కూర్మాపు నరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూర్మాపు నరసింహం చిత్రకారుడు

కూర్మాపు నరసింహం మంచి చిత్రకారుడు . కుంచెతో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు .

శ్రీకాకుళం పట్నంలో చిన్నబజారులో ఉన్న నాగేశ్వరరావు ఫోటో స్టుడియోలో ఎన్నో చిత్ర కళా ఖండాలు ఆయన వేసినవే . శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో నరసింహం గీసిన " ఛత్రపతి శివాజీ కి వీరఖడ్గం అందిస్తున్న భ్రమరాంభికాదేవి " చిత్రపటాన్ని తిలకించిన అప్పటి ప్రధాని ' జవహర్ లాల్ నెహ్రూ ' ఈ చిత్ర కారుడుని నేను చూడాలని ఉంది అన్నారంటే నరసింహం భావం ఎంత ఉన్నతమైనదో అవగతము కాగలదు . మల్లెపువ్వుల్లాంటి నేత చీరల్లో అంతుపట్టని హావభావాలతో రంగుదాల్చిన ముగ్ద మనోహరిని ' సుందరమూగా చిత్రీకరించారు . మహాత్ముడు దూసి గ్రామానికి వచ్చినప్పుడు గాంధీజీ నిలువెత్తు చిత్రాన్ని గీసి ఇచ్చి ఆయన ప్రశంసలు పొందేరు . కూర్మాపు చిత్రించిన " బుద్దుని క్షీరనివేదనమ్ " బొమ్మను జపాన్ బౌద్ధ అధ్యయన బృందము చూసి ప్రశంసించి నరసింహం చిత్రపటానికి సాష్టాంగ నమస్కారము చేసారు .

జీవిత విశేషాలు :[మార్చు]

పేరు : కూర్మాపు నరసింహం, ఊరు : గుల్ల సీతారాంపురము -- సంతకవిటి మండలం . మరణము : సెప్టెంబరు 28 1968 . సోదరుడు : కూర్మాపు బుచ్చిబాబు,

మూలాలు[మార్చు]