కుంకలగుంట సైదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుంకలగుంట సైదులు నాదస్వర విద్వాంసుడు.[1] అతను మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో నాదస్వరవిద్వాంసునిగా పనిచేసాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో నబీసాహెబ్ ,మీరాబీ దంపతులకు 1912 అక్టోబరు 4న న జన్మించాడు. నాదస్వరంలో తండ్రి, తాత, చిలకలూరిపేట పెద మౌలా సాహెబ్ ,మద్రాసు కదిరివేలు వద్ద శిక్షణ పొందాడు. మంచి తాళ పరిజ్ఞానము కలిగి, నడకలు, పల్లవులు తయారు చేసి పంచటంలో నిష్ణాతుడయ్యాడు. "సింహతలాటం" పొందాడు. నందిగామ లాల్ సాహెబ్ ,కుంకలగుంట లాల్ సాహెబ్ ఇతని శిష్యులలో ముఖ్యమైనవారు. నాదస్వర కళలో సువర్ణ కంకణ గ్రహీత పందలపాడు సైదులు కూడా ఇతని వద్దనే విద్యనభ్యసించాడు.

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్రభారతి - తెలుగువారి మంగళవాద్య కళావైభవం - డాక్టర్‌ భూసురపల్లి వేంకటేశ్వరరావు - తానా 2006 చైతన్యస్రవంతి". www.telugubharati.com. Retrieved 2020-06-06.