శతపది
(కీలోపోడా నుండి దారిమార్పు చెందింది)
శతపాదులు Temporal range: Silurian - Recent
| |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | కీలోపోడా Latreille, 1817
|
Orders and Families | |
See text |
శతపాదులు (ఆంగ్లం Centipede) (from లాటిన్ prefix centi-, "నూరు", and గ్రీకు ποδός podos, "పాదం") ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జంతువులు. ఇవి మిరియాపోడా ఫైలమ్ లోని కీలోపోడా తరగతికి చెందినవి. వీటిని జెఱ్ఱి అని కూడా పిలుస్తారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 జాతుల శతపాదులున్నట్లు అంచనా.[1] వీటిలో సుమారు 3,000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ఇవి విస్తృతంగా ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఉష్ణమండలం, ఎడారి వాతావరణంలోనూ నివసిస్తాయి.[2] వీటికి తేమ చాలా అవసరం. అందువలన ఇవి ఎక్కువగా భూమిలోపల, రాళ్ళక్రింద నివసిస్తాయి.
కొన్ని శతపాదులు మానవులకు హాని కలిగిస్తాయి. అయితే వీటికాటు వలన నొప్పి కలుగుతుంది. కొందరికి ఎలర్జీ వస్తుంది. సామాన్యంగా ప్రాణహాని ఉండదు.
సామాన్య లక్షణాలు
[మార్చు]- శతపాదులు పొడవుగా సన్నగా ఉండే జీవులు. ఇవి కొన్ని మిల్లీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.
- వీటి దేహం తల, మొండెంగా విభజితమై ఉంటుంది.
- తలలో ఒక జత స్పర్శశృంగాలు, రెండు జతల జంభికలు, ఒక జత హనువులు ఉంటాయి. రెండవ జత హనువులు విలీనం చెందడం వలన అధరం ఏర్పడుతుంది.
- ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళుంటాయి. (సహస్రపాదులకు రెండు జతలుంటాయి)
- శతపాదులన్నింటికీ మొదటి ఖండితంలో ఒక జత విషపు నఖాలు (venom claws) ఉంటాయి.
- విసర్జకాంగాలు - మాల్పీజియన్ నాళికలు.
మూలాలు
[మార్చు]Look up శతపది in Wiktionary, the free dictionary.