Jump to content

కురోవ్

వికీపీడియా నుండి


కురోవ్ (Kurów) పోలండు దేశంలో ఆగ్నేయ భాగమందున్న ఓ గ్రామం. ఇది పులవి, లుబ్లిన్ లమధ్య కురోవ్కా నది ఒడ్డున ఉంది. 2005 లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 2811 మంది నివసిస్తున్నారు.

మగ్దెబర్గ్ చట్టం ప్రకారం 1431, 1442 మష్య కాలంలో దీనికి నగర హోదా లభించింది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఆహార పదార్థాల కేంద్రంగాను, ఉన్ని, తోలు వస్తువుల ఉత్పత్తి కేంద్రంగాను ఉండేది.

రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభంలో 1939 సెప్టెంబర్ 9 న జర్మను వాయుసేన ఈ నగరంపై బాంబుల వర్షం కురిపించింది. యుద్ధ కాలంలో జర్మనీ ఇక్కడ బానిస కూలీల శిబిరాలను (కాన్సెంట్రేషన్ కాంపులు) నిర్వహించింది.

పోలండు పూర్వపు అధ్యక్షుడు జనరల్ వోజ్ఝెక్ యరుజల్‌స్కీ ఇక్కడే పుట్టాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=కురోవ్&oldid=3720927" నుండి వెలికితీశారు