అక్షాంశ రేఖాంశాలు: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695

కుండలేశ్వరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుండలేశ్వరస్వామి దేవాలయం
కుండలేశ్వరస్వామి దేవాలయం is located in Andhra Pradesh
కుండలేశ్వరస్వామి దేవాలయం
కుండలేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :కుండలేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:కుండలేశ్వరం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కుండలేశ్వరస్వామి దేవాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

కుండలేశ్వరస్వామి దేవాలయం, తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలం, కుండలేశ్వరంలో ఈ దేవాలయం ఉంది.

స్థల పురాణం

[మార్చు]

కవి స్వారభౌముడైన శ్రీనాధమహాకవి తన భీమ ఖండం (భీమేశ్వరపురాణం)లో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు. గౌతమీ మహత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది.అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టుగా ఉంది. నారదా తో కోటిపల్లిలో సోమేశ్వరుడుగాక దక్షిణ భాగం నుంచి గౌతమముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రంకేసి వెళుతోంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున వుంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో “మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవున్ని భేదించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నింటికి నాధుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యంలను కుండలాలను ఒక పశ్ళెంలో వుంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమీ నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమీనది కరిగిపోయి, సముద్రుని కోరికమేరకు తన వేగాన్ని తగ్గించుకుని, అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కరసమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తోంది[1][2]

మూలాలు

[మార్చు]
  1. నాగిరెడ్డి, ఎన్. ఎస్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు. 2003.
  2. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.

వెలుపలి లంకెలు

[మార్చు]