కుబ్రా సైత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుబ్రా సైత్
జీ సినీ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో కుబ్రా సైత్
జననం (1983-07-27) 1983 జూలై 27 (వయసు 40)
వృత్తి
  • నటి
  • టీవీ హోస్ట్
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సేక్రేడ్ గేమ్స్ (టీవీ సిరీస్)
బంధువులుడానిష్ సైత్ (సోదరుడు)
తన్వీర్ సైత్ (మామ)
అజీజ్ సైత్ (తాత)

కుబ్రా సైత్ (ఆంగ్లం: Kubbra Sait) భారతీయ నటి, టీవీ హోస్ట్, మోడల్.[1] సుల్తాన్ (2016), రెడీ (2011), సిటీ ఆఫ్ లైఫ్ చిత్రాలలో నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షో సేక్రెడ్ గేమ్స్‌ మొదటి సీజన్‌లో కుకూ పాత్రలో ఆమె నటనకు విస్తృత గుర్తింపు పొందింది.[2] ఆమె ఆపిల్ టీవీ+ షో ఫౌండేషన్‌లో ఫారా కీన్ పాత్రను కూడా పోషించింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

కుబ్రా సైత్ బెంగుళూరులో జకరియా సైత్, యాస్మిన్ సైత్ దంపతులకు జన్మించింది. ఆమె తమ్ముడు డానిష్ సైత్ రేడియో జాకీ, టెలివిజన్ హోస్ట్. ఆమె మామ తన్వీర్ సైత్ రాజకీయ నాయకుడు. ఆమె తాత అజీజ్ సైత్ కర్ణాటకలో మంత్రిగా ఉన్నాడు. 2005లో, బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

కెరీర్[మార్చు]

ఆ తర్వాత ఆమె దుబాయ్‌కి వెళ్లింది. ఆమె పదమూడేళ్ల వయసులో టీవీ షోలను హోస్ట్ చేయడం ప్రారంభించింది. అయితే ఆమె దీనికి ముందు మైక్రోసాఫ్ట్‌లో అకౌంట్స్ మేనేజర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె 2013లో భారతదేశపు ఉత్తమ మహిళా ఎమ్మెస్సీ అవార్డును గెలుచుకుంది.[4] ఆమె 2009లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ బ్యూటీ పేజెంట్‌లో మిస్ పర్సనాలిటీని కూడా గెలుచుకుంది. నెట్‌ఫ్లిక్స్ షో సేక్రెడ్ గేమ్స్‌లో కుకూ అనే లింగమార్పిడి మహిళగా ఆమె పాత్రకు ఆమె ప్రశంసలు అందుకుంది.[5] నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 47వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా విభాగంలో నామినేట్ చేయబడింది. 2019 నవంబరు 25న జరిగిన ఎమ్మీ అవార్డ్స్‌లో ఆమె సేక్రేడ్ గేమ్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.[6][7]

మూలాలు[మార్చు]

  1. "Lucky break for Kubbra Sait in Zoya Akhtar's Gully Boy". Mumbai Mirror. Archived from the original on 3 October 2018. Retrieved 8 July 2018.
  2. "Priyanshu Painyuli was in talks to play Kubbra Sait's Kukoo in Sacred Games, reveals why he didn't make the cut". Hindustan Times (in ఇంగ్లీష్). 16 June 2021. Retrieved 21 October 2021.
  3. Tanushree Roy (29 June 2021). "Kubbra Sait grabs all the attention in Apple TV's Foundation trailer. Twitter explodes". India Today (in ఇంగ్లీష్). Retrieved 21 October 2021.
  4. "Netflix's Sacred Games: Who is Kubbra Sait?". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 8 July 2018. Archived from the original on 8 July 2018. Retrieved 8 July 2018.
  5. "Kubbra Sait, who is stealing the limelight as Cuckoo in Saif Ali Khan-starrer Sacred Games - see photos" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 8 July 2018. Retrieved 8 July 2018.
  6. "Kubbra Sait To Represent Sacred Games At Emmys, Is Convinced She'll Return Home With A Trophy". The Times of India (in ఇంగ్లీష్). 20 November 2019. Archived from the original on 20 November 2019. Retrieved 20 November 2019.
  7. Mitchell, Molli (8 July 2018). "Sacred Games on Netflix: Who is Kubbra Sait? Who is the actress that plays Cuckoo?". Archived from the original on 12 October 2020. Retrieved 3 October 2018.