది. ఎంతో పవిత్రమైన ముద్దును వీళ్ళు బజారుకీడుస్తున్నారు. ఇదొక అసభ్యకరమైన ప్రచారధోరణి. ఈ ధోరణిని కనుక నిరోధించకపోతే సభ్య సమాజపు పునాదులే కదిలిపోతాయి" అని ఆవేదన వెళ్లబుచ్చారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఈ సంఘటన సంఘవిద్రోహ చర్య కాదని, దీన్ని నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు [1]
(వ్యాసం విస్తరణలో ఉన్నది)
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి దిన పత్రిక, అస్త్ర ఫ్యామిలీ పేజీ, నవంబర్ 24, 2014