కుబ్రా సెయిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుబ్రా సెయిట్
2019 జీ సినిమా అవార్డుల కార్యక్రమంలో కుబ్రా
జననం (1983-07-27) 1983 జూలై 27 (వయసు 40)
వృత్తి
  • నటి
  • TV హోస్ట్
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సేక్రేడ్ గేమ్స్ (టీవీ సిరీస్)
బంధువులుడానిష్ సెయిట్ (సోదరుడు)
తన్వీర్ సెయిట్ (అంకుల్)

కుబ్రా సెయిట్ (ఆంగ్లం: Kubbra Sait) ఒక భారతీయ మోడల్, సినీ నటి, టీవీ హోస్ట్‌.[1] ‘సేక్రేడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో ఫేమ్ సంపాదించుకున్నారు.[2] అనేక వ్యక్తిగత విశేషాలతో కుబ్రా సెయిట్ ‘‘ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్’ (Open Book: Not Quite A Memoir) టైటిల్‌తో పుస్తకాన్ని రాశారు.

ప్రారంభ జీవితం, వృత్తి[మార్చు]

1983 జూలై 27న బెంగుళూరులో కుబ్రా సెయిట్ జన్మించారు. ఆమె తండ్రి జకరియా సెయిట్, తల్లి యాస్మిన్ సెయిట్. ఆమె తమ్ముడు డానిష్ సెయిట్ రేడియో జాకీ, టెలివిజన్ హోస్ట్. బెంగుళూరులోని 2005లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత కుబ్రా సెయిట్ దుబాయ్‌కి వెళ్లింది. ఆమె పదమూడేళ్ల వయసులో షోలను హోస్ట్ చేయడం ప్రారంభించింది.

ఆమె వినోద పరిశ్రమలో తన వృత్తిని కొనసాగించే ముందు దుబాయ్‌లో మైక్రోసాఫ్ట్‌లో అకౌంట్స్ మేనేజర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె 2013లో భారతదేశపు ఉత్తమ మహిళా ఎమ్సీ అవార్డును గెలుచుకుంది.[3] ఆమె 2009లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ బ్యూటీ పోటీలో మిస్ పర్సనాలిటీని కూడా గెలుచుకుంది.

కుబ్రా సెయిట్ మోడల్, TV హోస్ట్ గానే కాకుండా సుల్తాన్, రెడీ, సిటీ ఆఫ్ లైఫ్ చిత్రాలలో కనిపించింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షో సేక్రేడ్ గేమ్స్ మొదటి సీజన్‌లో కుకూ పాత్రలో ఆమె నటనకు విస్తృత గుర్తింపు పొందింది.[4] ఆమె Apple TV+ షో ఫౌండేషన్‌లో ఫారా కీన్ పాత్రను కూడా పోషించింది.[5]

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 47వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా విభాగంలో నామినేట్ చేయబడింది. 25 నవంబర్ 2019న జరిగిన ఎమ్మీ అవార్డ్స్‌లో కుబ్రాసెయిట్ సేక్రెడ్ గేమ్స్ కు ప్రాతినిధ్యం వహించింది.[6][7]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Title Role Notes Ref.
2011 రెడీ సునైనా
2012 జోడి బ్రేకర్స్ వినీత [8]
2015 ఐ లవ్ NY విద్యా సక్సేనా [9]
2016 సుల్తాన్ వ్యాఖ్యాత
2019 గల్లీ బాయ్ స్కార్లెట్ [10]
2020 జవానీ జానేమన్ రియా
2020 డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే షాజియా [11]
2022 ఆర్కే సీమ

మూలాలు[మార్చు]

  1. "Lucky break for Kubbra Sait in Zoya Akhtar's Gully Boy". Mumbai Mirror. Archived from the original on 3 October 2018. Retrieved 2018-07-08.
  2. "Priyanshu Painyuli was in talks to play Kubbra Sait's Kukoo in Sacred Games, reveals why he didn't make the cut". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-06-16. Retrieved 2021-10-21.
  3. "Netflix's Sacred Games: Who is Kubbra Sait?". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-08. Archived from the original on 8 July 2018. Retrieved 2018-07-08.
  4. "Kubbra Sait, who is stealing the limelight as Cuckoo in Saif Ali Khan-starrer Sacred Games - see photos" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 8 July 2018. Retrieved 2018-07-08.
  5. Tanushree Roy (June 29, 2021). "Kubbra Sait grabs all the attention in Apple TV's Foundation trailer. Twitter explodes". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-10-21.
  6. "Kubbra Sait To Represent Sacred Games At Emmys, Is Convinced She'll Return Home With A Trophy". indiatimes.com (in ఇంగ్లీష్). 2019-11-20. Archived from the original on 20 November 2019. Retrieved 2019-11-20.
  7. Mitchell, Molli (8 July 2018). "Sacred Games on Netflix: Who is Kubbra Sait? Who is the actress that plays Cuckoo?". Archived from the original on 12 October 2020. Retrieved 3 October 2018.
  8. "Kubra Sait gears up for Bollywood". The Times of India. Archived from the original on 24 September 2018. Retrieved 14 July 2018.
  9. "Why is Kubra upset?". The Tribune. Archived from the original on 12 October 2020. Retrieved 14 July 2018.
  10. "Lucky break for Kubra Sait in Zoya Akhtar's Gully Boy". Mumbai Mirror. Archived from the original on 8 July 2018. Retrieved 8 July 2018.
  11. "Kubbra Sait joins cast of Dolly Kitty Aur Woh Chamakte Sitare, starring Bhumi Pednekar, Konkona Sen Sharma". 26 October 2018. Archived from the original on 24 December 2018. Retrieved 17 February 2019.