కీత్ థామ్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీత్ థామ్సన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1941-02-26)1941 ఫిబ్రవరి 26
మెత్వెన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2023 జనవరి 26(2023-01-26) (వయసు 81)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులుబిల్ థామ్సన్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1968 ఫిబ్రవరి 22 - ఇండియా తో
చివరి టెస్టు1968 ఫిబ్రవరి 29 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1959/60–1974/75కాంటర్బరీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 71 3
చేసిన పరుగులు 94 3134 40
బ్యాటింగు సగటు 31.33 28.23 13.33
100s/50s 0/1 5/15 0/0
అత్యధిక స్కోరు 69 136* 26
వేసిన బంతులు 21 511 48
వికెట్లు 1 5 1
బౌలింగు సగటు 9.00 49.20 22.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/9 1/9 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 35/– 0/–
మూలం: Cricinfo, 2023 మే 22

కీత్ థామ్సన్ (1941, ఫిబ్రవరి 26 - 2023, జనవరి 26) న్యూజీలాండ్ మాజీ క్రికెట్, హాకీ క్రీడాకారుడు. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 1968లో రెండు క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లు, 1961 - 1971 మధ్యకాలంలో 28 హాకీ టెస్టులు ఆడాడు. క్రికెట్, హాకీ క్రీడల్లో అంపైర్‌గా పనిచేశాడు.

క్రికెట్ కెరీర్[మార్చు]

మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా బ్యాటింగ్ లో రాణించాడు.[1] కాంటర్‌బరీ తరపున 1959-60 నుండి 1973-74 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1966-67లో ప్లంకెట్ షీల్డ్‌లో రెండు సెంచరీలు కొట్టాడు. పర్యాటక ఆస్ట్రేలియన్ XI కి వ్యతిరేకంగా న్యూజీలాండ్ తరపున మొత్తం నాలుగు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు.

థామ్సన్ 1967-68 సీజన్‌లో క్రైస్ట్‌చర్చ్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా తన టెస్టు అరంగేట్రం చేసాడు. అక్కడ 69 పరుగులు చేశాడు (గ్రాహం డౌలింగ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించాడు). టెస్టుల్లో న్యూజీలాండ్ నాలుగో విజయంలో 0 నాటౌట్ గా ఉన్నాడు.[2] రెండవ, చివరి టెస్ట్ ఒక వారం తర్వాత వెల్లింగ్టన్‌లో 25 పరుగులు, 0 పరుగులు చేసాడు.[3]

1968-69లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌పై కాంటర్‌బరీ తరపున 136 నాటౌట్ గా నిలిచి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన అత్యధిక స్కోరు సాధించాడు. చక్కటి ఫీల్డ్స్‌మన్, వికెట్‌కు దగ్గరగా మంచి క్యాచర్.[1]

థామ్సన్ తరువాత అంపైర్ అయ్యాడు. 1983-84, 1986-87 మధ్య 13 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 11 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో నిలిచాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "The Thomson Tales". Sydenham CC. Retrieved 11 May 2021.
  2. "2nd Test, Christchurch, Feb 22 - 27 1968, India tour of New Zealand". ESPNcricinfo. Retrieved 12 May 2021.
  3. "3rd Test, Wellington, Feb 29 - Mar 4 1968, India tour of New Zealand". ESPNcricinfo. Retrieved 12 May 2021.
  4. "Keith Thomson as Umpire in First-Class Matches". CricketArchive. Retrieved 11 May 2021.
  5. "Keith Thomson as Umpire in List A Matches". CricketArchive. Retrieved 11 May 2021.

బాహ్య లింకులు[మార్చు]