కూనలమ్మ పదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూనలమ్మపదాలు
ముఖచిత్రం
ముఖచిత్రం
కృతికర్త: ఆరుద్ర
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 2001

ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన కూనలమ్మ పదాలు [1] అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర.ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. ఈ కూనలమ్మ పదాలు ఇదివరకు జ్యోతి మాస పత్రికలో ప్రచురితమై విశేషంగా పాఠకుల అభిమానం పొందాయి. వీటి సంకలనమే ఈ పుస్తకం. ఈ కూనలమ్మ పదాలకు తోడు ముచ్చటయిన బాపు బొమ్మలు (కార్టూన్లు) అదనపు ఆకర్షణ.

ఆరుద్ర ఈ పద్యాల్ని ముళ్ళపూడి వెంకటరమణకు జనవరి 26, 1964న పెళ్ళికానుకగా ఇచ్చాడు


మహాకవి శ్రీశ్రీ మాటల్లో కూనలమ్మ పదాల ఆరుద్ర గురించి.

కూనలమ్మ పదాలు
వేనవేలు పదాలు
ఆరుద్రదే వ్రాలు


కూనలమ్మ పదాలు
లోకానికి సవాలు
ఆరుద్రదే వ్రాలు

కూనలమ్మ పదాలు
కోరుకున్న వరాలు
ఆరుద్ర సరదాలు


కొన్ని కూనలమ్మ పదాలు[మార్చు]

సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ !


ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ !


సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రథమ్ము
ఓ కూనలమ్మ !


సగము కమ్యూనిస్ట్
సగము కాపిటలిస్ట్
ఎందుకొచ్చిన రొస్టు
ఓ కూనలమ్మ !


అరుణబింబము రీతి
అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి
ఓ కూనలమ్మ !


మధువు మైకము నిచ్చు
వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు
ఓ కూనలమ్మ !


తమిళం గురించి -
తమలములు నములు
దవళతో మాట్లాలు
తానెవచ్చును తమిళు
ఓ కూనలమ్మా!


శ్రీశ్రీ గురించి -
రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ !


కృష్ణశాస్త్రి గురించి -
కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ !


బాపు గురించి -
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఈనాడు జాలస్థలిలోని సాహితీ సంపదలో కూనలమ్మ పదాల పేజీ". Archived from the original on 2012-02-08. Retrieved 2012-02-08.