కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుష్టువ్యాధిని, హేన్సన్ వ్యాధిగా పిలవబడే ఈ జబ్బును కనుక్కొని, చికిత్స చేయటం ఇప్పుడు చాలా సులువైనదిగా, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత సమర్ధవంతమైనదిగా పరిగణించబడుతుంది. 1983 నుండి బహుళఔషధచికిత్స ద్వారా నయం చేయటం సాధ్యం అయింది. ఈ చికిత్స భారతదేశ ఆరోగ్యకార్యక్రమాలలో విజయవంతంగా విలీనం చేయబడింది. అందువల్ల ఏటేటా కొత్తగా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కాని 2005 నుంచి ఆ తగ్గుదల అంతగా లేదు. 2014 నాటికి ప్రపంచంలో ఏటా కొత్తగా వచ్చే రోగుల్లో 58 శాతం భారతదేశం నుంచే వస్తున్నాయి. 2013-14 లోనే 1.27 లక్షల కొత్తరోగులు భారతదేశంలో కనుగొనబడ్డారు. ఈ సందర్భంలో లాకమిషను వారు వెలువరించిన 256 వ నివేదికను పరిశీలించాలి.

కుష్టువ్యాధిసోకిన వ్యక్తులపట్ల చూపే వివక్షను పూర్తిగా తొలగించాలి. అలా చేయటం వల్లనే భారతదేశం జరిపే కుష్టువ్యతిరేక పోరాటంలో నూతన అధ్యాయం ఆరంభం అవుతుంది. ఈ నివేదిక ముఖ్యంగా 2005 నుంచి ఈ కుష్టునిర్మూలన పధకంలో వైఫల్యాలను ఎత్తిచూపింది. రాజ్యాంగంలో ప్రతిపౌరునికి అందవలసిన ఆత్మాభిమానం, సమానత, స్వేచ్ఛల విషయంలో లా కమిషను నివేదిక స్పష్టమైన సిఫారసులు చేసింది.2010 లో ఐక్యరాజ్యసమితి కుష్టు సోకిన వారిపట్ల ఎటువంటి వివక్ష చూపగూడదని చేసిన తీర్మానం గురించి గుర్తు చేసింది. అంగవైకల్యాలు కలవారి హక్కులను గౌరవిస్తూ అంతర్జాతీయంగా 2007 లో చేసిన తీర్మానాలను అనుసరించి కూడా అది మన కర్తవ్యం. ఈ నివేదికలో ముఖ్యంగా ముచ్చటించింది సమాజం ఈ రోగబాధితుల పట్ల సమాజం చూపే చిన్నచూపు గురించే. న్యాయం చేయవలసిన చట్టాలే వీరి పట్ల వివక్షను చూపుతున్నాయి. కనుక అటువంటి చట్టాలను తొలగించాలి లేదా సవరించాలి. ఉదాహరణకు-1956 జీవితబీమాచట్టం వీరిపట్ల వివక్ష చూపుతుంది. కుష్టు సోకిన వ్యక్తికి ప్రాణప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక అధిక మొత్తం ప్రీమియం చెల్లించాలి అని చెపుతుంది. ఇంకా 1955 హిందూవివాహచట్టం, 1939 ముస్లిం వివాహరద్దు చట్టం వంటి వ్యక్తిగత చట్టాలు కూడా వివక్షను సమర్ధిస్తున్నాయి. కుష్టువ్యాధిని చికిత్సకు సాధ్యం కాని, తీవ్రమైన దానిలా పరిగణించాయి. వాళ్లకు అందవలసిన రక్షణలు అందకుండా ఈ చట్టాలు చేశాయి. కనుక ఈ రోగబాధితులను ఉద్యోగాలల్లో, విద్యాసంస్ధల్లో ప్రధాన జనవాహినిలో కలసిపోయేలా ఎటువం టి వివక్ష లేని చట్టాలు కావాలని చెప్పారు.

కాని వీరు చేసిన సిఫారసుల్లో కొన్ని విరుద్ధమైనవిగా కనుపించవచ్చు. కుష్టువ్యాధి బాధితులు ప్రత్యేకంగా, సమాజానికి దూరంగా కాలనీల్లో ఉంటున్నారు. వారి ఆధీనంలో గల ఆస్తులకు వారిని ఆ ఆస్తులకు యజమానులుగా, హక్కుదారులుగా చేయాలన్న సలహా. కాని ఈ కాలనీలు సమాజానికి దూరంగా వివక్షతో జీవనం గడపవలసిన పరిస్థితుల్లో ఉన్నాయి. కమిటీ సూచించిన విధంగా కాలనీలలో గల ఆస్తికి వారిని హక్కుదారులుగా చేయటం వల్ల వివక్ష తగ్గదు కదా. భారతదేశంలో గల సుమారు 850 కాలనీల సంలీనం చాలా గడ్డుసమస్య. అయినా మొత్తం మీద కమిషను సిఫారసులు ముందుచూపుతో, ప్రగతి పధంలో ఉన్నాయి. వాటిని వీలయినంత త్వరగా వాటిని అమలుపరచాలి.[1]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]