కుల్వంత్ రామ్ బాజిగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుల్వంత్ రామ్ బాజిగర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014-2019
ముందు ఫూల్ సింగ్
తరువాత ఈశ్వర్ సింగ్
నియోజకవర్గం గుహ్లా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం సాహెబ్ (కొడుకు), సీరత్ (కుమార్తె)[1]
నివాసం హర్యానా

కుల్వంత్ రామ్ బాజిగర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుహ్లా నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కుల్వంత్ రామ్ బాజిగర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఎన్నికలలో గుహ్లా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. కుల్వంత్ రామ్ బాజిగర్ 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దిల్లు రామ్‌ని 2,222 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కుల్వంత్ రామ్ బాజిగర్ కు 36,598 ఓట్లతో 27.70 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి దిల్లు రామ్‌కు 34,158 ఓట్లతో 25.86 శాతం ఓట్లు వచ్చాయి. ఐఎన్‌ఎల్‌డీకి చెందిన బూటా సింగ్‌కు 32,334 ఓట్లతో 24.48 శాతం ఓట్లు వచ్చాయి.[3][4] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి దేవేందర్ హన్స్ చేతిలో 22,880 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (21 April 2016). "Haryana MLA, 38, takes Class XII exams with his children". Retrieved 28 October 2024.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. TV9 Bharatvarsh (8 October 2024). "Guhla Assembly Election Result 2024 Live, Haryana गुहला विधानसभा नतीजे लाइव in Hindi" (in హిందీ). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Hindustantimes (27 September 2019). "Haryana Assembly Polls: Kulwant Ram Bazigar, Guhla (reserved) MLA". Retrieved 28 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Guhla". Retrieved 27 October 2024.
  6. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)