కూర్మా వేణు గోపాలస్వామి
కూర్మా వేణు గోపాలస్వామి | |
---|---|
జననం | కూర్మా వేణు గోపాలస్వామి 1903 డిసెంబర్ 19 |
మరణం | 1983 |
ఇతర పేర్లు | కె.వి. గోపాలస్వామి |
వృత్తి | ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్ర విభాగానికి మొదటి ఆచార్యులు విశ్వవిద్యాలయం నందు రిజిస్ట్రార్ |
ప్రసిద్ధి | రచయిత, సాహితీవేత్త |
తండ్రి | సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు |
కె.వి. గోపాలస్వామి లేదా కూర్మా వేణు గోపాలస్వామి (1903–1983) నాటక ప్రయోక్త, న్యాయవాది. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి మొదటి ఆచార్యుడు. థియేటర్ ఆర్ట్స్ విభాగానికి గౌరవ ప్రొఫెసర్,[1] ఆర్ట్స్ విభాగానికి ఛైర్మన్ గా కూడా పనిచేసాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]కూర్మా వేణుగోపాలరావు 1903 డిసెంబర్ 19 న జన్మించాడు. అతని తండ్రి "సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు" మద్రాసు ప్రెసిడెన్సీకి గవర్నర్గా ఉండేవాడు. వేణుగోపాలరావుకు ఒక సోదరి ఉంది. అతను న్యాయ శాస్త్రం లో పట్టభద్రుడయ్యాడు. అతను ఆక్స్‌ఫర్డు బాల్లియోల్ కాలేజిలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను "బార్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్" అని పిలువబడేవాడు.
జీవితం
[మార్చు]అతడు 1930 లో దక్షిణ ఆఫ్రికాలో ఏజెంట్ జనరల్ ఆఫ్ ఇండియాకు సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన భారత దేశం వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం నకు సేవలందించాడు. అతను విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 1942 నుండి 1964 వరకు పనిచేసి, రిజిస్టార్‌గా పదవీ విరమణ చేసాడు. [2] దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన నాటకరంగంలో చేసిన కృషికి అతను చిరస్మరణీయుడైనాడు. అతని ప్రయత్నాల ఫలితంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం స్థాపించబడింది. వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్ వ్యక్తిగత ఆసక్తి కారణంగా ఆంధ్ర వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి సంవత్సరం వారం రోజుల ఆంధ్ర వారోత్సవాల నిర్వహణలో గోపాలస్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. పదవీ విరమణ తరువాత 1973 లో హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు అండ్ కామర్స్ డైరెక్టర్ పదవిలో 1978 వరకు ఉన్నాడు.[3] అతను హాకీ, టెన్నిస్ ఆటాలను ఆడాడు. అతను మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.
అతను అనేక అంతర్జాతీయ జట్లతో హాకీ ఆడాడు. ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌తో భాగస్వామి పాల్గొన్నాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వై.సి. సింహాద్రి అధ్వర్యంలో అతని జన్మ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఆ ఉత్సవాలు డిసెంబర్ 19, 2003 న ప్రారంభించబడ్డాయి. అవి జనవరి 29, 2004 న వీడ్కోలు సభతో ముగిసాయి. అతని విద్యార్థులు, లబ్ధిదారులు అతను రాసిన కథనాలతో ఒక స్మారక చిహ్నాన్ని విడుదల చేశారు.[4]
1977 లో 50వ స్నాతకోత్సవం సందర్భంగా అతను చేసిన సేవలు, మేధోపరమైన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనికి గౌరవ డాక్టరేట్ (డి.లిట్) లభించింది. విశ్వవిద్యాలయ అధికారులు కృతజ్ఞతా చిహ్నంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓపెన్-ఎయిర్ థియేటర్‌కు అతని పేరు పెట్టారు. ప్రొఫెసర్ కె.వి. గోపాలస్వామి మెమోరియల్ ఆల్ ఇండియా ప్లేలెట్స్ పోటీలు ఏటా నిర్వహించబడుతున్నాయి. అతను 1983లో మరణించాడు.
రచనలు
[మార్చు]- ఇంటర్మీడియట్ రంగస్థల శాస్త్రం [5]
మూలాలు
[మార్చు]- ↑ "Department of Theatre Arts Profile". Archived from the original on 2009-03-01. Retrieved 2013-05-09.
- ↑ "List of Registrars of Andhra University at AU website". Archived from the original on 2009-06-20. Retrieved 2013-05-09.
- ↑ "Profile of Indian Institute of Management and Commerce". Archived from the original on 2013-05-05. Retrieved 2013-05-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-05. Retrieved 2013-05-09.
- ↑ Complete book at Internet archive.