కులశేఖర మహీపాల చరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కులశేఖర మహీపాల చరిత్రము శేషము రఘునాధాచార్య రచించిన పుస్తకము. ఇది 1955 ముద్రించబడినది.

పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’ (వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట.నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు. శేషము రఘునాథార్యులు ఈ గ్రంథంలో ఆ మహాభక్తుని జీవితాన్ని తెలిపారు.

మూలాలు[మార్చు]